breaking news
Art Corner
-
జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!
జైలును కళలకు కేంద్రంగా మార్చడం ఏమిటి? అని సందేహంగా చూడకండి. నిజానికి ఇది చాలా ప్రసిద్ధిగాంచిన జైలు. ఈ జైలులోంచి ఎందరో గొప్ప గొప్ప కవులు పుట్టుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆ జైలు అధికారులు ఆ జైలుని వేలం వేయాలని చూస్తున్నారు. అయితే ఒక వీధి కళాకారుడు తన కళలతో వేలం ద్వారా వచ్చేంత డబ్బను ఇస్తానంటూ ఆ జైలుని భవనాలు అభివృద్ధి చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చేయాలని తపిస్తున్నాడు. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) అసలు విషయంలోకెళ్లితే... ఇంగ్లాండ్‌కి చెందిన అజ్ఞాత వీధి కళాకారుడు బ్యాంక్సీ జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడానికి మిలియన్లు సేకరిస్తున్నాడు. అయితే ఈ జైలు రీడింగ్ జైలుగాప్రసిద్ధి చెందింది. అంతేకాదు ప్రసిద్ధ ఐరిష్ కవి నాటక రచయిత అయిన ఆస్కార్ వైల్డ్‌ను కలిగి ఉంది. అంతేకాదు జైలు అంటే ఒక నరకకూపంగా భావిస్తాం. అలాంటి ప్రదేశాన్ని కళకు కేంద్రంగా మార్చి పరిపూర్ణమైనదిగా చేయాలని తపిస్తున్నట్లు చెబుతాడు. ఈ మేరకు బ్యాక్సీ "క్రియేట్ ఎస్కేప్" పేరుతో గోడ చిత్రాలను వేస్తాడు. దీంతో అక్కడ ఉన్న ప్రజల ఆ జైలు గోడల పై వేసిన చిత్రాల పట్ల ఆకర్షితులవుతారు. అంతేకాదు ఈ చిత్రాలను విక్రయించిన సోమ్ము జైలు అధికారులు వేలంలో ఆర్జించాలనకున్న దాదాపు రూ 100 కోట్లుకి సరిపోతుందని హామీ కూడా ఇస్తాడు. అయితే ఈ చిత్రం ఈ నెల ప్రారంభంలో బ్రిస్టల్ మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించబడుతుందని, పైగా రూ 130 లక్షల వరకు సేకరించిగలనని ధీమా వ్యక్తం చేస్తాడు. ఈ మేరకు బ్యాంక్సీ ఈ జైలుని ఆర్ట్ సెంటర్‌గా మార్చేలా ప్రచారం కూడా చేస్తాడు. జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చాలనే ప్రచారానికి ఇప్పటికే నటులు డేమ్ జూడి డెంచ్, సర్ కెన్నెత్ బ్రనాగ్, కేట్ విన్స్లెట్, నటాలీ డోర్మెర్ నుండి మద్దతు లభించింది. అంతేకాదు బ్యాంక్సీ దీనికి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!) View this post on Instagram A post shared by Banksy (@banksy) -
అనుమానితుడు
