ఇంటిప్స్
ప్రాచీన కాలం నుంచి పసుపుని యాంటీసెప్టిక్‌గా వినియోగిస్తున్నారు.మన పెద్దవాళ్లు ఏ చిన్న దెబ్బ తగిలినా వెంటనే పసుపు తెమ్మని తొందరపెట్టడం ప్రతి ఇంట్లో సహజంగా జరిగే విషయమే. గాయాన్ని త్వరగా మాన్పే గుణం పసుపులో ఉంది. అలాగే గొంతు సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులకు పసుపు బాగా పనిచేస్తుంది.
పసుపు నీళ్లతో ఆవిరిపడితే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్కు అద్భుతంగా పనిచేస్తుంది. లేదంటే గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని పుక్కిలిస్తే (గార్గిలింగ్) గొంతు సంబంధ వ్యాధులు త్వరగా తగ్గుతాయి.