breaking news
Andhra pradesh hockey team
-
జాతీయ హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్ర అమ్మాయి
వచ్చే నెలలో స్పెయిన్‌లో జరిగే ఐదు దేశాల హాకీ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా హాకీ ఇండియా (హెచ్ఐ) ఈనెల 22 నుంచి డిసెంబర్ 10 వరకు బెంగళూరులో జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించనుంది. 34 మందితో కూడిన బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఇతిమరపు రజని కూడా చోటు దక్కించుకుంది. ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత్‌తోపాటు ఐర్లాండ్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్ జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీ తర్వాత భారత్ జనవరిలో స్వదేశంలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో పోటీపడుతుంది. -
ఏపీ సారథి శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ హాకీ జట్టు సారథిగా శ్రీనివాసరావు వ్యవహరిస్తాడు. ఇతను హాకీ ఇండియా లీగ్‌లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌కు గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీ జట్టు జాతీయ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. లక్నోలో మంగళవారం మొదలైన ఈ టోర్నీ మ్యాచ్‌లు 20వ తేదీ వరకు జరగుతాయి. గ్రూప్-బిలో ఉన్న ఏపీ జట్టు ఈ నెల 14న తమ తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌ను ఎదుర్కొంటుంది. 15న రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌తో, 18న మూడో మ్యాచ్‌లో కంబైన్డ్ యూనివర్సిటీస్ జట్టుతో, 20న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఎయిరిండియాతో ఏపీ తలపడుతుంది. జట్టు: శ్రీనివాసరావు (కెప్టెన్, గుంటూరు), రమేశ్, నాగేంద్ర (యలమంచిలి), మణికంఠ (గూడూరు), సందీప్ రాజు, కిషోర్ (కడప), శివకుమార్ (నిజామాబాద్), సంపత్ కుమార్ (హైదరాబాద్), కృష్ణకిషోర్ (వైజాగ్), జావేద్ (ఆర్మూర్), మైలారి (హిందుపురం), నాగశ్రీను (కాకినాడ), రమేశ్‌కృష్ణ, తేజకిరణ్, చౌదరి బాబు, రాజేశ్ (తిరుపతి), సుదర్శనం (కర్నూల్), అక్రమ్ బాషా (అనంతపురం).