breaking news
Angela
-
మ్యాథ్స్ మహారాణి
గణితం అంటేనే ఆమడదూరం పరిగెత్తేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు. మొదట్లో గణితంపై పెద్దగా ఆసక్తి చూపని ఓ అమ్మాయి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరంగా గణితాన్ని విడమరిచి చెప్పే లెక్కల టీచర్‌గా చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన ప్రఖ్యాత గణిత పాఠాల పోటీ ‘బిగ్ ఇంటర్నెట్ మ్యాథ్–ఆఫ్’లో ఘనా దేశానికి చెందిన 35 ఏళ్ల ఏంజెలా తబిరి 16 మందిని వెనక్కునెట్టి ప్రపంచవిజేతగా జయకేతనం ఎగరేసింది. ఈ పోటీలో నెగ్గిన తొలి ఆఫ్రికన్‌గా, అందులోనూ తొలి ఆఫ్రికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. సమస్యల పరిష్కారంపై ఉన్న మక్కువే తనను మ్యాథ్స్ వైపు నడిపించించిందని తబిరి చెబుతున్నారు. తన విజయం మరింత మంది ఆఫ్రికన్ మహిళలు గణితాన్ని అభ్యసించేందుకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఘనా మ్యాథ్స్ క్వీన్ డాక్టర్ తబిరి ఆఫ్రికన్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యాథమేటికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో అణు బీజగణితం బోధించడంలో నిపుణురాలిగా పేరు సాధించారు. ఇంతటి ఘనత సాధించిన ఘనా దేశస్తురాలి గణితపర్వం ఒక ప్రణాళికాబద్ధంగా మొదలుకాలేదు. ఘనాలో పారిశ్రామికరంగానికి కేంద్ర స్థానంగా ఉన్న రాజధాని నగరం అక్రా సమీపంలోని టెమా నౌకాపట్టణంలోని అషైమాన్ మురికివాడలో ఆమె పెరిగారు. నలుగురు తోబుట్టువులతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇది సంతోషాన్నిచ్చినా చదువుకోవడానికి మాత్రం ఇబ్బంది ఉండేది. స్థానిక యూత్ కమ్యూనిటీ సెంటర్లో చదువుకునేవారు. తన ఇద్దరు సోదరీమణుల్లాగే యూనివర్సిటీలో బిజినెస్ అడ్మిని్రస్టేషన్ చేయాలనుకుంది. అందుకు సరిపడా విద్యా గ్రేడ్స్ లేకపోవడంతో బదులుగా గణితం, ఆర్థిక శా్రస్తాన్ని ఎంచుకుంది. అదే ఆమెకు కలిసొచ్చింది. గణిత సూత్రాలు ఆమెను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరకు గణితాన్నే తన కెరీర్‌గా ఎంచకున్నారు. 2015లో స్కాట్లాండ్లోని గ్లాస్గో విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు స్కాలర్షిప్ సైతం సంపాదించారు. 1950వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో పనిచేసిన నల్లజాతి అమెరికన్ మహిళా గణిత శాస్త్రవేత్తల జీవితగాథలున్న ‘హిడెన్ ఫిగర్స్’సినిమా చూశాక ఎంతో స్ఫూర్తిపొందానని ఆమె తెలిపారు. ‘‘ప్రపంచ వేదికపై నల్లజాతి మహిళల కథ నాకెంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా కేథరిన్ జాన్సన్ నుంచి ఎంతో ప్రేరణ పొందా. ఇది నా జీవితంలో కీలక మలుపు’’అని ఆమె అన్నారు. మహిళల్లో గణిత అధ్యయనాన్ని పెంచేందుకు.. గణితంలో డాక్టరేట్ అందుకున్న తబిరి లాభాపేక్షలేని సంస్థ ‘ఫెమ్ ఆఫ్రికా