breaking news
Art and Cultural Center
-
రవీంద్ర నాట్య మందిర్ పునఃప్రారంభం
ముంబై: కళాకారులు, రంగస్థలనటులకు ప్రీతిపాత్రమైన రవీంద్ర నాట్య మందిర్ ఆడిటోరియం, పీఎల్ దేశ్‌పాండే మహారాష్ట్ర కళా అకాడమీ తిరిగి ప్రారంభం కానున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తైన నేపథ్యంలో ఫిబ్రవరి 28న జరిగే పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్లు హాజరుకానున్నారని ఈ సందర్భంగా అకాడమీ కొత్త చిహ్నం ఆవిష్కరణ కూడా జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ‘రీఓపెన్’ఆర్ట్స్’ కమ్యూనిటీకి కొత్త ఉదయం– మంత్రి ఆశిష్ షెలార్ ఈ సందర్భంగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న థియేటర్, ఆర్ట్స్ కమ్యూనిటీకి ఈ కార్యక్రమం ‘కొత్త ఉదయాన్ని‘ తెస్తుందని అన్నారు. అకాడమీతో తరతరాలుగా కళాకారులను, వారిలోని ప్రతిభకు మెరుగులద్దుతూనే ఉన్నామని , దీన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పునరుద్ధరించిన రవీంద్ర నాట్య మందిర్‌లో అధునాతన సౌండ్ సిస్టమ్స్, రిఫైన్డ్ ఇంటీరియర్స్, రెండు చిన్న థియేటర్లు, ఐదు ఎగ్జిబిషన్ హాళ్లు, ఆరి్టస్టుల కోసం 15 రిహార్సల్ రూమ్‌లు, గ్రాండ్ ఓపెన్–ఎయిర్ స్టేజ్, వర్చువల్ చిత్రీకరణ, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ కోసం స్టూడియోలు ఏర్పాటు చేశామని ఉన్నాయని మంత్రి తెలిపారు. అకాడమీలో త్వరలో వివిధ కళారూపాలకు సంబంధించి 20 సరి్టఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
కాఫీ @ గ్యాలరీ
కాఫీ షాప్‌ల్లో కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించటం మామూలే. కానీ ఆర్ట్ అండ్ కల్చరల్ సెంటర్స్‌లో కెఫేల ఏర్పాటు ఇప్పుడు నగరంలో కొత్త ట్రెండ్. కళలకు వేదికలైన ఈ సెంటర్స్ ఫేవరెట్ ప్లేసెస్. అక్కడ ప్రదర్శనలు చూసిన తరువాత ఆర్టిస్ట్స్, ఆర్ట్ లవర్స్ సంభాషణలకు కొనసాగింపు ఇక్కడి కెఫేలు. ఆసక్తి, అభిరుచిని పంచుకునే వారందరినీ కలుపుతూ వారి జీవితంలోని వెలితిని పూరిస్తున్నాయి. భారమైన క్షణాలను దూరం చేస్తున్నాయి! ..:: ఓ మధు కల్చరల్ సెంటర్స్.. కళే కాకుండా కప్పు కాఫీ, బోలెడు మాటలను పంచుతున్నాయి. కాఫీ కళాకారుడి మెదడుకి ఎంత గొప్ప ముడిసరుకో వేరే చెప్పక్కర్లేదేమో!. ఈ వరుసలో బంజారాహిల్స్ కళాకృతి ఆర్ట్ గ్యాలరీ.. ఆర్ట్ లవర్స్‌ని కొత్తగా పలకరిస్తోంది. గ్యాలరీకి వచ్చిన వాళ్లు ప్రదర్శన చూశాక కళాకారులతో కాసేపు ముచ్చటించాలనుకుంటారు. కళలపై ఆసక్తి ఉన్న తోటివారితో కొన్ని అనుభవాలు పంచుకోవాలని అనుకుంటారు. ఈ అవసరాలను, ఆసక్తిని గుర్తించి వారి కోసం, ఆర్ట్ అండ్ క్రియేటివ్ విషయాలు మాట్లాడుకుంటూ కాసేపు