నల్లమలలోని లోతట్టు ప్రాంతం సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి
మూడు రోజులపాటు నల్లమల కొండలు జనసంద్రంతో కిక్కిరిసి కనిపించాయి
దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వరం క్షేత్రం దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు
ఈసారి పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో ఇచ్చిన మూడు రోజుల వ్యవధిలో 24 గంటలపాటు సలేశ్వరం దర్శనానికి అనుమతించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు
రాత్రివేళ ఎక్కువ మంది లింగమయ్య దర్శనం చేసుకోవడం ఎంతో అనుభూతి ఇచ్చింది
అయితే ప్రతిఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా వర్షం కురిసేది. దీంతో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే రెండేళ్లుగా ఎలాంటి వర్షం కురవకపోవడంతో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు.
చివరిరోజు వస్తున్నాం.. లింగమయ్యా.. వెళ్లొస్తాం.. లింగమయ్యా అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు.


