
ఒకే పోలికతో ఉన్న ఇద్దరు కవలలు కనిపిస్తే ఒకింత వింతగా చూస్తాం. అదే ఒకేసారి 50 మంది కవలలు కనిపిస్తే సంభ్రమాశ్చర్యానికి గురవుతాం కదా. కవలల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 మంది కలుసుకున్నారు. ఇలా వీరిని చూసిన వారంతా భలే ఉన్నారే.. అంటూ ముచ్చటపడ్డారు.











