breaking news
	
		
	
  Arati
- 
      
                   
                               
                   
            సిగటోకతో అరటి దిగుబడికి ముప్పు

 - పొంచి ఉన్న తెగుళ్లు, పురుగుల బెడద
 - సిగటోక, బ్యాక్టీరియా కుళ్లు తెగులు, పండుఈగతో నష్టం
 - వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీనివాసులు
 
 అనంతపురం అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా సాగులో ఉన్న అరటి తోటలకు ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా పురుగులు, తెగుళ్లు సోకి నష్టం కలిగించే పరిస్థితి ఉందని రేకులకుంట వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సిగటోక మచ్చ తెగులు, బ్యాక్టీరియా కుళ్లు తెగులు, తామర పురుగులు, పండు ఈగ లాంటి వాటితో అరటి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 + జిల్లాలో 90 శాతం తోటలు ఫిబ్రవరి-మార్చి నెలలో సాగులోకి వచ్చాయి. అరటితోటలు ప్రస్తుతం ఐదు నుంచి ఆరు నెలల వయస్సులో ఉన్నాయి. వచ్చే నెలల్లో ఎక్కువ తోటలు గెల వేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఓ వైపు వర్షం, మరోవైపు వేడి వాతావరణ పరిస్థితులు ఉన్నందున చీడపీడలు దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. తెగుళ్లు లక్షణాలు కనిపించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
 
 + అరటిని బాగా దెబ్బతీసే వాటిలో సిగటోక మచ్చ తెగులు ప్రధానమైంది. ఇది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వ్యాపించే అవకాశం ఉంది. దీని నివారణకు మొదటి దఫా కింద 2 గ్రాములు క్లోరోథలోనిల్ లేదా 2.50 గ్రాములు మాంకోజెబ్ + జిగురు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండో దఫా కింద 2 మి.లీ హెక్సాకొనజోల్ + జిగురు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడో ధఫాగా 1 మి.లీ ప్రొపికొనజోల్+ జిగురు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి తగ్గకుంటే చివరగా 1 మి.లీ కాలిక్సిన్ + జిగురు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. జిగురు ద్రావణం అంటే సాండోవిప్ లేదా డానువిప్ లేదా ఆప్సా–80 లేదా ట్రైటాన్ ఎక్స్–100 ను ఎంచుకుని ఒక లీటర్ నీటికి 0.5 మి.లీ కలుపుకోవాలి.
 
 + బ్యాక్టీరియా కుళ్లు తెగులు వ్యాపిస్తే మొక్క, దుంప, వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. నివారణకు 20 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లు, మొవ్వ బాగా తడిచేలా పోయాలి. అవసరమైతే 1 గ్రాము కార్బండిజమ్ + 0.5 గ్రాము స్రెప్టోసైక్లీన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
 + గెలకు బయటకు వచ్చిన సమయంలో తామర పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. గెలలో హస్తాలు విచ్చుకున్న తర్వాత, మగ పువ్వును తుంచేసిన తర్వాత 2 మి.లీ పిప్రోనిల్ + 10 గ్రాములు 13–0–45 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీని వల్ల తామర పురుగులు నశించిపోవడమే కాకుండా కాయలు మంచి సైజు, నాణ్యతగా వస్తాయి.
 + ఇక పండు ఈగ నివారణకు మీథైల్ యూజినాల్ మందుతో ఎరలు తయారు చేసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. గెలలకు పాలిథీన్ కవర్లు తొడిగితే కొన్ని రకాల పురుగుల వల్ల నష్టం తగ్గిపోతుంది. - 
      
                   
                               
                   
            అరటిలో పర్టిగేషన్ పద్ధతితో అధిక దిగుబడి

 అరటికి ఫర్టిగేషన్ పద్ధతి భేష్
 – ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్
 అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల్లో ఒకటైన అరటి పంటను రైతులు అధికంగా సాగు చేస్తారు. అధికారుల మెలకువలు, సూచనలు పాటిస్తే మేలైన దిగుబడులు సాధించొచ్చు. ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా పోషకాలు అందజేయడం వల్ల అరటి పంటలో అధిక దిగుబడి సాధించొచ్చని ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి, ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లాలో అరటి 12 వేల హెక్టార్లకు పైబడి సాగులో ఉన్నందున రైతులు ఎరువుల ఖర్చు తగ్గించుకొని నికర ఆదాయం పొందడానికి ఫర్టిగేషన్ విధానం అవలంభించాలని ఆయన సూచించారు. ఫర్టిగేషన్ పద్ధతి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన అరటి రైతులకు తెలియజేశారు.
 
