breaking news
Advataijing
-
ట్రాన్స్‌జెండర్‌తో మార్కెటింగ్... గూగుల్ క్రిస్మస్ ప్రకటనపై వివాదం
మహిళల సంబంధ వస్తువులకు సంబంధించిన ప్రకటనను ట్రాన్స్‌జెండర్‌తో రూపొందించాలన్న టెక్ దిగ్గజం గూగుల్ ‘వినూత్న’ ఐడియా బెడిసికొట్టింది. దానిపై మహిళాలోకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. క్రిస్మస్ వేళ ఇలాంటి యాడ్ ఎందుకు తెచ్చారంటూ దుమ్మెత్తిపోశారు. అందమైన మహిళలే లేనట్టు ట్రాన్స్‌జెండర్‌తో యాడ్ చేస్తారా అంటూ నెటిజన్లు కూడా గూగుల్‌పై మండిపడుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా గూగుల్ తన సొంత షాపింగ్ వేదిక ‘గూగుల్ షాపింగ్’లో మహిళల ఉత్పత్తులను ప్రమోషన్‌కు ఒక యాడ్ సిద్ధం చేసింది. టిక్‌టాక్‌లో పేరొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ 30 ఏళ్ల సైరస్ వెస్సీని ప్రచారకర్తగా ఎంచుకుంది. చంపేసే చలిలో అత్యంత నాణ్యమైన మేకప్, చర్మ సంబంధ ఉపకరణాలు, దుస్తులను తక్కువ ధరకే కొనుక్కోండంటూ వెస్సీతో ఒక యాడ్ డిజైన్ చేసి ఆన్లైన్ ప్రసారాలు మొదలెట్టారు. కానీ అందులో ట్రాన్స్‌జెండర్ నటించడంతో ఆదరణ దేవుడెరుగు, విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘ఇది దారుణమైన అజెండాతో రూపొందించిన యాడ్. అమ్మాయిలను అవమానించాలని చేసినట్టుగా ఉంది’’ అంటూ పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత ఓలీ లండన్ అన్నారు. దాంతో, మహిళలను కించపరచాలనే దురుద్దేశమేదీ లేదంటూ గూగుల్ వివరణ ఇచి్చంది. సోషల్ మీడియాలో పేరొందిన ‘విభిన్న’ వ్యక్తులతో యాడ్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా రూపొందించినట్టు చెప్పుకొచ్చింది. – వాషింగ్టన్ -
‘థెరపీ’ ప్రకటనలపై గూగుల్ బ్యాన్
శాన్ప్రాన్సిస్కో: శాస్త్రీయంగా నిర్థారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం ప్రకటించింది. స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీల వంటి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణకాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్లు ఇకపై గూగుల్‌లో కనుమరుగు కానున్నాయని గూగుల్ పాలసీ సలహాదారు ఆడ్రిన్నె బిడ్డింగ్స్ తెలిపారు. బయో మెడికల్, సైంటిఫిక్ ఆధారాలు లేని అన్ని వైద్యవిధానాలు, థెరపీ ప్రకటనల నియంత్రణ కోసం కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. రోగాలతో బాధపడుతున్న వారు ఈ తరహా యాడ్స్ కారణంగా తప్పుదోవ పడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఇది మెడికల్ పరిశోధనలను తప్పుబట్టడం కాదని, నిర్థారణ కానటువంటి వాటిపై ఓ కన్నేసి ఉంచడం మాత్రమే అని స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అధ్యక్షుడు దీపక్ శ్రీవత్సవ స్వాగతించారు. సంపూర్ణ చికిత్సా విధానాలుగా అభివృద్ధిగాని ఇలాంటి చికిత్సలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి సందేశాలను నియంత్రించడంలో ఆన్లైన్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. -
పాజ్‌టివ్‌గా..!
