breaking news
All-party protest
-
ధర్నాచౌక్ వద్ద అఖిలపక్ష బృందం దీక్ష
-
సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా: కడియం
జనగామ: కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, జఫర్గడ్, చిల్పూర్ మండలాలను వరంగల్ అర్బన్ జిల్లాలో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు స్టేషన్‌ఘన్‌పూర్ గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వాహనం కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. విషయం తెలుసుకున్న జేఏసీ నాయకులు ఆయనకు తమ గోడు వెలిబుచ్చారు. దీనికి స్పందించిన ఉపముఖ్యమంత్రి ‘ మీ ఆందోళనలో న్యాయం ఉంది. ఈ మూడు మండలాలను తిరిగి వరంగల్‌లో కలిపే అవసరం ఉంది. మీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానని’ హామీ ఇచ్చారు.