breaking news
allopathi
-
‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’.. ‘మహా’లో కొత్త వివాదం
ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెరపైకి మరో వివాదం వచ్చింది. అదే ‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’. రాష్ట్రంలోని హోమియోపతి వైద్యులు ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన అనంతరం వారు అల్లోపతి మందులను సూచించేందుకు అనుమతినిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసింది.ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తోపాటు పలువురు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రోగుల భద్రత, వైద్య ప్రమాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో హోమియోపతి ప్రాక్టీషనర్లు కొన్ని షరతులతో ఆధునిక మందులను సూచించడానికి అనుమతించేలా చట్టంలో పలు సవరణలు చేసింది.దీని ప్రకారం, ఫార్మకాలజీలో ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులు, అల్లోపతి మందులను సూచించడానికి అర్హులు అవుతారు. మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (ఎంఎంసీ)ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఐఎంఏ ఈ నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసింది. హోమియోపతి వైద్యులకు అల్లోపతి మందులను సూచించే అధికారం ఇవ్వడం రోగుల భద్రతకు ముప్పుగా మారుతుందని ఐఎంఏ పేర్కొంది.ఆరు నెలల కోర్సుతో హోమియో వైద్యులు ఆధునిక వైద్యం నేర్చుకోవడం సాధ్యం కాదని, వైద్య ప్రమాణాలు దిగజారే అవకాశం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక రకమైన క్రాస్ ప్రాక్టీస్ అని, ఫలితంగా వైద్య రంగంలో గందరగోళం ఏర్పడవచ్చని వారు అంటున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఆధునిక ఫార్మకాలజీలో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులకు మాత్రమే అల్లోపతి మందులను సూచించే అధికారం ఉంటుందని ఎఫ్‌డీఏ పేర్కొంది. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. -
ఆయుర్వేదం అన్నాడు.. అల్లోపతి ఇస్తున్నాడు!
►అర్హత లేకున్నా డాక్టర్‌గా చలామణి ►నర్సింగ్‌హోం సీజ్, నిందితుడి అరెస్ట్ కౌడిపల్లి: ఆయుర్వేద డాక్టర్ అని చెప్పుకుంటూ.. అల్లోపతి వైద్యం చేస్తున్న వ్యక్తి కటకటాలపాలయ్యాడు. గతంలో రెండుసార్లు ఇతగాడి ఆస్పత్రిని అధికారులు సీజ్ చేసినా.. దర్జాగా మరోచోట దందా నడిపిస్తున్నాడు. కౌడిపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు... కౌడిపల్లిలోని అందుగులపల్లికి చెందిన సుధాకర్ కొన్నాళ్లుగా శ్రీనివాస మమత నర్సింగ్‌హోంను నిర్వహిస్తున్నాడు. అయితే, ఇక్కడ ఎక్కువగా అపెండిక్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని డీఎం అండ్ హెచ్ఓ బాలజీపవర్కు ఫిర్యాదుచేశారు. దీంతో ఆయన పోలీసులతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డాక్టర్‌గా చలామణి అవుతున్న సుధాకర్‌కు ఎలాంటి విద్యార్హతలు లేవని గుర్తించారు. నర్సింగ్‌హోంకు వస్తున్నట్టు చెబుతున్న ఎంబీబీఎస్ డాక్టర్ నాగరాజు ఎప్పడూ ఆస్పత్రికి రాలేదని, అతనికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా లే వని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆపరేషన్ థియేటర్లో ట్రాక్టర్ పరికరాలు ఉండటంతో వారు ఖంగుతిన్నారు. పోలీసులు ఆస్పత్రిని సీజ్‌చేసి నిందితుడిని అరెస్టుచేశారు.