breaking news
Ashish Agarwal
-
ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వే పరుగులు
దక్షిణ మధ్య రైల్వే ఆదాయ మార్గంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రయాణికుల రవాణా పైన రూ.844.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆశీష్ అగర్వాల్ చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ లోకో షెడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరం 63.67 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.4,348 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా... ఈ ఏడాది నవంబర్ నాటికే 43.6 టన్నుల సరుకు రవాణా చేసినట్లు తెలియజేశారు. నవంబర్ నాటికి నిర్ధేశించిన 41.6 టన్నుల కంటే ఇది ఎక్కువేనని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని, 5 అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. అలాగే 14 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మరో ఎన్నారై
న్యూయార్క్: అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న భారత సంతతి వ్యక్తి ఆశిష్ అగర్వాల్ (27), ఆయన మిత్రులు ఇద్దరు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ముందు లొంగిపోయారు. అయితే, తామే నేరం చేయలేదని వారు న్యాయస్థానానికి విన్నవించారు. 2011 జూన్-2013 జూన్ మధ్య కాలంలో జేపీ మోర్గాన్ సెక్యూరిటీస్‌కి చెందిన శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో ఆశిష్ అగర్వాల్ సెక్యురిటీ అనలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో పీఎల్ఎక్స్ టెక్నాలజీస్‌ను ఇంటిగ్రేటెడ్ డివైజ్ టెక్నాలజీ, ఎగ్జాక్ట్టార్గెట్ను సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్ కొనుగోలు చేసే డీ ల్స్‌కు జేపీ మోర్గాన్ సలహాదారుగా వ్యవహరించింది. అభియోగాల ప్రకారం.. ఈ రెండు డీల్స్‌కి సంబంధించిన కీలక విషయాలను ఆశిష్.. తన స్నేహితుడు షహర్యార్ బొలాందియాన్కు చేరవేశారు. ఆ వివరాలను షహర్యార్ తన మిత్రుడు కేవన్ సాదిఘ్కు అందించారు. ఈ కీలక ఇన్సైడర్ సమాచారాన్ని ఉపయోగించి వీరు 6,72,000 డాలర్ల మేర లాభపడ్డారని, అగర్వాల్, షహర్యార్ ఈ సొమ్మును గతంలో వచ్చిన ట్రేడింగ్ నష్టాలను భర్తీ చేసుకునేందుకు, రుణాలు తీర్చేందుకు ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అగర్వాల్ ఈ ఆరోపణలు ఖండించారు.