breaking news
AGS Entertainment
-
లవ్ టుడే హీరో మరో చిత్రం.. ఆ సూపర్ హిట్ కాంబో రిపీట్!
నటుడు జయంరవి హీరోగా నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ ఆ తరువాత లవ్‌టుడే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్‌హిట్‌ను అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఇదే సంస్థలో ప్రదీప్ రంగనాథన్ మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా తన కాలేజ్‌మేట్ అశ్వంత్ మారిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలింస్ చేశారు. దీని గురించి ఏజీఎస్ సంస్థ నిర్వాహకులు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నటుడు ప్రదీప్ రంగనాథన్ తన కాలేజ్‌మేట్, మిత్రుడు అశ్వంత్ మారిముత్తుతో కలిసి చిత్రం చేయాలన్నది దశాబ్దం కల అని పేర్కొన్నారు. అది ఇప్పటికి నెరవేరబోతోందని అన్నారు. కాగా ఈయన ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ తరువాత ఏజీఎస్ ఎంటర్‌టైయిన్‌మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 26వ చిత్రం అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని చెప్పారు. కాగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో గోట్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. Dedicated to all those who have a dream :) Joining hands with my brother , friend , well wisher @Dir_Ashwath and my home ground @Ags_production once again ❤️#AGS26 #PR03 Announcement video : https://t.co/JwLjs8n5HI#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh pic.twitter.com/hKxBbns9TB — Pradeep Ranganathan (@pradeeponelife) April 10, 2024 -
దీపావళికి పక్కా
తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన ‘మెర్సెల్, సర్కార్’ చిత్రాలు వరుసగా 2017, 2018 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. తాజాగా విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను కూడా దీపావళికే విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రబృందం ప్రకటించింది. కానీ షూటింగ్ స్లోగా జరుగుతోందని, దీపావళికి బొమ్మ థియేటర్స్‌లోకి రాదనే వార్తలు వినిపించాయి. ‘‘ఈ దీపావళికి పక్కా వస్తాం. అవాస్తవమైన వార్తలను నమ్మొద్దు’’ అని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్పష్టం చేసింది. ‘తేరీ, మెర్సెల్’ తర్వాత విజయ్–అట్లీ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.