
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. గురువారం ఉదయం ఓ ఆగంతకుడు సైఫ్‌పై దాడి చేశాడు.

అత్యవసర మెట్లమార్గంలో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నటుడిపై దాడి చేసి అక్కడినుంచి పరారయ్యాడు. సైఫ్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

ఇకపోతే ముంబైలోని బాంద్రాలో సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌లో సైఫ్-కరీనా దంపతులు నివాసముంటున్నారు.

12 అంతస్తుల భవనంలో నాలుగు అంతస్తులు సైఫ్ దంపతులు కొనుగోలు చేశారు.

2013లో రూ.48 కోట్లు పెట్టి తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీని విలువ ఇప్పుడు రూ.100 కోట్లుగా తెలుస్తోంది.

సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానం నవాబులు. ఈయన తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్..

భార్య బేగమ్ ఆఫ్ భోపాల్‌కు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్యాలెస్ కట్టించాడు. దీని విలువ రూ.800 కోట్లు.

సైఫ్ తండ్రి దివంగత నవాబ్ అలీఖాన్ పటౌడీ టీమిండియా కెప్టెన్.

ఇకపోతే సైఫ్ అలీ ఖాన్.. ఒక్కో సినిమాకు రూ.10-15 కోట్లు పారితోషికం తీసుకుంటాడని అంచనా!





