breaking news
academic council
-
అకడమిక్ ప్రెజర్‌తో తస్మాత్ జాగ్రత్త!
యవ్వనం అంటేనే ఒక తుఫాను. అనేకానేక శారీరక, మానసిక, భావోద్వేగ, హార్మోన్ల మార్పులు ఒక్కసారిగా చుట్టుముడతాయి. వాటిని అర్థం చేసుకోలేక యువత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇవి చాలవన్నట్టు పదోతరగతి, ఇంటర్మీడియట్లలో చదువుల ఒత్తిడి పెరుగుతోంది. అది ప్రాణాలు బలికోరేంత ప్రమాదకరంగా మారుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (Nఇఖఆ) డేటా ప్రకారం 2020లో సుమారు 10,500 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల్లో 40 శాతం చదువుల ఒత్తిడితో ముడిపడి ఉన్నవేనని విద్యా మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. మరికొందరు తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు తేలింది. తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు..తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లల మీద వాళ్ల స్థాయికి మించిన ఒత్తిడి పెడుతున్నారు. ఇంట్లో ఉంటే చదువుకు ఇబ్బంది పడతారని హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇక కార్పొరేట్ కళాశాలలు కల్పించే ఒత్తిడి చెప్పనలవికాదు. వారం వారం పరీక్షలు నిర్వహిస్తూ, వాటిలో వచ్చే మార్కులను బట్టి క్లాసులు మారుస్తూ మరింత ఒత్తిడి పెంచుతున్నారు.‡ తూతూమంత్రంలా ఏడాది చివర స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. మొదటిసారి ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండటం, ఆటపాటలు, వ్యాయామం లేకుండా నిరంతరం పరీక్షలు, గ్రేడ్ పాయింట్లు, ర్యాంకులు వంటివన్నీ విద్యార్థుల ఆత్మవిశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. పర్ఫెక్షనిజం ప్రభావం.. ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలని టీనేజర్లు భావిస్తారు. అందుకోసం అసాధ్యమైన టార్గెట్స్ పెట్టుకుంటారు. వాటిని సాధించేందుకు నిద్రమాని చదువుతుంటారు. కానీ పర్ఫెక్షనిజం ఫిక్స్డ్ మైండ్‌సెట్‌కు దారితీస్తుంది. చదువుకూ, వ్యక్తిత్వానికీ తేడా తెలుసుకోలేరు. పర్ఫెక్షనిజం వల్ల తమ తెలివితేటలు, సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయని టీనేజర్లు నమ్ముతారు. ఇది వైఫల్యాలు శాశ్వతమని భావించేట్లు చేస్తుంది. దీంతో చిన్న ఫెయిల్యూర్ ఎదురైనా తట్టుకోలేక ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారు. ఇష్టంలేని చదువులు..చాలామంది విద్యార్థులు క్రీడలు, సంగీతం, డిస్కష¯Œ ్స, వాలంటీరింగ్ లాంటి భిన్న రంగాల్లో రాణించాలనుకుంటారు. కానీ ఆ వైపుగా ప్రోత్సహించే తల్లిదండ్రులు తక్కువ. దాంతో ఇష్టంలేని చదువులు టీనేజర్లలో ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు వారం వారం పరీక్షలు, మార్కులు, గ్రేడ్లు– టీనేజర్లను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాలపరంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తున్నాయి. ప్రతి పనికీ వంద శాతం సమయం ఇవ్వలేకపోతున్నామనే అపరాధభావానికి లోనుచేస్తున్నాయి.బ్యాలెన్స్ ముఖ్యం.. అకడమిక్ ప్రెజర్ తగ్గాలంటే టీనేజర్లను తమకు నచ్చింది చదవనివ్వాలి. ఏం చదివామనేది కాదు, ఎలా చదివామనేది ముఖ్యమని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇష్టంగా చదివినప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. చదువుతో పాటు స్పోర్ట్స్ లేదా వ్యాయామానికి అవకాశం కల్పించాలి. కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడం మాత్రమే సక్సెస్ అని భావించకుండా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆనందమే అసలైన సక్సెస్ అని నిర్వచించాలి.చదువుల ఒత్తిడికి కారణాలు.. 👉తమ పిల్లలు అత్యున్నత కెరీర్లో ఉండాలనే తల్లిదండ్రుల అంచనాలు · ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, ఉన్నత విద్యాసంస్థల కోసం తీవ్ర పోటీ · క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ కన్నా మార్కులు, ర్యాంకులపైనే ఎక్కువ దృష్టి పెట్టడం · పాఠశాలల్లో, కళాశాలల్లో కౌన్సెలింగ్ సౌకర్యాలు తక్కువగా ఉండటం 👉 ఆటపాటలకు అవకాశం లేకపోవడం, కోచింగ్, ట్యూషన్ల వల్ల అదనపు భారం · తగిన వనరుల్లేకుండానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో పోటీ 👉 అకడమిక్స్‌ను, ట్రెడిషనల్ జెండర్ రోల్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి యువతులపై అదనపు ఒత్తిడిఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యూహాలు.. 👉 మీ బలాలను అర్థం చేసుకుని వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోండి · తప్పులు, వైఫల్యాలను అర్థం చేసుకుని, వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగే గ్రోత్ మైండ్ సెట్‌ను పెంపొందించుకోండి · చదువు ఎంత ముఖ్యమో నిద్ర, వ్యాయామం, విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తించండి · సరైన టైమ్ మేనేజ్మెంట్ పద్ధతులు నేర్చుకుని, అమల్లో పెట్టండి · ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నప్పుడు మీలో మీరే బాధపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైకాలజిస్టుల సహాయం తీసుకోండి. -
