breaking news
in ap
-
దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం
-
ధవళేశ్వరం పీహెచ్‌సీకి రాష్ట్ర ఉత్తమ అవార్డు
ధవళేశ్వరం: రాష్ట్ర ఉత్తమ పీహీచ్సీ అవార్డును రాజమహేంద్రవరం రూరల్ మండలానికి చెందిన ధవళేశ్వరం పీహెచ్సీ గెలుచుకుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పీహెచ్సీ వైద్యాధికారి కె.సుధాకర్ శుక్రవారం ఈ అవార్డును అందుకున్నారు. ఈ పీహెచ్‌సీకి ప్రతి రోజూ 200వరకు ఓపీ ఉంటుంది. సిబ్బంది రోగులకు మెరుగైన సేవలందించడంతో టీబీ యూనిట్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సిబ్బంది అందరి సమిష్టి కృషితోనే ఈ అవార్డును కైవసం చేసుకోగలిగామని శనివారం వైద్యాధికారి సుధాకర్ అన్నారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా 212 పట్టణ ఆరోగ్య కేంద్రాలు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని కిమ్స్‌లో ఐఎంఏ ఏపీ కా¯Œ –2016 ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వెయ్యి మంది వైద్యులు అమలాపురం రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా 212 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో శనివారం ప్రారంభమైన ఐఎంఏ ఏపీ కాన్–2016 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో ఒక డయాలసిస్ యూనిట్ ప్రారంభిస్తామన్నారు. తమిళనాడు విధానంలోలా మూడేళ్లకు ప్రభుత్వ వైద్యుడిని రెగ్యులర్ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడతామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచడం వల్ల 28 శాతం ఓపీ అదనంగా పెరిగిందన్నారు. త్వరలో చిన్న పిల్లలకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అధునాతన ప్రక్రియలపై విస్తృత చర్చ ప్రస్తుత వైద్య రంగంలో ఎదురవుతున్న ఒడిదుడుకులు, అధునాతన సాంకేతిక వైద్య ప్రక్రియలపై సదస్సు విస్తృతంగా చర్చించింది. రాష్ట్ర విభజన తర్వాత ఇండియ¯ŒS మెడికల్ అసోసియేష¯ŒS (ఐఎంఏ) నవ్యాంధ్ర ప్రదేశ్ శాఖగా విడిపోయి తొలిసారిగా రాష్ట్రస్థాయి సదస్సును అమలాపురం కిమ్స్ వైద్యకళాశాల వేదికగా శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నారు. సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది వైద్యులు హాజరయ్యారు. సదస్సులో తొలుత ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. కోనసీమ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గంధం రామం అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, ఐఎంఏ నూతన అధ్యక్షుడు కె.గంగాధరరావు, కార్యదర్శి ఎం.ఎ.రెహమాన్, మాజీ అధ్యక్షుడు జి.ఎస్.మూర్తి, డాక్టర్ సమరం, కోనసీమ కార్యదర్శి డాక్టర్ పి.సురేష్‌బాబు, మాజీ అధ్యక్షుడు అరిగెల వెంకటేశ్వరరావు, కోశాధికారి డాక్టర్ కె.రమేష్, డీ¯ŒS ఎ.కామేశ్వరరావు, ఏవో కె.రఘు, వైద్యులు రామచంద్రరావు, బి.వరహాలు, రాఘవేంద్రరావు, కొమ్ముల ధన్వంతరినాయుడు, గొలకోటి రంగారావు, ఎం.ఎస్.ఎ¯ŒS.మూర్తిలు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య సదస్సులు వివిధ జిల్లాల నుంచి వైద్యులు నూతన సాంకేతిక పరిజ్ఞానం, వైద్య విధానంలో నూతన మార్పులపై సదస్సులో అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో వైద్యవిధానంపై కిమ్స్ డీ¯ŒS ఎ.కామేశ్వరరావు వివరించారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే ఎలా నయం చేయవచ్చో వివరించారు. విశాఖకు చెందిన వైద్యుడు వి.మురళీకృష్ణతోపాటు పలువురు వివిధ అంశాలపై పేపర్ ప్రెజంటేష¯ŒS ద్వారా అవగాహన కల్పించారు. ఆకట్టుకున్న పోర్ట్రెయిట్స్ ఐఎంఏ సదస్సులో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వైద్యవిధానంలో కొత్తగా వచ్చిన పరికరాలు, మందులు, ఉత్పత్తులను వీటిలో ప్రదర్శించారు. అపోలో ల్యాబ్స్ ఏర్పాటు చేసిన స్టాళ్లలో వైద్యులు పోట్రెయిట్స్ గీయించుకునేందుకు ఉత్సాహం చూపించారు. విజయనగరానికి చెందిన ఆర్టిస్ట్ క్రాంతి ఐదు నిమషాల్లో వైద్యులు బొమ్మలు వేసి ఆకట్టుకున్నారు. -
జిల్లా మహిళా హాకీ జట్టుకు రెండో స్థానం
కాకినాడ సిటీ : రాష్ట్ర స్థాయి జూని యర్స్ మహిళా హాకీ పోటీల్లో జిల్లా జట్టు రెండో స్థానం సాధిం చినట్టు టోర్నీ డైరెక్టర్, జిల్లా కోచ్ రవిరాజ్ ఇక్కడ తెలిపారు. ఈ నెల 29 నుంచి అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జూనియర్స్ జట్టు సెమీ ఫైనల్లో కడప జట్టుపై విజయం సాధించింది. అలాగే ఫైనల్లో అనంతపురంపై తలపడి, రన్నర్స్‌గా నిలిచింది. టీమ్ కెప్టెన్‌గా సీహెచ్ నందిని వ్యవహరించారు.