ఓటీటీ సిరీస్‌లో లెస్బీయన్ లిప్‌లాక్.. అవసరమా?
సినిమాల్లో ఇప్పుడు లిప్‌లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చిత్రాల్లో ముద్దు సన్నివేశాలను జోడిస్తున్నారు. ఇక వెబ్ సిరీస్‌లలో అలాంటి సన్నివేశాలకు అడ్డూ అదుపే లేదు. ప్రేక్షకులు కూడా వాటిని రొటీన్ సీన్లలాగే ట్రీట్ చేస్తున్నారు. ఒకప్పటిలా ఆ సన్నివేశాలపై చర్చించడం.. ఖండించడం జరగట్లేదు. కానీ చాలాకాలం తర్వాత మళ్లీ ఓ ముద్దు సీన్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ వెబ్ సిరీస్‌లో లెస్బియన్ మధ్య కిస్ సీన్ పెట్టడం అవసరమా అని ఓ వర్గం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అంధేరా’ ఆగస్ట్ 14న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ప్రియా బాపట్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ ధర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌కి మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఇందులో ఇద్దరు నటీమణుల మధ్య వచ్చే లెస్బియన్ ముద్దు సన్నివేశంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కథలో భాగంగా సుర్వీన్ చావ్లా- ప్రియా బాపట్ మధ్య ముద్దు పెట్టుకోవాలి. ఇద్దరూ ఈ సీన్లో అద్భుతంగా నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా నేచురల్‌గా నటించారని కొంతమంది వారిపై ప్రశంసలు కురిపిస్తుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఆ సీన్ అనవసరంగా పెట్టారని విమర్శిస్తున్నారు. అలాగే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ షోల్లో ఇటువంటి సీన్స్ అవసరం లేదని వాదిస్తున్నారు.