breaking news
ashes series 2015
-
బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదం.. వాళ్లు మనుషులైతే బహిరంగా క్షమాపణ చెప్పాలి..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు సర్ జెఫ్రీ బాయ్‌కాట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ ఆటగాళ్లు నిజంగా మనుషులైతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసీస్, ఇంగ్లండ్ జట్లు అద్భుతమైన క్రికెట్ ఆడాయి.. ఇలాంటి ఘటనలు ఆట స్ఫూర్తికి మంచిది కాదని అన్నారు. అందరం తప్పులు చేస్తాం.. బెయిర్‌స్టో విషయంలో ఆసీస్ కూడా తప్పు చేసింది.. ఈ విషయంలో వారు తమ తప్పును అంగీకరించాలని కోరారు. ఏ పద్దతిలోనైనా గెలవాలనుకునే వారికి క్రికెట్ సరైన ఆట కాదని, ఇలాంటి (బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్) ఘటనలు జెంటిల్మెన్ గేమ్ ప్రతిష్టను మసకబారుస్తాయని తెలిపాడు. గెలవడం కోసం కష్టపడటం మంచిదే, కానీ క్రీడా స్పూర్తిని మరిచి గెలవాలనుకోవడం మాత్రం సరైంది కాదని హితవు పలికాడు. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానికి క్రికెట్ చట్టాలను ఆపాదించడం కరెక్ట్ కాదని, ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్ధి జట్లు ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా, రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో బెయిర్‌స్టో చేసిన అనాలోచిత పని (బంతి వికెట్ కీపర్ చేతిలో ఉండగానే క్రీజ్ వదిలి బయటికి రావడం) ఇంత వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బెయిర్‌స్టో నిర్లక్ష్యం కారణంగా ఇంగ్లండ్ మ్యాచ్‌ను కోల్పోవడంతో పాటు ఈ విషయాన్ని పెద్దది చేసినందుకు నవ్వులపాలైంది. బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఫలితంగా ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
ఆస్ట్రేలియా అదరహో
రెండో టెస్టులో జయభేరి 405 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు లార్డ్స్: యాషెస్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. తొలి టెస్టులో ఎదురైన ఓటమి ప్రభావాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా రెండో టెస్టులో దుమ్మురేపింది. అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని చలాయించింది. ఇంగ్లండ్‌పై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో క్లార్క్ సేన 405 పరుగుల భారీ తేడాతో కుక్ బృందాన్ని చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూలు 1-1తో సమం చేశారు. ఆసీస్ నిర్దేశించిన 509 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. జాన్సన్ 3, హజెల్‌వుడ్, లియోన్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు 108/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లలో 2 వికెట్లకు 254 పరుగులకు డిక్లేర్ చేసింది. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఈనెల 29 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది.