breaking news
Anup Chetia
-
’ఉల్పా’నేత అనూప్ చెతియ విదుదల
-
ఉల్ఫా నేత చెతియా భారత్‌కు అప్పగింత
ఢాకా: బంగ్లాదేశ్ తమ జైలులో ఉన్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఉల్ఫా అగ్రనేత అనూప్ చెతియా ను బుధవారం భారత్‌కు అప్పగించింది. సీబీఐ గురువారం అతడిని కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌కు పంపించింది. చెతియా(48)ను విదేశీ నగదు, శాటిలైట్ ఫోన్ కలిగివున్నందుకు 1997లో బంగ్లా పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బంగ్లాను రాజకీయ ఆశ్రయం కోరాడు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కస్టడీలోనే ఉంచాలని కోర్టు పేర్కొంది చెతియా అప్పగింతకు ప్రతిగా.. బెంగాల్ జైల్లో ఉన్న బంగ్లా నేరస్తుడు హుసేన్‌ను భారత్ ఆ దేశానికి అప్పగించనుంది. బంగ్లాలో ఏడుగురిని హత్య కేసులో అతడు నిందితుడు. -
ఉగ్రనేతను అప్పగించిన బంగ్లా ప్రధానికి ధన్యవాదాలు:మోదీ
న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్(ఉల్ఫా) అగ్రనేత అనుప్ చెతియాను భారత్‌కు అప్పగించినందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యావాదాలు తెలిపారు. ఉల్ఫా అగ్రనేత అనుప్ చెతియాను భారత్‌కు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజీజు నేటి ఉదయం వెల్లడించారు. ఈ విషయంపై స్పందించిన మోదీ... ఉగ్రనేతను విచారించి చాలా కేసులను పరిష్కరించడానికి అవకాశం లభించిందని పేర్కొన్నారు. కేంద్ర అధికారులు, అసోం పోలీసులు అతడి కేసులపై దర్యాప్తు కొనసాగిస్తారని మరిన్ని విషయాలను మోదీ, కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించాయి.భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలు, మయన్మార్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి చెతియాపై కేసులు నమోదయ్యాయి. ఉల్ఫా వ్యవస్థాపకులలో ఒకడైన చెతియాను బంగ్లాదేశ్ పోలీసులు 1977లో అరెస్టు చేసిన విషయం విదితమే.