breaking news
Ammonium gas leak
-
గోవాలో విషపూరిత గ్యాస్ లీక్.. ఊరు మొత్తం ఖాళీ
-
విషపూరిత గ్యాస్ లీక్.. ఊరు మొత్తం ఖాళీ
పనాజీ : గోవాలో విషపూరిత గ్యాస్ లీక్ కావటంతో ఓ ఊరు మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చింది. అమ్మోనియా గ్యాస్‌ను తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ ప్రమాదానికి గురై గ్యాస్ లీక్ కాగా.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దగ్గరుండి మరీ గ్రామస్థులను పొరుగు ప్రాంతాలకు పంపించి వేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురికాగా, వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేయిస్తున్నారు. వాస్కో పట్టణం నుంచి పనాజీకి అమ్మోనియా గ్యాస్‌ను తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ ఉదయం 3గంటల సమయంలో చికాలిమ్ గ్రామం వద్ద హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ కావటంతో డ్రైవర్ అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఊరిని ఖాళీ చేయించారు. అంతా గాఢ నిద్రలో ఉండగా ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. త్వరగతిన అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఆ ఇద్దరు మహిళలు ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు. ఇక గ్రామం వద్ద క్రాసింగ్ ఏర్పాటు చేసిన అధికారులు.. మరో దారి గుండా వాహనాలను మళ్లిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీం అక్కడి పరిస్థితిని సమీక్షిస్తోంది. గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయని.. ప్రస్తుతం వారికి పొరుగు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశామని డిప్యూటీ కలెక్టర్ మహదేవ్ తెలిపారు. పరిస్థితి చక్కబడ్డాక వారందరినీ తిరిగి గ్రామంలోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు. -
ఆందోళన కలిగిస్తున్న అమోనియం లీకేజీ
జక్రాన్‌పల్లి,న్యూస్‌లైన్: ద్రవరూపంలో ఉన్న లిక్విడ్ అమోనియాన్ని తీసుకెళ్తూ ఓ ట్యాంకర్ మూడు రోజుల కింద జక్రాన్‌పల్లిలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్యాంకర్లో నుంచి ద్రవరూపంలో ఉన్న లిక్విడ్ అమోనియం లీకై వాయురూపంలోకి మార డం తో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లిక్విడ్ అమోనియం వాసనకు కళ్లు తిరుగుతూ వాంతు లు చేసుకుంటున్నామని ఇందిరానగర్ కాలనీవాసులు ఆరోపించారు. ట్యాంకర్‌ను ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని కోరారు.అమోనియం వల్ల పంటలు దెబ్బతిన్నాయని, నష్టపరిహారం ఇప్పించాలని రైతులు మండల అధికారులను కోరారు. రైతులకు పరిహారం చెల్లించే వరకు ట్యాంకర్‌ను ఇక్కడి నుంచి కదలనిచ్చేది లేదని డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.నర్సయ్య అధికారులను డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని డిచ్పల్లి సీఐ శ్రీధర్‌కుమార్ సోమవారం పరిశీలించారు. ట్యాంకర్లో పూర్తిగా నీటిని నింపామని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎస్సై రవి తెలిపారు.ద్రవ రూపం లో ఉన్న అమోనియం పూర్తిగా వాయురూపంలోకి మారిపోయిందని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి అపా యం ఉండద ని హెల్త్ సూపర్వైజర్ సాల్మన్ అన్నారు. వాసనకు కొంత ఇబ్బంది పడుతున్నారని, వేడి చేసిన నీటిని ఎక్కువగా తాగాలన్నారు.క ళ్లు మండితే మంచి నీళ్లతో కడుక్కోవాలని సూచించారు. గ్యాస్ గాలిలో కలిసిపోయినందున ఇప్పుడు చేయాల్సింది ఏమి ఉండదన్నారు.ట్యాంకర్ దగ్గర్లలోని ఇళ్లలో ఉండే కాలనీవాసులు ఇంటి కిటీకీలు పూర్తిగా మూసి వేయకూడదన్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. మండల తహశీల్దార్ అనిల్‌కుమార్,ఎంపీడీవో పీవీ శ్రీనివాస్ రోజంతా సంఘటన స్థలంలోనే ఉండి ప్రజ లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో లిక్విడ్ అమోనియం లీకేజీ కారణంగా దెబ్బతిన్న పంటలను సోమవారం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు పరిశీలించారు. లిక్విడ్ అమోనియం వాయు రూపంలో వెలువడి గ్రామస్తులు ఇబ్బందులు పడడమే కాకుండా పంటల రంగు మారింది. ట్యాంకర్ నిలిపి ఉంచిన ప్రాంతంలోని పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బత్నిన పంటలను ఎమ్మెల్యే మండవ పరిశీలించారు. అధికారులతో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.