గడపాలనుకునే వాళ్ల కోసం కెఫే ఏర్పాటు చేశారు. కెఫేలో కప్పు కాఫీ తాగి వెళ్లటమే కదా అని అనుకోవటానికి లేదు. డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ ఫొటో షూట్స్, మ్యూజిక్ కన్సర్ట్స్.. ఇలా మీ టాలెంట్ ఏదైనా ఇక్కడ పెర్ఫాం చేయవచ్చు. ఆక్షన్ వాల్, చారిటీ వాల్, బ్లెస్సింగ్స్ ట్రీ, బుల్లి లైబ్రరీ, మల్టీమీడియా ఇన్‌స్టాలేషన్స్ అంతే కాదు 37 రకాల టీ, కాఫీలతో స్పెషల్ బరిస్తా ఉన్న ఈ కెఫేలో ఇంకా ఎన్నో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్స్ యాడ్ కానున్నాయి. ఎక్స్టెన్షన్... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని కొత్తగా ఈ గ్యాలరీని ప్రారంభించిన సుప్రియ లహోటి ‘కళాకృతి ఆర్ట్ గ్యాలరీకి ఎక్స్‌టెన్షన్‌గా, విభిన్నంగా కెఫే ప్రారంభించాలని అనుకున్నప్పటి నుంచి వెల్‌విషర్స్ అనేక సలహాలు ఇచ్చారు. లక్ష్మణ్ ఏలే, రాజేశ్వరరావ్, సచిన్ జల్తార్, చిప్పా సుధాకర్, శ్రీనివాస్‌రెడ్డి, రవికాంత్, సునీల్ లోహార్, అక్షయ్ ఆనంద్ సింగ్, అఫ్జా తమ్కనాత్ లాంటి ఎమినెంట్ ఆర్టిస్ట్‌ల ఆర్ట్ వర్క్‌తో రూపొందిన ఫర్నిచర్, పెయింటింగ్స్, క్రాఫ్ట్స్ ఈ కెఫేలో ఉంటాయి. ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడ స్పెండ్ చెయ్యటమే కాదు, నచ్చిన ఆర్ట్ పీస్‌ని కొనుక్కుని వెళ్లొచ్చు’ అంటున్నారు. గోథెజంత్రంలో స్ట్రీట్ ఫుడ్.. జర్మన్ స్టడీ సెంటర్ గోథెజంత్రంలోనూ ఈ తరహా వాతావరణం కనిపిస్తోంది. కళాకారులు, కళాభిమానులతో పాటు స్టూడెంట్స్ ఇక్కడికి వస్తుంటారు. లైక్‌మైండెడ్ పీపుల్ ఒక చోట చేరితే కబుర్లకు కొదవేముంటుంది! అందుకే.. అంతే క్రియేటివ్‌గా జనాలకు కాస్త టీ, కాఫీ వెసులుబాటు కల్పించి తమ కళల ప్రపంచంలో మునిగి తేలేలా చేస్తున్నారు. పూర్తి వీగన్ ఫుడ్ ఇక్కడ స్పెషల్. డీప్ ఫ్రై, మైదా లాంటివి కాకుండా ఆల్టర్నేటివ్గా ఉండే హెల్తీఫుడ్ ఈ కెఫే స్పెషల్. స్ట్రీట్ ఫుడ్ తరహా సెటప్‌తో అందిస్తున్న ఈ ఫుడ్ అందరికీ నచ్చుతుందని చెబుతాడు చెఫ్ ధనుష్. ‘ఇక్కడ స్టూడెంట్స్ కూర్చుని గంటలు గంటలు చదువుకుంటూ ఉంటారు. కప్పు కాఫీ తాగి ఒక బైట్ ఏదైనా తినగలిగితే బాగుండనుకుంటారు. వాళ్లతో పాటు ఆర్టిస్టులూ ఉంటారు. మెనూ కూడా చాలా హెల్త్ కాన్షియస్తో చేసింది. హెల్తీ, టేస్టీ, ఆల్టర్నేటివ్ ఫుడ్ ఉండేలా చూస్తున్నాం’ అంటున్నారు దీని నిర్వాహకురాలు అమితా దేశాయ్. ఈ రెండే కాదు.. బంజారాహిల్స్‌లోని ఓపెన్ కల్చరల్ సెంటర్ లామకాన్ ఇరానీ కేఫ్ తరహాలో స్నాక్స్‌ని అందిస్తోంది. అక్కడికి వచ్చే టెకీలకు, ఆర్ట్ లవర్స్‌కి, సినిమా పీపుల్‌కి మోస్ట్ ఫేవరెట్స్.. ఇక్కడి చాయ్ సమోసా, కిచిడీ, బ్రెడ్ ఆమ్లెట్, ఉస్మానియా బిస్కెట్.