బుల్లితెర జంట శ్రెను పరిఖ్, అక్షయ్ మాత్రే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ 2021లో ప్రసారమైన 'ఘర్ ఏక్ మందిర్ కృపా అగ్రసేన్ మహారాజా కీ' అనే సీరియల్‌లో కలిసి నటించారు.
అప్పటి నుంచే వీరిమధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయింది
ఈ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి, పెళ్లికి పచ్చజెండా ఊపాయి
దీంతో శ్రెను సొంతూరైన గుజరాత్‌లోని వడోదరలో గురువారం(డిసెంబర్ 21న) వీరి వివాహం ఘనంగా జరిగింది.
తమ పెళ్లి ఫోటోలను ఈ నవదంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు
ఇందులో శ్రెను రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లెహంగాలో ధగధగ మెరిసిపోయింది