దేవా మంచి చిత్రకారుడు. ఇప్పుడిప్పుడే అతడి చిత్రాలు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నాయి.స్నేహితులు, సన్నిహితుల సలహా మేరకు తొలిసారిగా నగరంలో ‘ఆర్ట్ కార్నర్’ గ్యాలరీలో ఆర్ట్ షో ఏర్పాటు చేశాడు. మంచి స్పందన వచ్చింది. ఆర్ట్ షో మొదలై ఆరు రోజులవుతోంది.ఆరోజు పండగ కావడంతో సందర్శకులు పెద్దగా లేరు.ఏదో అర్జంటు కాల్ రావడంతో...ఒక స్నేహితుడిని గ్యాలరీలో కూర్చోమని చెప్పి బయటికి వెళ్లాడు దేవా.గ్యాలరీలో కూర్చున్న ఆ స్నేహితుడు... కొద్దిసేపటి తరువాత ఒక నవల చదవడంలో నిమగ్నమైపోయాడు.సాయంత్రం పూట గ్యాలరీకి వచ్చిన దేవా కొద్దిసేపటి తరువాత షాక్ తిన్నాడు.తనకు ఎంతగానో పేరు తెచ్చిన ‘ది బ్లూ రోజ్’ పెయింటింగ్ మాయమైంది! షాక్‌లో నుంచి తేరుకొని.... ‘‘ది బ్లూ రోజ్‌ను ఎవరైనా అడిగారా?’’ అన్నాడు స్నేహితుడితో.‘‘ఎవరూ అడగలేదు’’ తాపీగా చెప్పాడు ఆ స్నేహితుడు.‘‘ది బ్లూ రోజ్ పెయింటింగ్‌ను ఎవరో దొంగిలించారు’’ విషయం చెప్పాడు దేవా. స్నేహితుడు షాక్ తిన్నాడు.ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆరోజు గ్యాలరీకి వచ్చిన సందర్శకులు అయిదు మంది.గ్యాలరీ హాల్లో ఎలాంటి వీడియో, కెమెరాలు లేవు.అందుకే పోలీసులు ‘ఎంట్రెన్స్ వీడియో’ను పరిశీలించారు. మధ్యాహ్నం 1:10... ఒక మహిళ వచ్చారు.ఆతరువాత... 2: 06 ...ఒక పెద్దాయన వచ్చారు. 2:47.... ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. 3: 33....ఒక యువకుడు వచ్చాడు. ఈ అయిదుగురు బయటికి వెళుతున్నప్పటి దృశ్యాలను చూశారు. ఎవరి చేతుల్లోనూ పెయింటింగ్ కనిపించలేదు. మరో విశేషం ఏమిటంటే...ఈ అయిదుగు బ్యాగ్‌లు లాంటి వస్తువులేమీ లేకుండా ఖాళీ చేతులతోనే గ్యాలరీకి వచ్చారు. అయినప్పటికీ.... చివర్లో వచ్చిన యువకుడిని ‘దొంగ’గా తేల్చారు. ఏ ఆధారంతో పోలీసులు ఆ యువకుడిని అనుమానించారు? 2 తన గదిలో నిద్రపోతున్న బలరామ్‌ను విండో నుంచి కాల్చి చంపారు హంతకులు. పోలీసులు ఆధారాల కోసం వెదకడం మొదలు పెట్టారు. ఒక చోట... షూ గుర్తులు కనిపించాయి. అన్నీ... సైజ్ నంబర్ 10 పోలీసులు ముగ్గురిని అనుమానించారు. 1.రాజు 2.రవి 3.రమణ రాజు షూస్ సైజ్.... 9 రవి షూస్ సైజ్..... 10 రమణ షూస్ సైజ్... 9 ‘‘ఇక ఆలస్యం ఎందుకు? రవే హంతకుడు. అరెస్ట్ చేద్దాం’’ అంటూ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే హత్యతో రవికి ఎలాంటి సంబంధం లేదనే విషయం తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. ఏ ఆధారంతో పోలీసులు రవి హంతకుడు కాదని, రాజు, రమణ హంతకులని తేల్చారు? 1 గ్యాలరీలోకి ప్రవేశించే ముందు... ఆ యువకుడు టక్ చేయలేదు. గ్యాలరీ నుంచి వెళ్లేటప్పుడు మాత్రం... టక్ చేసి కనిపించాడు. దొంగిలించిన పెయింటింగ్‌ను షర్ట్ లోపల దాచాడు. 2 నేరం రవి మీద పోవడానికే... 10 సైజ్ షూస్ ధరించి హత్యకు పాల్పడ్డారు రాజు, రమణ. గమనించాల్సిన విషయం ఏమిటంటే హత్యకు ఒకరోజు ముందు రవి దుబాయికి వెళ్లాడు. ఈ విషయం హంతకులకు తెలియదు!