మ్యాథ్స్’నడిపిస్తున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాల్లోని ఆఫ్రికన్ బాలికలు, మహిళల గణిత కలలను సాకారం చేసుకోవడానికి తబిరి తన పూర్తి మద్దతు పలికారు. హైసూ్కల్ విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడామె సేవలు ఘనా, సెనెగల్, కామెరూన్, రువాండా దేశాలకూ విస్తరించాయి. ఘనాలోని ఉన్నత లేదా మాధ్యమిక పాఠశాల బాలికలకు మార్గదర్శకం చేసే ‘గాళ్స్ ఇన్ మ్యాథమెటికల్ సైన్సెస్’ ప్రోగ్రామ్‌కు తబిరి అకడమిక్ మేనేజర్ వ్యవహరిస్తున్నారు. ‘‘హైసూ్కల్లో గణితం చదివే బాలికలు, బాలుర సంఖ్య దాదాపు సమానంగా ఉందని, విశ్వవిద్యాలయ స్థాయిలో అది తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నా’’అని ఆమె అన్నారు. ఆధునిక క్వాంటమ్ మెకానిక్స్ 100వ వార్షికోత్సవం సందర్భంగా 2025ను ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే ప్రతిపాదనలకు మెక్సికో మద్దతుతో ఘనా తరపున నాయకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సమస్యల పరిష్కారానికి.. ‘‘పిల్లలు తమ పాఠశాల పాఠాలను ఊరకే నేర్చుకోకుండా ఉన్నత లక్ష్యాల సాధనకు పనిముట్టుగా వాడుకోవాలి’’అని తబిరి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు్కలైన ఆఫ్రికా జనాభా 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తిగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అలాంటి పాఠశాల విద్యార్థులకు క్వాంటమ్ సైన్స్‌ను పరిచయం చేయడంలో తొలి అడుగుగా ‘క్వాంటమ్ రోడ్ షో’ను నిర్వహించాలని ఆమె భావిస్తున్నారు. యునెస్కోతో కలిసి పనిచేస్తున్న తబిరి వివిధ ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూలైలో ఎయిమ్స్–ఘనాలో వారం రోజుల పాటు ‘క్వాంటమ్ హ్యాకథాన్’ను నిర్వహించనున్నారు. తాము ఎదుర్కొంటున్న సవాళ్లను, నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి క్వాంటమ్ నైపుణ్యాలను ఉపయోగించాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. తబిరి విజయం కేవలం ఆమె వ్యక్తిగత విజయం కాదు. ఆఫ్రికన్ భవిష్యత్ తరాల గణిత శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళలకు ఆశాదీపంగా మారింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Angela Bassett: హృదయాలను ధైర్యంతో నింపుకోండి!
ఆస్కార్ అకాడమీ పద్నాలుగో ఆనరరీ అవార్డుల ప్రదానం అమెరికాలో జరిగింది. 2023 సంవత్సరానికిగాను నటి ఏంజెలా బాసెట్, నటుడు– రచయిత–ఫిల్మ్ మేకర్ మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్, సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు ఈ అవార్డులను ప్రదానం చేసింది అకాడమీ. అయితే ఈ వేడుక గత ఏడాది నవంబరు 18న జరగాల్సింది. కానీ హాలీవుడ్లో రచయితలు, నటీనటులు చేసిన సమ్మెల కారణంగా ఈ వేడుక వాయిదా పడింది. తాజాగా ఈ అవార్డు ప్రదానోత్సవం అమెరికాలో