 ఫర్టిగేషన్ పద్ధతి :
 నీటిలో కరిగే ఎరువులు డ్రిప్ (బిందు) పరికరాల ద్వారా సరైన మోతాదులో నేరుగా మొక్కలకు అందించడాన్ని ఫర్టిగేషన్ విధానం అంటాం. ఇది ఎరువుల వినియోగంలో మంచి సామర్థ్యం గల పద్ధతి. ఈవిధానం ద్వారా దశల వారీగా మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడానికి వీలవుతుంది. దేశంలో ఏటా రసాయన ఎరువుల వాడకం పెరుగుతున్నప్పటికీ వాటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. అందులో నత్రజని–భాస్వరం–పొటాష్‌లకు వరుసగా 40, 20, 50 శాతముగా ఉంది. అంటే అందించిన ఎరువులలో సగానికి పైగా వృథా అవుతోందని తెలుస్తోంది. అందుకు కారణంగా ఎరువులను పొలంలో వెదజల్లడం వల్ల మొక్కల మధ్య ఖాళీ స్థలంలో పడి వృథా అవడమే కాకుండా పొలమంతా సమానంగా పడకుండా పంట దిగుబడి తగ్గిపోతుంది.
 
 ప్రయోజనాలు:
 నీరు, పోషకాలు ఎల్లపుడూ అందుబాటులో ఉండటం వల్ల మొక్క ఎదుగుదల బాగా ఉంటూ ఉత్పత్తి, నాణ్యత అధికంగా ఉంటుంది.అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. పోషకాల అందుబాటు గ్రహణ శక్తి పెరుగుతుంది. మొక్కల వేర్లకు ఎలాంటి హాని ఉండదు. కూలీలు, సమయం, విద్యుత్‌శక్తి ఆదా అవుతుంది. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా ఉండదు. నేల గట్టిపడదు. నేలలో తేమ, గాలి అనువైన నిష్పత్తిలో ఉంటుంది. ఎరువులకు అయ్యే ఖర్చు సాధారణ సాంప్రదాయ పద్ధతి కన్నా తక్కువ. నేల కాలుష్యం జరగదు. కూలీల ఆరోగ్యానికి హాని జరగదు.
 
 ఫర్టిగేషన్ పద్ధతిలో అరటికి ఎరువులు ఇలా...
 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
 పంట దశ (రోజులు) ఎరువులు మోతాదు
 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
 30 నుంచి 90వ రోజు వరకు యూరియా ఒక కిలో
 వైట్ పోటాష్ ఒక కిలో
 19–19–19 500 గ్రాములు
 91 నుంచి 120వ రోజు వరకు యూరియా ఒక కిలో
 వైట్ పొటాష్ ఒక కిలో
 12–61–0 500 గ్రాములు
 95, 100, 105, 110వ రోజు సీఎన్ 3 కిలోలు
 121 నుంచి 180వ రోజు వరకు అమ్మోనియంసల్ఫేట్ ఒక కిలో
 యూరియా ఒక కిలో
 వైట్ పొటాష్ 1.5 కిలో
 మెగ్నీషియంనైట్రేట్ 500 గ్రాములు
 181 నుంచి 240వ రోజు వరకు యూరియా ఒక కిలో
 అమ్మోనియంసల్ఫేట్ 500 గ్రాములు
 వైట్ పొటాష్ 500 గ్రాములు
 13–0–45 1.5 కిలో
 241 నుంచి 300వ రోజు వరకు అమ్మోనియంసల్ఫేట్ ఒక కిలో
 వైట్పొటాష్ 500 గ్రాములు
 13–0–45 1.5 కిలో - 
      
                   
                               
                   
            అరటి ధర హాసం

 జోరందుకున్న ఎగుమతులు
 మార్కెట్‌యార్డులో సందడి
 రైతుల్లో ఆనందం
 రావులపాలెం : లారీల సమ్మెతో కొద్ది రోజులుగా ఎగుమతులు తగ్గి ఢీలా పడిన అరటి రైతులు తాజాగా ధరలు పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డు నుంచి ఎక్కువ శాతం గెలలు ఎగుమతయ్యే ఒరిశా రాష్ట్రంలో ఈ నెల 14న సంక్రాంతి పండుగ నేపథ్యంలో అక్కడ వ్యాపారులు కొనుగోళ్ళుకు పోటీ పడుతున్నారు. దీంతో ధరలు ఊపందుకున్నాయి. ఒడిశాలో సంక్రాంతికి మామిడి, పెండ్లంతో పాటు అరటి పండ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కొత్తగా పెళ్లయిన దంపతులు వీటిని దేవాలయాల్లో సమర్పించడం ఆనవాయితీ. దీంతో వ్యాపారులు రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున గెలలు కొనుగోలు చేసి ఒడిశాకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ఎగుమతులు పెరిగాయి.
 మన రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో శుభకార్యాలు, పూజలు ప్రసుత్తం ఎక్కువగా ఉండటంతో అరటి గెలలకు డిమాండ్ పెరిగింది. యార్డు పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల్లో నిన్నమొన్నటి వరకూ లారీల సమ్మెతో గెలలు కోయని రైతులు పెరిగిన ధరతో కోతలు ముమ్మరం చేశారు. స్థానిక వ్యాపారులతో పాటు తమిళనాడు, ఒడిశా నుంచి కూడా వ్యాపారులు కొనుగోళ్ళుకు రావడంతో అరటి గెలలకు మంచి ధర లభిస్తోంది. ప్రస్తుతం యార్డు పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, కపిలేశ్వరపురం, మండపేట, పి.గన్నవరం, పెనుగొండ, పెరవలి, మార్టేరు మండలాల నుంచి రోజుకు 10 నుంచి 20 వేలు గెలలను రైతులు అమ్మకానికి తీసుకువస్తున్నారు. దీంతో తమిళనాడు, ఒడిశా, బీహర్ తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 15 నుంచి 20 లారీల సరుకు నిత్యం రవాణా అవుతోంది. రోజుకు సుమారు రూ.15 నుంచి 20 లక్షల వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్ జోరును బట్టి ఈ నెలాఖరు వరకూ ఇదే రీతిలో ధరలు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
 ఎగుమతులు పెరిగాయి
 నిన్నమొన్నటి వరకూ లారీల సమ్మెతో ఎగుమతులు తగ్గి కొనుగోళ్లు అంతమాత్రంగా చేసేవాళ్లం. ప్రసుత్తం ఒరిస్సాతో పాటు తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వినియోగం పెరడంతో ధర పెరిగింది. దీంతో ఎగుమతులు జోరందుకున్నాయి. మరో రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది.
 - కోనాల చంద్రశేఖరరెడ్డి, వ్యాపారి. - 
      
