breaking news
Armed Reserve staff
-
మహబూబాబాద్‌లో విషాదం: ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం బావురుగొండలో ఏఆర్ ఎస్సై పడిగ శోభన్‌బాబు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ప్రాణాలు విడిచారు కాగా శోభన్‌బాబు సత్తుపల్లి బెటాలియన్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ లీవ్‌లో సోమవారం ఇంటికి వచ్చిన శోభన్‌బాబు.. పొలం వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు -
నిఘా నీడలో సార్వత్రిక ఎన్నికలు
కర్నూలు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలను ప్రశాం తంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ రఘురామిరెడ్డి దృష్టి సారించారు. రాయలసీమ ఐజీ నవీన్‌చంద్ రెండు రోజులుగా కర్నూలులోనే తిష్ట వేసి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. పోలింగ్‌కు కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే జల్లాకు 16 కంపెనీల కేంద్ర బలగాలను రప్పించారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంకు చెందిన మూడు కంపెనీల సిబ్బంది సేవలను ఎన్నికలకు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్మ్డ్ రిజర్వు సిబ్బందితో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా బందోబస్తు విధులకు వచ్చారు. జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు పాణ్యం, కోడుమూరు, బనగానపల్లె నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. రాజకీయ వైరుధ్యం ఉన్న 200 గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఏసీబీ జాయింట్ డెరైక్టర్ శ్రీకాంత్ గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. ఈయనను జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమిం చారు. సోమవారం రాత్రి ఆయన కర్నూలుకు చేరుకున్నారు. అలాగే ఎన్నికల విధులకు ఆరుగురు ట్రైనీ ఐపీఎస్‌ల సేవలను వినియోగించుకుంటున్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఇద్దరు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు ఎన్నికల విధులకు నియమించారు. సోమవారం జిల్లా పోలీసు మైదానం నుంచి కేంద్ర బలగాలతో పాటు మిగిలిన సిబ్బంది బందోబస్తుకు బస్సుల్లో తరలివెళ్లారు.