ఈ జనరేషన్‌లో అన్నీ టైమ్‌పాస్ ప్రేమలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.
ప్రేమలు మూడురోజుల ముచ్చటగానే ఉంటున్నాయి.
అయితే తమ ప్రేమ మాత్రం అలాంటిలాంటిది కాదని నిరూపించింది బుల్లితెర నటి సురభి.
నటుడు కరణ్ శర్మ- నటి సురభి చందన 13 ఏళ్లుగా ప్రేమించుకున్నారు.
జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. మార్చిలో పెళ్లి చేసుకున్నారు.
తాజాగా ఈ నాగిని నటి తన పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. అందరిలా పింక్, రెడ్ లెహంగాకు ఓటేయకుండా మిక్స్‌డ్ కలర్ లెహంగాలో కనిపించి అబ్బురపరిచింది.
ఈమె'ఇష్క్‌బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్' ఇలా పలు సీరియల్స్‌లో నటించింది.