                   
                               
                   
            అరటిని కాపాడుకోండి

 – శిక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీనివాసులు
 అనంతపురం అగ్రికల్చర్ : మార్కెట్లో మంచి ధరలు ఉన్నందున అరటిలో మంచి దిగుబడులు వచ్చేలా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో అరటి సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ ఆదినారాయణతో పాటు శ్రీనివాసులు హాజరై సాగు పద్ధతుల గురించి అవగాహన కల్పించారు.
 
 యాజమాన్య పద్ధతులు
 అరటి తోటలు దాదాపు కోత దశలో ఉన్నాయి. గెల వేసిన అరటి చెట్లు గాలులకు పడిపోకుండా కట్టెలతో పోటు పెట్టుకుంటే మేలు. గెలలకు ఎండ సోకకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పాలి. కోత తర్వాత పంట కోసం సూటి పిలక ఒక్కటి ఉంచి మిగతావన్నీ కోసేయాలి. రెండో పంట కావడంతో పంట కాలం నెల తక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో సూటి పిలక ఉంచిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులు వేసుకోవాలి. సింగిల్ సూపర్ పాస్ఫేట్ అవసరం లేదు.
 
 లేదంటే వారం రోజులు వరుసగా రోజుకు ఎకరాకు ఒక కిలో 13–0–45 నీటిలో కరిగే ఎరువులు డ్రిప్ ద్వారా పంపాలి. తర్వాత మూడు రోజులు విరామం ఇచ్చి మళ్లీ డ్రిప్ ద్వారా తగిన మోతాదులో ఎరువులు పంపాలి. జింక్, బోరాన్, మెగ్నీషియం లాంటి సూక్ష్మపోషకాల లోపాన్ని సవరించడానికి వీలుగా 5 గ్రాములు ఫార్ములా–4 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వేసవి కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మందుల పిచికారి చేసుకోవాలి. కొత్తగా అరటి మొక్కలు నాటే వారు ఉత్తర, దక్షిణం దిక్కుల్లో నాటుకుంటే మేలు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో మొక్కలు చనిపోకుండా పడమటి దిశలో ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 250 గ్రాములు వర్మీకంపోస్టు, 250 గ్రాములు వేపచెక్క వేసుకోవాలి. - 
      
                   
                               
                   
            హారతి కళ్లకు అద్దుకోవటం

 • సన్నిధి అంతరార్థం
 ఇంటిలో, ఆలయాల్లో, పూజామందిరాలలో, నోములు, వ్రతాల వంటి శుభకార్యాలలో హారతి ఇవ్వడం సర్వసాధారణం. ఈ హారతిని దర్శించుకుని, కన్నులకు అద్దుకోవడం అంతే సాధారణం. జ్యోతిస్వరూపం. పరమాత్ముడు స్వయంప్రకాశక స్వరూపుడు. వెలుగు అనేది అంధకారాన్ని తొలగించి వస్తువును దృష్టికి కనిపించేలా చేస్తుంది. చీకటిలో వస్తువులను చూడలేం. అజ్ఞానం అనే అంధకారం ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడలేం. కాబట్టి కళ్లకు హారతి అద్దుకుంటూ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని కలిగించమని భగవంతుడిని ప్రార్థించాలి.
 సూర్యుడిలోని జ్యోతి, పరమాత్మ యొక్క ప్రకాశం, మన నేత్రాలలోని జ్యోతి ఒక్కటే. దానికి గుర్తుగానే హారతి ఇచ్చినప్పుడు కన్నులకు అద్దుకుంటాం. మరోరకంగా చూస్తే, కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాసకోశవ్యాధులు, అంటువ్యాధులు దరిచేరవు. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్లకద్దుకోవడం అసలు సిసలైన ఆధ్యాత్మిక అంతరార్థం. 


