
గజ్జెల లాగుల గలగలలు, కటార్ల విన్యాసాలు, డప్పు చప్ప్పుళ్లు, భక్తుల పూనకాల నడుమ లింగా.. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మార్మోగింది. మేడారం జాతర తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి జాతర (lingamanthula swamy jathara) (పెద్దగట్టు జాతర) (Peddagattu Jathara) ఆదివారం ప్రారంభమైంది

యాదవులు సంప్రదాయ దుస్తులు ధరించి భేరీల చప్పుళ్లతో సందడి చేశారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలతో పాటు ఇతర వాహనాల్లో యాదవులు, భక్తులు ఆదివారం అర్ధరాత్రికే గట్టుకు చేరుకున్నారు.













