breaking news
Antibiotic treatment
-
స్వల్ప యాంటీబయాటిక్ చికిత్సతోనే నవజాత ఇన్ఫెక్షన్లు నయం
హైదరాబాద్: స్వల్పకాలిక యాంటీబయాటిక్ చికిత్సలతోనే నవజాత శిశువుల్లో ఇన్ఫెక్షన్లను నయం చేయొచ్చని శిశు వైద్య నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్ ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కి చెందిన డా. సాయికిరణ్.డితో సహా భారతీయ నియోనాటాలజీ నిపుణుల బృందం ప్రముఖ జర్నల్ ‘లాన్సెట్ క్లినికల్ మెడిసిన్’లో కీలక అధ్యయనాన్ని ప్రచురించింది. సాధారణంగా తీవ్రమైన నవజాత ఇన్ఫెక్షన్లకు 10–14 రోజుల యాంటీబయాటిక్ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. కానీ వీటిలో చాలావాటిని 7 రోజుల స్వల్ప కాలిక చికిత్సలతోనే నయం చేయొచ్చని ఈ అధ్యయనంలో తేల్చారు.అధికంగా లేదా ఎక్కువకాలం యాంటీబయాటిక్స్ వాడకం ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియా ప్రతిరోధకత పెరగడంతోపాటు దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకంగా అకాల లేదా అనారోగ్యంతో జన్మించిన శిశువులు ఎక్కువగా యాంటీబయాటిక్స్‌కు లోనవుతున్నారు.శిశువుల ఇన్ఫెక్షన్లపై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక యాంటీబయాటిక్ చికిత్సల ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ముఖ్యంగా “బయోమార్కర్స్” ఆధారంగా చికిత్స కొనసాగింపును నిర్ణయించడం మెరుగైన ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. రక్త పరీక్షల ద్వారా సంక్రమణ తగ్గుతుందా లేదా అన్న విషయాన్ని గమనించి, అవసరమైనప్పుడు చికిత్స ఆపడం సాధ్యమవుతుంది.అధ్యయన ఫలితాల్లో కీలకాంశాలు10–14 రోజుల చికిత్సల స్థానంలో 7 రోజుల స్వల్పకాలిక చికిత్స చాలా సందర్భాల్లో సరిపోతుందని తేలింది.“బయోమార్కర్” పరీక్షలు చికిత్స నిర్ణయానికి సహాయపడతాయి.అయితే 3–4 రోజుల చికిత్సకు, 5–7 రోజుల చికిత్స మధ్య తేడాపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ అంశంలో ఇంకా పరిశోధన అవసరం.మూత్ర సంక్రమణ, మెనింజైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లపై మరింత స్పష్టత అవసరం. -
నల్లగా మారిన మహిళ చేయి.. కారణం తెలిస్తే షాక్
చండీఘడ్: గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన నిర్వాకం ఒక మహిళ ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వినిత, సర్పరాజ్ దంపతులు. అయితే, వినిత దుండహేరా గ్రామంలోని పార్క్ అనే ప్రైవేటు ఆసుపత్రిలో ఏప్రిల్ 23న గర్భ విచ్చిత్తి చేయించుకుంది. ఆ తర్వాత డాక్టర్లు ఆమెకు యాంటి బయోటిక్ ఇంజక్షన్ ఇచ్చారు. అయితే, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి. ఆమె కుడి చెయి క్రమంగా నల్లగా మారింది. వెంటనే, ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మందులను మార్చారు. అయినా ఆమెలో మార్పురాలేదు. ఈ క్రమంలో ఆమెను ఎక్స్‌రే తీశారు. దీంట్లో ఆమె చేయి నల్లగా మారడంతోపాటు, శరీరం ఇన్ఫెక్షన్కు గురైందని తెలిసింది. కాగా, ఆమెను వెంటనే ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని పార్క్ వైద్య సిబ్బంది సలహ ఇచ్చారు. గర్భాస్రావం తర్వాత అధిక మోతాదులో యాంటీ బయోటిక్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే తన భార్యకు ఇలా జరిగిందని సర్పరాజ్ ఆరోపించాడు. కాగా, తన భార్యను తీసుకొని వెంటనే ఢిల్లీలోని ఆసుపత్రికి చేరుకున్నాడు. వినితను అక్కడి వైద్యులు పరీక్షించారు. ఆమె కుడి చేయి పూర్తిగా ఇన్ఫెక్షన్కు గురైందని వెంటనే తొలగించాలని తెలిపారు. దానికోసం చాలా ఖర్చుఅవుతుందని కూడా తెలిపారు. అసలే.. కొవిడ్ కారణంగా సర్పరాజ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. కాగా, తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇప్పటివరకు నెట్టుకొచ్చానని తెలిపాడు. కాగా, వీరికి ఒక ఎన్జీవో ఆహరాన్ని అందిస్తుంది. తాను ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుకూడా భరించే స్థితిలో లేనని పేర్కొన్నాడు. ఈ దారుణంపై గురుగ్రామ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
ఆ వయసులో యాంటీ బయోటిక్స్ వాడితే...
న్యూయార్క్ః పుట్టిన బిడ్డలకు మొదటి సంవత్సరం నుంచే యాంటీ బయోటిక్స్ వాడకం ఫుడ్ ఎలర్జీలకు దారి తీస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. యేడాదిలోపు పిల్లలకు యాంటీబయోటిక్స్ వాడిన పిల్లలతోపాటు, వాడని వారిపై అధ్యయనాలు జరుపగా...మందులు వాడని వారికంటే, వాడినవారికి 1.21 అధికంగా ఫుడ్ అలర్జీలు వచ్చినట్లు తెలుసుకున్నారు. సూక్ష్మ జీవులవల్ల వ్యాపించే పలు రకాల వ్యాధులను ఎదుర్కొనేందుకు, వ్యాధి నిరోధక శక్తిని సమకూర్చేందుకు వాడే యాంటీబయోటిక్స్ యేడాదిలోపు పిల్లలకు వాడటంవల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. యాంటీబయోటిక్స్ తో ఇతర సైడ్ ఎఫ్టెక్ట్స్ ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల ద్వారా గుర్తించారు. ముఖ్యంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఫుడ్ అలర్జీలు వంటివి వ్యాపిస్తాయని తమ అధ్యయనాల్లో తేలినట్లు అమెరికా సౌత్ కరోలినా ఫార్మసీ కళాశాలకు చెందిన అధ్యయనకారుడు బ్రియాన్ లవ్ చెప్తున్నారు. మొత్తం 1,504 మంది ఫుడ్ అలర్జీ ఉన్న పిల్లల కేసులతోపాటు, 5,995 అలర్జీలు లేని వారి గణాంకాలను పరిశోధకులు పరిశీలించారు. తమ పరిశోధనలను అలర్జీ, ఆస్థమా అండ్ ఏఎంపీ, క్లినికల్ ఇమ్యునాలజీ జర్నల్ లో ప్రచురించారు.