breaking news
anti-Muslim comments
-
శ్రీలంకలో అల్లర్లకు కారణాలేమిటీ?
కొలంబో : శ్రీలంకలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో పదుల సంఖ్యలో వ్యాపార సంస్థలు, ముఖ్యంగా ముస్లింల హోటళ్లు, 24 మసీదులు ధ్వంసమయ్యాయి. 41 ఏళ్ల ఓ బుద్ధిస్టు సింహళీయుడు అనే డ్రైవర్‌ను కొంత మంది ముస్లిం అతివాదులు హత్య చేయడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి. హత్యకు గురైన సింహళీయుడి భౌతికకాయాన్ని అప్పగించేందుకు శ్రీలంక పోలీసులు నిరాకరించడంతో అగ్రహోదగ్రులైన సింహళీయులు, ముస్లింలకు వ్యతిరేకంగా దాడులకు దిగారు. ఇలాంటి అల్లర్లకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కతిక కారణాలు ఉంటాయని తెల్సిందే. వాటికి తోడు శ్రీలంకలో ముస్లింల వ్యతిరేకత పెరగడానికి కొన్ని అపోహలు తోడ్పడ్డాయి. సింహళీయుల్లో సంతానం పెరగకుండా నియంత్రించేందుకు వారు నిర్వహిస్తున్న హోటళ్లలో సంతానోత్పత్తిని తగ్గించే మాత్రలను కలుపుతున్నారన్నది అలాంటి అపోహే. నలుగురు మహిళలను పెళ్లిచేసుకునే అవకాశం ఉన్న ముస్లింలు కుటుంబ నియంత్రణను సక్రమంగా పాటించకుండా ఎక్కువ సంతానాన్ని కంటున్నారు. ఇటు సింహళీయుల్లో సంతానాన్ని నియంత్రించడం, అటువైపు ముస్లింల జనాభాను పెంచుకొని శ్రీలంకను ఇస్లాం రాజ్యం చేయడం ముస్లింల లక్ష్యమని స్థానిక సింహళీయులు భావిస్తున్నారు. ఇక ముస్లింలు కూడా మొహమ్మద్ ఐబిన్ అబ్దుల్ వాహెద్ అతివాద దక్పధాన్ని ఎక్కువ ఆచరిస్తున్నారు. ముస్లిం గురువుల సమాధులను కూల్చివేయడం, బారుడు గడ్డాలు పెంచడం, ఇస్లాం సిద్ధాంతాలను కఠినంగా పాటించడం అబ్దుల్ వాహెద్ అతివాదం. ఈ వాదం నుంచే అల్‌ఖైదా, బోకో హరామ్ లాంటి టెర్రరిస్టు సంస్థలు పుట్టుకొచ్చాయి. సౌదీ అరేబియా నిధులతో ఏర్పాటైన కొన్ని సంస్థలు ఇక్కడ ఈ అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సింహళీయుల ఆదిపత్యానికి వ్యతిరేకంగా తమిళులు విముక్తి పోరాటం జరిపిన 1980, 1990 దశకంలో సింహళీయులు, ముస్లింలు బాగా కలిసిపోయారు. అప్పుడే సామాజికంగా, ఆర్థికంగా ముస్లింలు అభివద్ధి చెందారు. అప్పుడే వారు హోటల్, ఇతర వ్యాపారాల్లో రాణించారు. శ్రీలంకలో చిన్నప్పటి నుంచే పిల్లల మధ్య మత బీజాలు బలంగా నాటుకోవడానికి కారణం ముస్లింలకు, సింహళీయులకు, తమిళులకు ప్రత్యేక భాషా పాఠశాలలు ఉండడమే. కామన్ పాఠశాలు, కామన్ భాష ఉన్నప్పుడే వారి మధ్య సామాజిక బంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. -
ట్రంప్ మాటలకు హర్టయిన హీరోయిన్
లండన్: అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తీరును హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ విమర్శించింది. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జోలీ తప్పుపడుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది. శరణార్థులకు ఐక్యరాజ్య సమితి దూతగా ఉన్న జోలీ బీబీసీ నిర్వహించిన కార్యక్రమంలో శరణార్థులతో మాట్లాడింది. అమెరికాలోకి ముస్లింలను అనుమతించరాదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించమని ఓ వ్యక్తి కోరగా.. జోలీ కళ్లు మూసుకుని, నిరసనగా తల అడ్డంగా ఊపింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వినాల్సిరావడం చాలి కష్టంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వలసదారులందరితో కలసి అమెరికా నిర్మితమైంది. మతం, ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించేందుకు అమెరికా వచ్చారు. ట్రంప్ అభిప్రాయం అమెరికాపై నాకున్న విజన్‌కు విరుద్ధమైనది' అని జోలీ చెప్పింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 130 మంది మరణించిన అనంతరం ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వారిని అమెరికాలోకి రాకుండా నిషేధించాలని అన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడిన అభ్యర్థులపైనా, పలు విదేశాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.