జరిగింది. ఈ గౌరవ పురస్కారాల అవార్డు విభాగంలో రెండో అవార్డును గెలుచుకున్న బ్లాక్ లేడీగా నిలిచారు ఏంజెలా బాసెట్. తొలిసారిగా నటి సిసిలీ టైసన్ ఈ గౌరవాన్ని ΄÷ందారు. ‘‘ఈ విభాగంలో నేను అవార్డు అందుకున్నందుకు ఆమె (సిసిలీ) స్వర్గంలో ఆనందంగా ఉండి ఉంటారు. నా తోటి బ్లాక్ యాక్ట్రస్ అందరికీ చెబుతున్నాను. మీ హృదయాలను ధైర్యంతో నింపుకోండి. ధృడంగా ఉండండి’’ అంటూ అవార్డు అందుకున్న అనంతరం ఏంజెలా బాసెట్ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘‘మీ సహచరులు మీ పనిని మెచ్చుకున్నప్పుడు మరియు వారు ఈ బంగారు విగ్రహంతో అభినందించినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఈ పురస్కారానికి నా మనసులో ఎప్పటికీ గౌరవం ఉంటుంది. అందుకే ఈ అవార్డును అమ్మను సుమా..’’ అని చమత్కరించారు మెల్ బ్రూక్స్. ఈ వేడుకలో టామ్ హాంక్స్, జూలియన్నే మూర్, మార్గొట్ రాబీ, కోల్మన్ డొమింగో వంటి హాలీవుడ్ ప్రముఖులు ΄ాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... చిత్రసీమకు విశిష్టమైన సేవలు అందించిన వారికి ఈ హానరరీ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. మరోవైపు ఈ ఏడాది మార్చిలో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. జనవరిలో నామినేషన్స్ వెల్లడి కానున్నాయి. -
డాక్టర్ డెత్
జూన్ 25 (1998), లండన్... పిల్లలను స్కూలుకు పంపించి ఇల్లు సర్దుకోవడంలో మునిగిపోయింది ఏంజెలా. అంతలో ఫోన్ రింగయ్యింది. చేస్తున్న పని ఆపి వెళ్లి ఫోన్ తీసింది. అవతలివాళ్లు చెప్పింది వినగానే ఆమె ముఖంలో రంగులు మారాయి. ‘‘వ్వా...ట్? ఎలా జరిగింది? నాకేం తెలియదే’’ అరిచినట్టే అంది. ఆ గొంతులో ఆవేదనతో పాటు ఆందోళన కూడా. ‘‘ఏమైంది ఏంజీ’’... భార్య స్వరం వినగానే లోపల్నుంచి బయటికొచ్చాడు ఉడ్ఫ్.ర ఫోన్ పెట్టేసి భర్త వైపు చూసింది ఏంజెలా. ‘‘అమ్మ... అమ్మ చనిపోయిందట. ఆమెని సమాధి చేయడానికి శ్మశానానికి తీసుకెళ్లారట.’’ ‘‘ఏంటీ... సమాధి చేయడానికి తీసుకెళ్లారా? మనకి చెప్పకుండా ఎవరు తీసుకెళ్లారు?’’ అన్నాడు కంగారుగా. ‘‘అదే తెలియడం లేదు. ఎవరో ఒక వ్యక్తి అంత్యక్రియలు చేస్తున్నాడట. డేవిడ్ అంకుల్ ఫోన్ చేశారు. పద వెళ్దాం.’’ వెంటనే ఇద్దరూ బయలుదేరారు. దారి పొడవునా ఏడుస్తూనే ఉంది ఏంజిలా. భర్త ఉద్యోగం నిమిత్తం వేరేచోట ఉండాల్సి వస్తోంది. తల్లిని తన దగ్గర ఉండమంటే సొంత ఇల్లు వదిలి రానంది. దాంతో ఓ పనిమనిషిని తోడుగా పెట్టి అక్కడే ఉంచిందామెని. అలా చేయకుండా ఉంటే బాగుండేదని కుమిలిపోతోంది. గంట తిరిగేసరికి ఇద్దరూ శ్మశానానికి చేరుకున్నారు. కానీ అప్పటికే అంత్యక్రియలు పూర్తయ్యాయి. అందరూ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. డేవిడ్ కూడా ఉండటంతో పరుగు పరుగున అతడి దగ్గరకు వెళ్లారు ఏంజెలా, ఆమె భర్త. ‘‘అంకుల్... ఏంటిది, ఏం జరుగుతోందిక్కడ?’’ అతడు పెదవి విరిచాడు. ‘‘నాకూ తెలియదమ్మా. అదిగో... ఆ డార్క్ గ్రీన్ సూట్లో ఉన్న వ్యక్తే మీ అమ్మకు అంత్యక్రియలు చేశాడు.’’ అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వెళ్లిపోతున్న ఆ వ్యక్తిని పరిశీలనగా చూసింది ఏంజెలా. యాభయ్యేళ్ల పైనే ఉంటుంది వయసు. అక్కడక్కడా నెరసిన వెంట్రుకలు, తెల్లని గడ్డం, కళ్లజోడు... హుందాగా ఉన్నాడు. కానీ అతడెవరో ఏంజెలాకి అంతు పట్టలేదు. గబగబా వెళ్లి అతడిని ఆపింది. ‘‘మీరెవరు? మా అమ్మకి మీరెందుకు అంత్యక్రియలు చేశారు? కనీసం నాకు ఫోన్ చేయాలని కూడా అనిపించలేదా?’’... బిగ్గరగా అంది. అతడి ముఖంలో భావాలేమీ మారలేదు. ‘‘నా పేరు హెరాల్డ్ షిప్‌మన్. మీ అమ్మగారి డాక్టర్ని. నిన్న ఆవిడ ఒంట్లో బాలేదని హాస్పిటల్‌కి వచ్చారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. అయితే చనిపోయే ముందు ఆవిడ తన ఆస్తినంతా నా పేర రాశారు. అందుకే వారసుడిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను.’’ నోరు తెరచుకుని వింటూ ఉండిపోయింది ఏంజెలా. ఎలా రియాక్టవ్వాలో అర్థం కాలేదు. ఉడ్ఫ్ ్రమాత్రం వెంటనే రియాక్టయ్యాడు. ‘‘ఏం మాట్లాడుతున్నారు? కన్నకూతురు ఉండగా మీకెందుకు ఆస్తి రాస్తుంది? నిజం చెప్పండి, ఏం చేశారు మా అత్తని?’’ నవ్వాడు షిప్‌మన్. జేబులోంచి ఓ కాగితం తీసి ఉడ్ఫ్ ్రచేతిలో పెట్టాడు. తన యావదాస్తినీ డాక్టర్ షిప్మన్కు ఇస్తున్నట్టుగా ఏంజెలా తల్లి క్యాథలీన్ రాసిన విల్లు కాపీ అది. దాన్ని చూసి ఉడ్ఫ్ ్రకూడా షాకయ్యాడు. ‘‘తెలిసిందిగా నిజమేమిటో. డోన్ట్ వేస్ట్ మై టైమ్’’ అనేసి వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు డాక్టర్ షిప్‌మన్. కాసేపటివరూ ఏంజెలా, ఉడ్ఫ్ల్రు ఈ లోకంలోకి రాలేకపోయారు. ‘‘అంటే... ఆ డాక్టరే మీ అమ్మగారిని చంపాడని అంటారా?’’... ఆరా తీస్తున్నట్టుగా అడిగాడు ఇన్స్పెక్టర్ రిచర్డ్స్. ‘‘అవును సర్. కచ్చితంగా అతడే ఏదో చేశాడు. అమ్మ మరీ అంత బ్యాడ్ కండిషన్లో లేదని పనిమనిషి చెప్పింది. ఆసుపత్రికి వెళ్లేవరకూ బాగానే ఉన్నామె... చికిత్స చేయగానే ఎలా మరణిస్తుంది? అంటే ట్రీట్మెంట్ సమయంలోనే ఏదో జరిగింది. పైగా నా మీద అమ్మకే కోపమూ లేదు. నేను తనని వదిలిపెట్టేయలేదు. తనే కావాలని ఆ ఇంట్లో ఉంటోంది. రెండు రోజులకోసారి తనే ఫోన్ చేసి పలకరిస్తుంది. అలాంటిది ముక్కూ ముఖం తెలియని వ్యక్తికి ఆస్తి ఎందుకు రాస్తుంది?’’ తల పంకించాడు రిచర్డ్స్. ఏంజెలా ప్రతి మాటా ఆలోచింపజేసేదిగానే ఉంది. ‘‘ఓకే మిసెస్ ఏంజెలా... మాకు కొంత సమయం ఇవ్వండి. అతడు పెద్ద డాక్టర్. వెనకా ముందూ ఆలోచించకుండా ప్రశ్నించలేం. ముందు కాస్త ఎంక్వయిరీ చేసి, అప్పుడు అతణ్ని ప్రశ్నిస్తాం.’’ సరేనన్నట్టు తలూపింది ఏంజెలా. ‘‘ఆస్తి కోసం కాదు సర్. అమ్మకేమైందో తెలుసుకోవాలి. ఇష్టం లేకపోయినా తన కోరిక మేరకు ఒంటరిగా వదిలిపెట్టాను. తనని దూరం చేసుకున్నాను. ఆ బాధ నన్ను తొలిచేస్తోంది’’... గుండెల్లో బాధ కళ్లల్లో పొంగుకొచ్చింది ఏంజెలాకి. ఊరుకోమన్నట్టుగా భుజం తట్టి, ఆమెను బయటకు తీసుకెళ్లాడు ఉడ్ఫ్.