దీపావళికి పక్కా | vijay, nayanthara new movie released on deepavali | Sakshi
Sakshi News home page

దీపావళికి పక్కా

Mar 1 2019 1:31 AM | Updated on Mar 1 2019 1:31 AM

vijay, nayanthara new movie released on deepavali - Sakshi

విజయ్‌

తమిళ నటుడు విజయ్‌ హీరోగా నటించిన ‘మెర్సెల్, సర్కార్‌’ చిత్రాలు వరుసగా 2017, 2018 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. తాజాగా విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమాను కూడా దీపావళికే విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రబృందం ప్రకటించింది. కానీ షూటింగ్‌ స్లోగా జరుగుతోందని, దీపావళికి బొమ్మ థియేటర్స్‌లోకి రాదనే వార్తలు వినిపించాయి. ‘‘ఈ దీపావళికి పక్కా వస్తాం. అవాస్తవమైన వార్తలను నమ్మొద్దు’’ అని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ స్పష్టం చేసింది. ‘తేరీ, మెర్సెల్‌’ తర్వాత విజయ్‌–అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement