తొలి రోజున అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తారు.
మనుషులు ఎద్దు మొద్దు స్వరూపాలైపోకుండా చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి.
నిహారిక శైలపుత్రిగా ముస్తాబైన ఫోటో ఇది.
దుర్గాదేవి రెండో అవతారం బ్రహ్మచారిణి.
ఈమె పర్వతపుత్రి అయిన పార్వతిగా జన్మించి, ఆ పరమశివుడిని భర్తగా పొందాలనే కోరికతో ఘోర తపస్సు చేశారు.
బ్రహ్మచారిణి దేవిగా తెల్ల చీరలో కనిపించింది నిహారిక.
దుర్గామాత మూడో అవతారం చంద్రఘంట.
మీకు ఏ ఆపద రాకుండా కాపాడటానికి నేనున్నాను, భయపడకండి అని భక్తులకు అభయహస్తమిస్తుంది.
ఎరుపు చీరలో చంద్రఘంటగా తయారైంది నిహారిక.
దుర్గామాత నాలుగో అవతారం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ
గుమ్మడికాయ రూపంలో ఉన్న అండం పొదగడం వల్ల సకల ప్రాణికోటి ఆవిర్భవించిందని చెబుతుంటారు. ఈ దేవి అవతారంలో భాగంగా నీలి రంగు చీరలో, రెండు జడలతో ముస్తాబైంది నిహారిక.
దుర్గామాత అయిదో అవతారం స్కందమాత.
తనను నమ్మిన భక్తులు పతనం కాకుండా ఆ తల్లి కాపాడుతుందంటారు. ఈ అవతారంలో భాగంగా పసుపురంగు చీరలో మెరిసింది మెగా డాటర్.
దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. దశమినాడు మహిషాసురునిపై విజయం సాధించింది. అందుకే ఆ రోజు విజయదశమి అయింది.
మనుషుల్లోని దున్నపోతు లక్షణాన్ని పోగొట్టడమే మహిషాసుర వధకు సంకేతం. ఈ అవతారంలో భాగంగా ఆకుపచ్చని చీరలో మెరిసింది నిహారిక.
దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి.
తల్లి శరీరం చాలా నల్లగా భయంకరంగా ఉంటుంది. అందుకే ఆమెకు కాళిక అనే పేరు వచ్చింది. ఈ అవతారంలో భాగంగా నిమారిక బూడిద రంగు చీర కట్టింది.
దుర్గామాత ఎనిమిదో అవతారం మహాగౌరి.
ఈమె తెల్లటి ఎద్దు మీద స్వారీ చేస్తుంది. ఈమె ధరించిన చీర కూడా తెలుపే కానీ నిహారిక పర్పుల్ చీరలో కనిపించింది.
తల్లి తొమ్మిదో అవతారం సిద్ధిదాత్రి. భక్తుల కోరికలు సిద్ధింపజేసి, దానంచేసే దాత్రి ఈమె.


