breaking news
Anders Weberg
-
అతి పే...ద్ద సినిమా : నిడివి 720 గంటలు
మన సినిమాలు రెండు నుంచి రెండున్నర గంటల నిడివితో ఉంటాయి. అదే హాలీవుడ్ సినిమాలయితే గంటన్నర లోపే. కానీ ఒకే సినిమా కొన్ని రోజుల పాటు కొనసాగితే ఎలా ఉంటుంది. అలాంటి సినిమా ఉంటుందన్న ఆలోచన కూడా మనకు రాదు. కానీ త్వరలో ఓ పే...ద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏకంగా 30 రోజులపాటు ఏకధాటిగా చూడాల్సిన సినిమా వెండితెరపై రానుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజంగా నిజం. స్వీడిష్ డైరెక్టర్ అండర్స్ వెబర్గ్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 20 ఏళ్ల పాటు విజువల్ ఆర్ట్స్ రంగంలో అనుభవం ఉన్న అండర్స్, 2020లో రీటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో అందరూ మాట్లాడుకునేలా ఏది చేయలేకపోయానని భావిస్తున్న అండర్స్, సుదీర్ఘమైన సినిమాను రూపొందించేందుకు నిర్ణయించుకున్నాడు. 'ఆంబియన్స్', పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూకీ సినిమాగా రూపొందిస్తున్నారు. డైలాగులు లేకుండా తెరకెక్కుతున్న ఈసినిమాను తన చివరి చిత్రంగా 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా డ్యూరేషన్ 720 గంటలు, అంటే సరిగ్గా 30 రోజులు. ఇప్పటికే 400 గంటల షూటింగ్‌ను పూర్తి చేశారు. 2018లో 72 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. 100 మంది నటులతో తీసే ఈ సినిమాను 2020లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసి, కేవలం ఒక షో మాత్రమే వేస్తారట. ఆ తరువాత మరెవూ ప్రదర్శించడానికి వీలు లేకుండా సినిమా కాపీలను తగులబెట్టాలని భావిస్తున్నాడు. ఆయనే నిర్మాత కూడా కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ కాపీలను తగులపెట్టాలన్న ఆలోచనపై పెద్ద ఎత్తు విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఈ సినిమా నిడివి 30 రోజులు..!
ఒక సినిమా నిడివి ఎంతుంటుంది. రెండు నుంచి రెండున్నర గంటలు. అరుదుగా కొన్ని సినిమాలు మూడు గంటలు, అంతకుమించినవి కూడా ఉన్నాయి. కానీ, ఇంత ఎక్కువ నిడివిగల సినిమాలు ఇటీవలి కాలంలో రావట్లేదు. ఎందుకంటే ప్రేక్షకులకు అంతసేపు కూర్చుని సినిమా చూసే ఓపిక ఉండట్లేదు. రెండున్నర గంటల నిడివి గల సినిమా చూడడమే భారంగా ఫీలవుతున్న ఈ రోజుల్లో 720 గంటలు (30 రోజులు) నిడివి గల సినిమాను చూడగలరా..? ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తారో లేదో తెలీదుకానీ, ఇంత నిడివి గల సినిమాను తీసేందుకు సిద్ధమయ్యాడో దర్శకుడు. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా.. స్వీడిష్ డైరెక్టర్ ఆలోచన.. స్వీడన్‌కు చెందిన దర్శకుడు ఆండర్స్ వెబెర్గ్. విజువల్ ఎఫెక్టŠస్తోపాటు ఇతర సినీ విభాగాలపైనా అతడికి పట్టుంది. అతడు 2020లో సినీ రంగం నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు. ఈలోగా ఏదో ఒక రకంగా తన ప్రత్యేకత చాటుకోవాలనుకున్నాడు. దీనిలో భాగంగా ప్రపంచంలో అత్యంత నిడివిగల సినిమాను రూపొందించాలనుకున్నాడు. అలా 30 రోజుల నిడివిగల సినిమాకు శ్రీకారం చుట్టాడు. యాంబియెన్స్.. 30 రోజుల నిడివితో రూపొందుతున్న ఈ సినిమా పేరు యాంబియెన్స్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. మూడునాలుగేళ్ల క్రితం నుంచే ఈ సినిమాను సొంత నిర్మాణంలో ఆండర్స్ తెరకెక్కిస్తున్నాడు. దీనిలో దాదాపు వంద మంది నటీనటులు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రత్యేకంగా కథ, సంభాషణలు అంటూ ఏమీ లేవు. అసలు సినిమాలో డైలాగులే ఉండవు. కేవలం దృశ్యాల్ని మాత్రమే చిత్రీకరించి, వాటికి ఎక్కువగా విజువల్ ఎఫెక్టŠస్ జోడించి సినిమాను రూపొందిస్తున్నాడు. నిరంతరం యాంబియెన్స్కి సంబంధించిన పని కొనసాగుతోంది. ట్రైలర్ నిడివి 72 గంటలు.. ప్రతి సినిమాకూ ట్రైలర్ ఉన్నట్లే దీనికీ ట్రైలర్లను విడుదల చేశారు. 2014లో ఏడు నిమిషాల నిడివితో తొలి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక రెండో ట్రైలర్‌ను గతేడాది విడుదల చేశారు. దీని నిడివి ఏడు గంటలు. 720 గంటల సినిమా కాబట్టి, దర్శకుడు ఏడు గంటల ట్రైలర్‌ను రూపొందించాడు. వచ్చే ఏడాది చివరి ట్రైలర్ విడుదల కానుంది. దీని నిడివి 72 గంటలు ఉండనున్నట్లు ఆండర్స్ తెలిపాడు. పూర్తి సినిమా 2020లో వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారే ప్రదర్శన.. చిత్రీకరణ పూర్తయ్యాక సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఆండర్స్ భావిస్తున్నాడు. అన్ని దేశాల్లోనూ ఒకే సమయంలో ప్రదర్శించాలనుకుంటున్నాడు. 30 రోజులపాటు నిరంతరంగా ఈ సినిమా పద్రర్శిస్తారు. ఒక్కసారి ప్రదర్శన పూర్తయ్యాక మళ్లీ ఈ సినిమాను చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రదర్శన పూర్తైన తర్వాత ఈ సినిమాను ఎవరికీ చిక్కకుండా నాశనం చేయాలని ఆండర్స్ ఆలోచన. ఇక ఆ తర్వాత ఈ సినిమాను మళ్లీ ఎవరూ చూసే అవకాశం లేదు.– సాక్షి, స్కూల్ ఎడిషన్