breaking news
arts students
-
హాల్ టికెట్ టెన్షన్
60 శాతం హాజరు లేని ఇంటర్ విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇవ్వని వైనం జిల్లాలో 90 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంఆర్థిక ఇబ్బందులతో గైర్హాజరయ్యామంటున్న విద్యార్థులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొంత మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. దాదాపు 76 వేల మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కాగా హాజరు శాతం తక్కువగా ఉన్న 90 మందికి హాల్ టిక్కెట్లు ఇవ్వకపోడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలి. వారికే హాల్ టిక్కెట్లను ఇస్తారు. 69-74 శాతం హాజరు ఉంటే రూ. 200, 65-69 శాతం హాజరుకు రూ.250, 60-64 శాతం హాజరుకు రూ. 400 అపరాధ రుసుంతో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తారు. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించరు. దాదాపుగా ప్రైవేట్ కళాశాలల్లో హాజరు శాతం తక్కువగా ఉన్నా విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఆయా యాజమన్యాలు రూ.2 వేల వరకు వారి నుంచి వసూలు చేసి 60 శాతానికిపైగా హాజరు వేసి ఇబ్బంది లేకుండా చూస్తారు. అయితే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో కచ్చితమైన హాజరు ఉంటుంది. వీరికి హాజరులో ప్రిన్సిపాళ్లు ఎలాంటి మినాహాయింపు ఇవ్వరు. ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షణ హాజరు శాతం తక్కువగా ఉన్నా ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రం అనుమతి ఇస్తారు. సైన్స్ విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో 60 శాతం హాజరు లేకుంటే అనుమతించరు. ప్రతి ఏటా చివరి సమయంలో ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రం రూ. 500 ఫైన్‌తో పరీక్షలు రాసేందుకు వీలు కల్పిస్తారు. అయితే ఈ సారి మరో మూడు రోజుల సమయమే ఉన్నా ఆర్ట్స్ విద్యార్థుల అనుమతిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం పరీక్షలకు అనుమతి ఇస్తుందా లేదా అన్న విషయంపై విద్యార్థులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉండాలి. లేకుంటే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వం. అయితే కొన్ని సడలింపులతో 60 శాతం హాజరు ఉన్నా హాల్ టిక్కెట్లు ఇస్తున్నాం. కనీసం 60 శాతం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేందుకు మాకు అధికారంలేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. - పరమేశ్వరరెడ్డి, ఆర్ఐఓ 58 శాతం హాజరు ఉంది నా పేరు రమేష్. మా ఊరు పర్ల. నేను బీక్యాంపు జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాను. కరువు పరిస్థితుల నేపథ్యంలో కళాశాలకు సక్రమంగా హాజరు కాలేదు. 58 శాతం హాజరు ఉంది. పరీక్ష ఫీజు కట్టాను. ఇప్పుడు పరీక్షలు రాయనీయమంటే ఎలా? రమేష్, బీక్యాంప్ జూనియర్ కళాశాల -
ఆకట్టుకున్న 'రోల్ ప్లే' నాటిక
హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధులు తిరిగి వచ్చారు. ప్రస్తుత రాజకీయనాయకులు కూడా అందరూ ఒకే దగ్గరకు చేరుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామీ ప్రధాన పాత్రలో వీరంతా భారత దేశ భవిష్యత్తు గురించి పలు ఆసక్తికర అంశాలను స్పృశించారు. ఇదంతా ఏంటా అనుకుంటున్నారా? సెయింట్ ఆన్స్ మహిళా జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్ట్స్ విద్యార్ధులు శనివారం ఉదయం చేసిన నాటికలోని సారాంశం. ప్రముఖ హాలీవుడ్ మూవీ 'నైట్ ఎట్ మ్యూజియం' కథ ఆధారంగా సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు 'రోల్ ప్లే'నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో మ్యూజియానికి వెళ్లిన ఆర్నబ్ గోస్వామీ తన వస్తువును మరచిపోతాడు. తిరిగి మ్యూజియం వెళ్లి చూసే సరికి మ్యూజియంలోని స్వాతంత్ర్య సమరయోధులు(భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీభాయ్, అనిబిసెంట్, మహాత్మా గాంధీ) తిరిగి వస్తారు. వీరితో పాటు ప్రస్తుత రాజకీయ నాయకులు( లాలు ప్రసాద్ యాదవ్, సృతి ఇరానీ, జయలలిత) కూడా వేదికపై దర్శనమిస్తారు. ఈ నాటికలో ఆర్నబ్ గోస్వామి దేశ భవిష్యత్తు మీద విద్యార్థుల(పాత్ర దారులు)తో కలిసి సరికొత్త అంశంపై చర్చాగోష్టి నిర్వహించడం అందర్నీ ఆకట్టుకుంది. వీరందరిని ఆర్నబ్ అడిగే ప్రశ్నలు వీక్షకుల్ని ఆలోచింపజేసేవిలా ఉంటాయి. ఈ కథతో చేసిన నాటిక అందరిలో దేశభక్తిని పెంచేలా చేసిందని ప్రిన్సిపల్ పుష్పలీలా కొనియాడారు. -
గురుకుల కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విజయపురి సౌత్‌లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో సైన్స్ - ఆర్ట్స్ విద్యార్థులు గొడవపడ్డారు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కళాశాల వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.