ఆన్ లైన్ లో పీజీఈసెట్
విద్యా మండలి చరిత్రలో తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చరిత్రలోనే తొలిసారిగా ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష(పీజీఈసెట్)’ను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ‘పేపర్‌లెస్’గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ నేపథ్యంలోనే పలు ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం పీజీఈసెట్‌తో పాటు ఎడ్‌సెట్, పీఈసెట్ కమిటీల సమావేశాలు ఉస్మానియా వర్సిటీలో జరిగాయి. అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ విధానానికి కాస్త ఖర్చు ఎక్కువ అవుతున్నప్పటికీ.. మాస్ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి వాటిని నియంత్రించేందుకు ఆన్లైన్ విధానమే ఉత్తమమని చెప్పారు. తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న పీజీఈసెట్ పరీక్షలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎంసెట్ మెడికల్ విభాగం పరీక్షను కూడా ఆన్లైన్లో నిర్వహించాలని భావించామని.. కానీ భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో మౌలిక వసతుల సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. అయినా దీనిపై ఈనెల 13న నిపుణుల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం పీజీఈసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ల షెడ్యూల్‌లను విడుదల చేశారు. 14న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల కానుంది. అదేరోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా మే 7 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు రూ.150, మిగతావారికి రూ.300. మే 21 నుంచి www.tsedcet.org నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 27న పరీక్ష జరుగుతుంది. జూన్ 12న ఫలితాలను వెల్లడిస్తారు. పీఈసెట్ షెడ్యూల్ ఇదీ వ్యాయామ విద్యకు సంబంధించి బ్యాచిలర్ (బీపీఈడీ), డిప్లమో(డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్)’ మే 11న జరగనుం ది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 10 లేదా 11న విడుదల చేయనున్నారు. 14వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 25వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 1 వరకు, రూ.2,000తో మే 5వరకు, రూ.5,000 రుసుముతో మే 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.700. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకున్నవారు మే 2నుంచి, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకున్నవారు మే 10 నుంచి హాల్‌టికెట్లను www.tspecet.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేహదారుఢ్య పరీక్షలు హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు. పీజీఈసెట్ షెడ్యూల్ ఇలా.. ఎంఈ/ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పీజీఈసెట్-16ను సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. పీజీఈసెట్లోని వివిధ విభాగాల పరీక్షలు మే 30 నుంచి జూన్ 3వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరుగుతాయి. ఈ పరీక్షలకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ కేంద్రాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఈనెల 11న పీజీఈసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. 14వ తేదీ నుంచి www. tspgecet.acorg, www.osmania. ac.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 23 వరకు, రూ.500 ఫైన్‌తో మే 9వరకు, రూ.2,000 తో మే16 వరకు, రూ.5వేలతో మే 23వరకు, రూ.10వేల ఫైన్‌తో మే 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 23 నుంచి 28 వర కు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 24న ఫలితాలను వెల్లడిస్తారు.