్ర ‘‘ఇప్పుడేం చేద్దాం సర్’’... అడిగాడు సబార్డినేట్. ‘‘డాక్టర్గారి జాతకం బయటకు తీద్దాం పద’’ అంటూ లేచాడు రిచర్డ్స్. మాంచెస్టర్‌లో ఉన్న డానీ బ్రూక్ మెడికల్ సెంటర్‌కు చేరుకున్నాడు రిచర్డ్స్. డాక్టర్ షిప్‌మన్ ఆ హాస్పిటల్లోనే పని చేస్తున్నాడు. అయితే అతణ్ని కలవలేదు రిచర్డ్స్. చుట్టుపక్కల ఎంక్వయిరీ చేయమని సబార్డినేట్స్‌ని ఆదేశించాడు. కానీ షిప్మన్ని తప్పుబట్టేందుకు ఒక్క ఆధారమూ దొరకలేదు. దాంతో అతడిని ప్రశ్నించాలన్న ఆలోచనకు బ్రేక్ వేసి తిరిగి వెళ్లిపోయారు.‘‘అందరూ అతడు చాలా మంచివాడని, మర్యాదస్తుడని, మంచి డాక్టరని చెబుతున్నారు సర్.’’ తల పంకించాడు రిచర్డ్స్. అతడి బుర్రలో ఏదో మెదులుతోంది. కానీ దానికో స్పష్టమైన రూపం రావడం లేదు. కాసేపటి తర్వాత అన్నాడు... ‘‘కొద్ది రోజుల క్రితం ఓ క్రిమేషన్ సెంటర్ యజమాని ఒక కంప్లయింట్ ఇచ్చారు. ఆ ఫైల్ తీసుకురండి.’’ క్షణాల్లో ఫైల్ వచ్చింది. దాన్ని గబగబా తిరగేశాడు. అతడి భృకుటి ముడిపడింది. చేయి బిగుసుకుంది. డాక్టర్ షిప్మన్ని తీసుకు రమ్మని ఆర్డర్ వేశాడు. అరగంట తర్వాత అతడి ముందు ఉన్నాడు డాక్టర్. ‘‘చెప్పండి డాక్టర్... ఏం జరుగుతోంది మీ హాస్పిటల్లో?’’ కూల్‌గా అడిగాడు. ‘‘ట్రీట్మెంట్, కౌన్సెలింగ్, సర్జరీస్. అంతకంటే ఏం జరుగుతాయి సర్ హాస్పిటల్లో’’... అంతే కూల్‌గా అన్నాడు షిప్‌మన్. ‘‘మీలో డాక్టరే కాదు... మంచి కమెడియన్ కూడా ఉన్నాడే. నేనేమడుగుతున్నానో తెలిసి కూడా తెలియనట్టు నటించకు డాక్టర్. రెండు నెలల్లోనే మీ హాస్పిటల్లో పదిహేను మంది చనిపోయారు. ఎందుకని?’’ ‘‘వాళ్ల ఆయుష్షు తీరిపోయింది కాబట్టి.’’ ఒళ్లు మండిపోయింది రిచర్డ్స్‌కి. గట్టిగా అరవబోయి తమాయించుకున్నాడు. ‘‘ఆయుష్షు తీరిపోయిందా? వారి ఆయుష్షు తీరిపోయేలా మీరే చేశారా? కొద్ది రోజుల క్రితం ఓ క్రిమేషన్ సెంటర్ యజమాని మీ మీద కంప్లయింట్ ఇచ్చారు. వాళ్ల దగ్గరకు వచ్చే డెడ్‌బాడీస్ చాలావరకూ మీ హాస్పిటల్ నుంచే వస్తున్నాయని. దీనికి మీ సమాధానం ఏమిటి?’’ రిచర్డ్స్ ఎంత తీక్షణంగా అడిగినా చలించలేదు డాక్టర్ షిప్‌మన్. కూల్‌గానే ఉన్నాడు. నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. ‘‘ఆసుపత్రి అన్న తర్వాత రోగులు చనిపోతారు సర్. దానికి ఇంత ఎంక్వయిరీ, ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ అవసరమా?’’ డాక్టర్ షిప్‌మన్ తీరు చాలా అనుమానాలను రేకెత్తించింది రిచర్డ్స్‌లో. వెంటనే అన్ని పక్కల నుంచీ ఆధారాలను సేకరించే పనిలో పడ్డాడు. తను అక్కడికి కొత్తగా వచ్చాడు. అంతకు ముందు ఉన్న ఇన్స్పెక్టర్ క్రిమేషన్ సెంటర్ యజమాని ఇచ్చిన కంప్లయింటును సీరియస్‌గా తీసుకున్నట్టు లేడు. కనీసం డాక్టర్ గత చరిత్ర గురించి గానీ, అతడి ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య విధానాల గురించి కానీ పరిశోధించలేదు. అక్కడే తప్పు జరిగిందని అర్థమైంది రిచర్డ్స్‌కి. వెంటనే ఏంజెలా తల్లి శవాన్ని బయటకు తీయించి రీ పోస్ట్‌మార్టమ్ చేయించాడు. ఆమె శరీరంలో పెద్దమొత్తంలో మత్తుమందు ఉందని, ఆ ఓవర్‌డోస్ వల్లే ఆమె మరణించిందని తేలింది. దాంతో షిప్మన్ని అరెస్ట్ చేసి లోపలేశారు. ఆ తర్వాత బయటపడిన నిజాలు రిచర్డ్స్నే కాదు... యావత్ ప్రపంచాన్నే నివ్వెరపరిచాయి. డాక్టర్ షిప్‌మన్ దగ్గర వైద్యానికి వచ్చిన పేషెంట్లు చాలామంది మరణించారు. 1974 నుంచి అరెస్టయ్యే వరకూ దాదాపు 215 మంది రోగులు అతడి ఆసుపత్రిలో అసువులు బాశారు. అయితే ఏ ఒక్కరి కేస్ షీట్లోనూ లోపం లేదు. ఎందుకంటే వాళ్లందరి కేస్ షీట్లలోనూ చనిపోవడానికి ఆస్కారమున్న వ్యాధుల పేర్లు ముందే చేర్చాడు షిప్‌మన్. కానీ ఆ నేరాలను నిరూపించేందుకు మాత్రం ఆస్కారం లేకపోయింది. అయితే చివరలో మరణించిన పదిహేను మంది విషయంలో మాత్రం ఆధారాలను సేకరించగలిగారు పోలీసులు. చనిపోయి ఎక్కువ కాలం కానందున వారి మృతదేహాలను వెలికి తీసి, మళ్లీ పోస్ట్‌మార్టమ్ చేయించారు. అందరి శరీరాల్లోనూ పెద్ద మొత్తంలో మత్తుమందు దొరికింది. కొందరి శరీరాల్లో కొన్ని అవయవాలు లేకపోవడాన్ని కూడా గుర్తించారు. దాని గురించి అడిగినప్పుడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు షిప్‌మన్. చివరకు నిజం ఒప్పుకోక తప్పలేదు. దాంతో ఆ పదిహేను మంది మరణానికి బాధ్యుడిగా పేర్కొంటూ షిప్‌మన్ మీద కేసు నమోదు చేశారు. 2000వ సంవత్సరంలో అతడికి ఐదు జీవిత ఖైదులు విధించింది న్యాయస్థానం. నాలుగేళ్లు శిక్ష అనుభవించాక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు షిప్‌మన్. - సమీర నేలపూడి షిప్‌మన్ చేతిలో మరణించిన కొందరు హెరాల్డ్ షిప్మన్కి పదిహేడేళ్లున్నప్పుడు తల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించింది. చివరి రోజుల్లో ఆమె పడిన నరక యాతన... డాక్టర్ అవ్వాలన్న పట్టుదలను షిప్మన్లో పెంచింది. లారీ డ్రైవర్ అయిన తండ్రిని ఒప్పించి మెడికల్ కాలేజీలో చేరాడు. కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు. తల్లి వేదన చూడలేక డాక్టర్ అయినవాడు... ఎందరినో కాపాడతాడనుకున్నారు కానీ ప్రాణాలే తీస్తాడని ఎవరూ ఊహించలేదు. తన తల్లిలా ఎవరూ నరకయాతన పడకూడదన్న ఉద్దేశంతోనే మత్తిచ్చి చంపి విముక్తి కల్పించానని అన్నాడు షిప్‌మన్. మొదట్లో భయంకర రోగాలు ఉన్నవారిని మాత్రమే చంపినవాడు, ఆ తరువాత చిన్న చిన్న రుగ్మతలతో వచ్చినవారి ప్రాణాలు కూడా తీసేశాడు. ఫోర్జరీ చేసి కొందరి ఆస్తుల్ని కూడా సొంతం చేసుకున్నాడు. అతడి వికృత మనస్తత్వం ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ‘డాక్టర్ డెత్’ అంటూ మీడియా అతడి గురించి కథనాలను ప్రసారం చేసింది.