24 నుంచి బీపీఈడీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ బీపీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతాయని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వి.రాంచంద్రం తెలిపారు.
ఈ నెల 24, 26, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.