కాలిఫోర్నియా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు

California fire is now largest in state history - Sakshi

కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాని కార్చిచ్చు కమ్మేస్తోంది. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద కార్చిచ్చు అని అధికారులు తెలిపారు. గత శుక్రవారం నుంచి సుమారు 2,83,800 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వంసం చేసింది. మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు రాంచ్‌ ఫైర్‌, రివర్‌ ఫైర్‌గా రెండు చోట్ల నుంచి వ్యాపిస్తూ మంటలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు  75 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. 
 
ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. కాలిఫోర్నియా మొత్తం 16 చోట్ల కార్చిచ్చు రగులుతోంది. ఆ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా నిరంతరం పనిచేస్తోంది. కాలిఫోర్నియా పర్యావరణ చట్టాల లోపం వల్లే కార్చిచ్చు ఆ రాష్ర్టాన్ని దావానలంలా మింగేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లను స్థానికులు ఖండించారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top