breaking news
Abbayi Tho Ammayi
-
మనవాడి వాయిస్‌కీ... ఇప్పుడు డిమాండ్!
రాజ్ తరుణ్ ఇవాళ వరుస సక్సెస్‌లతో క్రేజీ హీరో. పైగా, మనవాడి మాట తీరూ బాగుంటుంది. గోదావరి జిల్లా యాసతో గమ్మత్తుగా ఉంటుంది. అందుకేనేమో ‘అబ్బాయితో అమ్మాయి’కి రాజ్ తరుణ్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారు. నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ తరుణ్ టూకీగా కథాపరిచయం చేస్తారు. జనవరి 1న అది హాల్లోవినాలి. -
మనమందరం ప్రేమికులమే!
‘‘ఒక్కొక్కరికి ఒక్కో విషయంపై ప్రేమ ఉంటుంది. నాకు సంగీతంపై ప్రేమ ఉంటే కొందరికి డబ్బులపై ఉంటుంది. కాబట్టి మనమందరం ప్రేమికులమే. నేను మ్యూజిక్ చేసిన సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. పాటలు విని శ్రోతలు మాట్లాడాలి. ఈ ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా అన్నారు. నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మిస్తున్న ‘అబ్బాయితో అమ్మాయి’ పాటల ఆవిష్కరణ బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇళయరాజా పాటల సీడీనీ, నాగశౌర్య తల్లి ఉష, పల్లక్ లల్వాని తల్లి దీపికా లల్వాని థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ - ‘‘నా కెరీర్ తొలిదశలోనే ఇళ యరాజాగారితో పనిచేయడం నా అదృష్టం. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా కంటే ముందే నేను రమేశ్‌వర్మతో సినిమా చేయాలి. ఇప్పటికి కుదిరింది’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు నల్లమలుపు బుజ్జి, సాయి కొర్రపాటి, అవసరాల శ్రీనివాస్, లగడపాటి శ్రీధర్, బెల్లంకొండ సురేశ్, సి. కల్యాణ్, దాసరి కిరణ్, రావు రమేశ్, మల్టీడైమన్షన్ వాసు, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.