పాజ్ అంటే కాస్తంత గ్యాప్. అంతేగానీ అది ఫుల్ స్టాప్ కాదు. మళ్లీ మరింత ఫలవంతమైన జీవితానికి ముందుగా వచ్చే ఆ గ్యాప్‌నకు ముందు టైమ్‌ను పెరీమెనోపాజ్ అంటారు. నిజానికి మెనోపాజ్ కూడా ఫుల్స్టాప్ కాదు. మరింత ఫలవంతమైన కాలానికి ముందు వచ్చే కొన్ని కుదుపుల్ని అధిగమించడమే! అది ఎలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం. అడ్వటైజింగ్ ప్రొఫెషనల్ నేత్రా షా కి 37 ఏళ్లు. అప్పటివరకు చలాకీగా, ఆడుతూ పాడుతూ పని చేస్తూ, చుట్టూ ఉన్న వాళ్లతో ఛలోక్తులు విసురుతూ ఎంతో సరదాగా ఉండే నేత్రా షా ఈ మధ్య ఎందుకనో బాగా డీలాపడిపోయింది. పిరియడ్స్ సరిగా రాకపోవడం, బరువు పెరగడంతోబాటు లైంగిక జీవనంలో కూడా స్తబ్ధత ఏర్పడింది. ఈ మార్పులన్నీ కూడా మానసిక ఒత్తిడి లేదా పనిభారం పెరగడం వల్లనే కాబోలు, కొద్దిరోజుల్లోనే సర్దుకుంటాయిలే అనుకుని సరిపెట్టుకుంది. అయితే ఆమె అనుకున్నట్లు సర్దుకోకపోగా, రానురానూ మరింత మందకొడిగా తయారైంది. దాంతో గైనకాలజిస్టును కలిసింది. కొన్ని ప్రశ్నలు, మరికొన్ని పరీక్షల అనంతరం డాక్టర్ చెప్పిన విషయమేమిటంటే, ఆమె పెరి మెనోపాజ్‌లో అడుగుపెట్టడం వల్లే ఈ మార్పులనీ, మందులు వాడటం కన్నా జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం వల్లే మేలు కలుగుతుందనీ హితబోధ చేసింది. డాక్టర్ చెప్పినట్లే చేయడంతో త్వరలోనే నేత్రాకు పరిస్థితులన్నీ అదుపులోకొచ్చాయి. మెనోపాజ్ ముందు దశలో ఇలా ఉంటుంది: పెరి మెనోపాజ్ గురించి గైనకాలజిస్ట్ డాక్టర్ సుమన్ బిజిలాని ఏమంటారంటే రుతుక్రమం అంతరించే దశ (మెనోపాజ్)కు కొద్ది సంవత్సరాలకు ముందే సహజంగా శరీరం ఆ దశకు చేరుకోవడానికి కావలసిన మార్పులు జరగడం మొదలవుతుంది. ఈ క్రమంలో స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం మెనోపాజ్‌కు అవసరమైన మార్పులను సంతరించుకోవడం మొదలవుతుంది. ఈ మార్పులు ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటాయి. కొందరికి ఈ దశ సౌకర్యంగా అనిపిస్తే, మరికొందరికి దుర్భరంగా అనిపించవచ్చు. రుతుచక్రంలో మార్పులు చోటు రావడమనేది అందరిలోనూ కామన్‌గా ఉండే అంశం. తొందర తొందరగా మూడ్స్ మారిపోతుండడం, లైంగిక జీవనం పట్ల విముఖత పెరగడం లేదా కొందరిలో కొత్తకోరికలు మొగ్గతొడగటం జరగవచ్చు. నిద్రలోనూ, జీర్ణక్రియలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే అతినిద్ర లేదా నిద్రలేమి, ఆకలి పెరగడం లేదా మందగించడం, బరువు పెరగడం లేదా తగ్గిపోవడం, నిస్త్రాణ, నిస్సత్తువ వంటి లక్షణాలు ఉంటాయి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం ఎక్కువమందిలో కనిపించే అంశం. పెరిమెనోపాజ్‌ను నిర్ధారించడానికి నిర్దిష్టమైన పరీక్షలు కానీ, పరీక్షాప్రక్రియలు కానీ ఏమీ ఉండకపోయినప్పటికీ, 40లలోకి అడుగుపెడుతుండగానే ప్రతి స్త్రీ తప్పనిసరిగా థైరాయిడ్, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి, విటమిన్ పరీక్షలు, క్యాల్షియం తగిన మోతాదులో ఉందో లేదో నిర్థారించుకునే కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మెనోపాజ్ దశకు చేరుకోవడానికి రెండునుంచి ఐదేళ్ల ముందుగానే రుతుచక్రంలో మార్పులు అంటే పిరియడ్స్ సరిగా రాకపోవడం లేదా నెలకు రెండుమూడుసార్లు రావడం, అధిక రక్తస్రావం, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం లేదా తగ్గడం, గుండె అమిత వేగంగా కొట్టుకోవడం, జుట్టు ఊడిపోవడం లేదా మాడు కనిపించేంతగా పలచబడటం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయనీ, వీటి ఆధారంగా పెరి మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టినట్లు తెలుసుకోవాలని డాక్టర్ శ్వేతా అగర్వాల్ చెబుతున్నారు. భారతీయ స్త్రీలలో మెనోపాజ్ వయసు తగ్గిపోతోంది! భారతీయ స్త్రీలలో మెనోపాజ్ దశకు చేరే సగటు వయసు 47. ఇదే పాశ్చాత్య దేశాలలో అయితే 51. గడిచిన దశాబ్దకాలంలో ఇందుకు సంబంధించిన తీరుతెన్నులను పరిశీలిస్తే... ఆధునికతలో పడి తిండి, నిద్ర వేళల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకోవడం, ఉరకలు పరుగుల జీవన శైలి, ఎక్కువవుతున్న పనిగంటలు, పనిభారం, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మల్టీనేషనల్ కంపెనీలలో పని చేసే కొందరు వర్కింగ్ ఉమెన్ స్మోకింగ్, డ్రింకింగ్ వంటి వాటికి అలవాటు పడుతుండటం కూడా మెనోపాజ్ సగటు వయసు తగ్గిపోవడానికి ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలినట్లు డాక్టర్ బిజ్లానీ చెబుతున్నారు. పీసీఓడీ, ఒత్తిడి, జీవనశైలి మార్పులు కూడా ఇందుకు దారి తీసే అంశాలని డాక్టర్ అగర్వాల్ అంటున్నారు. ఎలా ఎదుర్కోవాలంటే... జీవనశైలిలో తగిన మార్పులు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే వాటిని మానివేయడం, ఆహారంలో తగిన పాళ్లలో క్యాల్షియం, డీ విటమిన్ ఉండేలా చూసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం వంటి వాటి ద్వారానే ఈ దశను సమర్థంగా ఎదుర్కోవచ్చంటారు డాక్టర్ శ్వేత. పెరిమెనోపాజ్ అనేది ఒక దశే కానీ, రుగ్మత కాదు కాబట్టి దీనికి చికిత్స అవసరం లేదని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం, ధ్యానం లేదా యోగా, ఆటపాటలతో శరీరాన్ని, మనస్సును చురుగ్గా, ఉల్లాసంగా ఉండేలా చూసుకోవడం, కుటుంబసభ్యుల సహకారం తీసుకోవడం అవసరం. జీవనక్రమంలో మార్పులు అనేవి సహజమనీ, అవి వాటంతట అవే సర్దుకుపోతాయనే సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవడం అవసరమంటారు అగర్వాల్. అయితే బీపీ, సుగర్, క్యాన్సర్, హృద్రోగం వంటి ప్రమాదకరమైన వ్యాధులు చాపకింద నీరులా వ్యాపించేందుకు అవకాశమున్న వయసు కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలను అధిగమించేందుకు అవకాశముందంటున్నారు గైనకాలజిస్ట్లు డాక్టర్ బిజ్లాని, డాక్టర్ అగర్వాల్‌లు. 35 సంవత్సరాలు దాటిన భారతీయ స్త్రీలలో పెరిమెనోపాజ్ లక్షణాలు కనిపించడం వారు మెనోపాజ్ దశలో అడుగుపెట్టనున్నారని చెప్పడానికి శరీరం చేసే సహజసిద్ధమైన హెచ్చరికలు. అయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దీనిని నిర్ణయిస్తాయి.