breaking news
Anjana Reddy
-
సచిన్‌తో ఒప్పందం.. విరాట్ కోహ్లి వ్యాపార భాగస్వామి! వేరే లెవల్ అంతే!
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లి.. ప్రస్తుతం జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 75 శతకాలు సాధించిన ఈ రికార్డుల రారాజు తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలోనూ దిట్ట. వివిధ బ్రాండ్లను ఎండార్స్ చేయడంతో పాటు జిమ్, రెస్టారెంట్ బిజినెస్‌తోనూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఇన్‌స్టాలో 254 మిలియన్ మంది ఫాలోవర్లను కలిగి ఉన్న కోహ్లి.. ఒక్కో పోస్టుకు కోట్లలో వసూలు చేస్తున్నాడు. ఇక తనకంటూ సొంతంగా వ్యాపారాలు కలిగి ఉండటంతో.. పలు సంస్థల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాడు ఈ ఢిల్లీ క్రికెటర్. అందులో ఒకటి క్లాతింగ్ కంపెనీ వ్రాన్(Wrogn). ఈ కంపెనీని అంజనా రెడ్డి స్థాపించారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అక్కడే మాస్టర్స్ చదివిన ఆమె.. 2011లో భారత్‌కు తిరిగి వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కుటుంబానికి చెందిన ఆమె కుటుంబ వ్యాపారాలను పక్కనపెట్టి.. తన కాళ్ల మీద తాను నిలబడాలని భావించారు. అలా.. తొలుత స్పోర్ట్స్ బ్రాండెడ్ వస్తువుల అమ్మకం బిజినెస్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫిర్మ్ అసెల్(300కు పైగా కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది)ను సంప్రదించగా.. ఎవరైనా సూపర్‌స్టార్‌ను ఇన్వెస్టర్‌గా తీసుకువస్తే స్టార్టప్‌నకు సహాయం చేస్తామని షరతు విధించింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను సంప్రదించిన అంజనా రెడ్డి తన కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో సఫలీకృతమయ్యారు. అలా యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సచిన్‌ను భాగం చేశారు. అనంతరం కలెక్ట్బిలియా అనే కంపెనీని స్థాపించగా.. అంజనా రెడ్డికి చుక్కెదురైంది. నష్టాలను పూడ్చుకునే క్రమంలో సచిన్ టెండుల్కర్ టీ-షర్ట్స్ అమ్మకంతో క్లాతింగ్ బిజినెస్‌లో అడుగుపెట్టారు. అయితే, అంతటితో అంజనా రెడ్డి ప్రయాణం ఆగలేదు. తన కంపెనీలలో మరింత మంది సెలబ్రిటీలను భాగస్వామ్యం చేయాలనే తలంపుతో వ్రాన్, ఇమారా వంటి బ్రాండ్లకు రూపకల్పన చేశారు. బాలీవుడ్ స్టార్లు కృతి సనన్, ఆదిత్యరాయ్ కపూర్ ఆమెతో జట్టుకట్టారు. సచిన్ టెండుల్కర్ కూడా ఇందులో భాగం కాగా.. విరాట్ కోహ్లి.. Wrognలో పెట్టుబడులు పెట్టడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించాడు. దీంతో అంజనా రెడ్డి క్లాతింగ్ బిజినెస్ మరో లెవల్‌కు వెళ్లింది. టీమిండియా స్టార్ కోహ్లి రేంజ్ అలాంటిది మరి! మరోవైపు.. విరాట్ కోహ్లి బిజినెస్ పార్ట్నర్గా అంజనా రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న ఆమె.. కంపెనీ విలువ దాదాపు 1200 కోట్లు. ఇక టీమిండియా క్రికెట్ స్టార్లతో జట్టుకట్టి తమ బ్రాండ్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి.. విజయవంతమైన బిజినెస్‌వుమెన్‌గా కొనసాగుతున్న అంజనా నెట్‌వర్త్ 300 కోట్లు ఉంటుందని అంచనా. చదవండి: BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్.. -
అంజనారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఫార్ములా వన్ రేస్ పేరిట జరిగిన భారీ మోసం ఏడేళ్ల అనంతరం మరోసారి తెరమీదకు వచ్చింది. 2011లో కార్ రేసింగ్ నిర్వహిస్తామని పలువురు దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసిన డెక్కన్ క్రానికల్ ఎండీ వినాయక్ రవిరెడ్డి కుమార్తె అంజనారెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసులో సీసీఎస్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఐపీఎల్ మాదిరిగా ఫార్ములా వన్ రేస్ నిర్వహిస్తామని అంజనారెడ్డి నమ్మబలికి, మచదర్ మోటర్ కార్ సంస్థ పేరుతో మోసం చేసినట్లు అప్పట్లోనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఫార్ములా వన్ రేసు పేరుతో అంజనారెడ్డి రూ.8కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నేత రఘురామ కృష్ణమరాజు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు కూడా నమోదు అయింది. దీనిపై కోర్టు నోటీసులు ఇవ్వడంతో దర్యాప్తు కోసం కేసును సీసీఎస్ పోలీసులు మళ్లీ వెలుగులోకి తెచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, నోటీసులు ఇచ్చినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశామని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. కాగా ప్రముఖ వ్యాపారవేత్త చాముండేశ్వరినాథ్ మధ్యవర్తిత్వం ద్వారా అంజనారెడ్డి రూ.8 కోట్లు వసూలు చేశారు.అయితే రేసింగ్ నిర్వహణలో విఫలం అయినందున కొంత డబ్బును వెనక్కి ఇప్పించేందుకు హామీ ఇచ్చారని, అయితే ఆ డబ్బు చెల్లించడంలో అంజనారెడ్డి విఫలం కావడంతో కోర్టు ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంజనారెడ్డిని వెంటాడుతున్న రేసింగ్ కేసు
-
‘నన్నూ గుర్తించండి’
వికలాంగ క్రీడాకారుడు అంజనారెడ్డి ఆవేదన సాక్షి, హైదరాబాద్: వికలాంగ బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినప్పటికీ తననెవరూ గుర్తించడం లేదని కరీంనగర్‌కు చెందిన వన్నెల అంజనారెడ్డి ఆవేదన చెందాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తనను గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని రెండు కాళ్లు చచ్చుబడినా 2003 నుంచి 2010 వరకు పలు పోటీల్లో పాల్గొన్నానని గుర్తు చేశాడు. అయితే ముఖ్యమంత్రిని కలిసేందుకు శనివారం సచివాల యానికి వచ్చిన అంజనకు చేదు అనుభవం ఎదురైంది. అపాయింట్మెంట్ లేని కారణంగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. సోమవారం సీఎంను కలిసే వెళతానని చెప్పాడు. అయితే తన కుటుంబం పేదరికంలో లేదని, తగిన గుర్తింపు కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపాడు. 2003లో ఇజ్రాయెల్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో రెండోస్థానం, 2006లో తొమ్మిదో పసిఫిక్ గేమ్స్‌లో కాంస్య పతకం, 2008 రెండో ఆసియా కప్‌లో కాంస్యం, 2009 ఐడబ్ల్యూఏఎస్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించినట్టు అంజన చెప్పాడు.