Arjun Ram
-
సైబర్ మోసాలపై ‘అర్జున’ బాణం !
హనుమకొండ చౌరస్తా: కొన్ని నెలల కిందట వాట్సాప్‌లో వచి్చన ఓ లింక్‌ను క్లిక్ చేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ. 60 వేలు ఖాళీ కావడంతో అతను లబోదిబోమన్నాడు. దీంతో ఓ పక్కింటి కుర్రాడు పరుగున వచ్చి ఆ వ్యక్తి చేతిలోని ఫోన్ తీసుకొని చిటికెలో ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది.. ఎవరు మోసం చేశారో ఐపీ అడ్రస్‌తో సహా గుర్తించాడు. ఆ కుర్రాడు చేసిన సాయంతో చివరకు 24 గంటల్లోనే బాధితుడి సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో జమ అయింది.ఆ కుర్రాడి వయసు అప్పుడు 16 ఏళ్లే. అతను అప్పుడు చదివేది ఇంటర్ ఫస్టియరే. ఓవైపు చదువు.. మరోవైపు సైబర్ క్రైమ్‌ను నిరోధించడానికి సొంతంగా సాధన చేశాడు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఏం చేయాలో ఆలోచించాడు. చివరకు ‘స్కామ్ సెక్యూర్1’అనే వెబ్‌సైట్‌ను స్వయంగా రూపొందించాడు. ఆ కుర్రాడే హనుమకొండలోని నక్కలగుట్టకు చెందిన కుందారపు అర్జున్‌రామ్ (17). 7 నెలల శ్రమకు ప్రతిరూపం.. అర్జున్‌రామ్ దాదాపు 7 నెలలపాటు శ్రమించి ‘స్కామ్ సెక్యూర్1’కు రూపకల్పన చేశాడు. అనంతరం ఈ వెబ్సైట్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ విభాగం తాజాగా దాన్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచేందుకు ఆమోదం తెలిపింది. లాగిన్ అయితే చాలు.. స్కామ్ సెక్యూర్1 (https://scamsecure1.com/) వెబ్సైట్లో పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఇవ్వడంతోపాటు ఫోన్‌కు వచ్చే అనుమానాస్పద వెబ్ లింకులు లేదా మెసేజ్‌లను అందులో పేస్ట్ చేయగానే అవి సైబర్ మోసగాళ్లు పంపినవా కాదా అనే విషయాన్ని చిటికెలో తేలుస్తుంది. అలాగే అనుమానాస్పద ఫోన్ నంబర్లను ముందే పసిగట్టి యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా ఒకసారి పేరు, ఫోన్ నంబర్‌తో ఎవరైనా ఈ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే భవిష్యత్తులో ఒకవేళ వారు సైబర్ మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నప్పుడు ఆ సమాచారాన్ని వెంటనే కేంద్ర సైబర్ క్రైం విభాగానికి చేరవేస్తుంది.అలాగే సైబర్ నేరస్తుల ఐపీ అడ్రస్, లొకేషన్‌ను ఫొటోలతో సహా సైబర్ క్రైమ్‌కు పంపుతుంది. దీని సాయంతో సైబర్ క్రైమ్ విభాగం అధికారులు కేవలం 24 గంటల్లోనే కేటుగాళ్ల ఆటకట్టించి బాధితుల సొమ్మును రికవరీ చేసేందుకు వీలవుతుందని అర్జున్‌రామ్ పేర్కొంటున్నాడు. అలాగే నిందితులపై కేసు నమోదు అవుతుందని చెప్పాడు. ఇప్పటివరకు తన వెబ్సైట్లో 520 మంది లాగిన్ అయి సైబర్ మోసాల నుంచి భద్రత పొందినట్లు వివరించాడు. స్పామ్‌కాల్స్‌కు అడ్డుకట్ట వేయడంపై పనిచేస్తున్నా.. స్కామ్సెక్యూర్1 వెబ్‌సైట్‌ను మరింతగా అభివృద్ధి చేస్తున్నానని.. అది పూర్తయితే స్పామ్‌కాల్స్, అనవసరమైన మెసేజ్‌లు రాకుండా నిలువరించడం వీలవుతుందని అర్జున్‌రామ్ తెలిపాడు. కాగా, కుమారుడి ఘనతపట్ల అర్జున్‌రామ్ తల్లిదండ్రులు సురే‹Ù, శ్రీవాణి హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆదిలాబాద్ ఎంపీకి అరుదైన అవకాశం
ఆదిలాబాద్ టౌన్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 24న న్యూఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయనుండగా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ స్వయంగా బాపూరావుకు ఫోన్‌చేసి వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆ పత్రాలపై అదే వర్గానికి చెందిన బాపూరావుకు ప్రతిపాదించేందుకు అరుదైన అవకాశం లభించడం విశేషం. -
బీడీ పరిశ్రమకు జీఎస్టీని మినహాయించండి
కేంద్ర మంత్రి అర్జున్రాంను కోరిన బీడీ మజ్దూర్ సంఘ్ సాక్షి, న్యూఢిల్లీ: అధికశాతం మహిళలు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నందున వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మెగ్వాల్‌ను అఖిల భారత బీడీ మజ్దూర్ మహా సంఘ్ నేతలు కోరారు. శనివారం కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసిన సంఘం నేతలు.. జీఎస్టీలో బీడీ ఆకులపై 18 శాతం, బీడీలపై 28 శాతం పన్ను విధించడం వల్ల బీడీ పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వివరించారు. బీడీ పరిశ్రమలపై దాదాపు కోటి మంది వరకు ఆధారపడి బతుకుతున్నారని, జీఎస్టీలో పన్నులు పెంచడం వల్ల వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. మెగ్వాల్‌ను కలసిన వారిలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఏపీకి హోదాపై కొద్ది రోజుల్లో ప్రకటన
కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ వెల్లడి వన్‌టౌన్ (విజయవాడ): ఏపీకి ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ అన్న విషయాన్ని కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ వెల్లడించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మంగళవారం విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రిని రాష్ట్ర వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ దుర్గాఘాట్‌లోని వీఐపీ ఘాట్‌కు తీసుకొచ్చారు. మంత్రి కృష్ణా నదికి నమస్కరించి నీటిని తలకు రాసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలు భారతీయ ఔన్నత్యాన్ని చాటే గొప్ప కార్యక్రమమన్నారు. ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దీనిపై పార్లమెంటులో ఇటీవల సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ఏపీకి అన్ని విధాల సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.


