Wildfires
-
అమెజాన్‌లో కార్చిచ్చులు..బ్రెజిల్‌ను కమ్మేసిన పొగ
బ్రసిలియా: అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు దావానలంలా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చుల దెబ్బకు 80శాతం బ్రెజిల్‌ను పొగకమ్మేసింది. రెండేళ్ల క్రితం పక్కకు పెట్టిన కొవిడ్ మాస్కులకు బ్రెజిల్ ప్రజలు మళ్లీ పనిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. గత 14 ఏళ్లలో ఇంతటి కార్చిచ్చులు రాలేదని ఈయూ కోపర్నికస్ అబ్జర్వేటరీ పేర్కొంది. ఓవైపు బ్రెజిల్ తీవ్రమైన కరువులో అల్లాడుతుంటే మరోవైపు కార్చిచ్చులు ఉన్న పచ్చదనాన్ని దహనం చేస్తున్నాయి. అమెజాన్ పరివాహక ప్రాంతాల్లోని ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, పెరూల్లో లక్షల హెక్టార్ల అటవీ భూమి, పొలాలు దహనమైపోయాయి.భూమిపై అమెజాన్ బేసిన్‌కు అత్యంత తేమ ప్రాంతంగా పేరుంది. కార్చిచ్చులతో కమ్మేసిన పొగ పీలిస్తే రోజుకు ఐదు సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగ వల్ల రాజధాని బ్రసిలియాలో ఆస్పత్రులకు చాలామంది రోగులు శ్వాస సంబంధ ఇబ్బందులతో చికిత్స కోసం వస్తున్నారు. బ్రసిలియాలో దాదాపు 160 రోజులుగా చుక్క వర్షం పడలేదు. దీంతో ప్రజలు తడి గుడ్డలపై ఫ్యాన్ గాలి వచ్చేలా చేసి పొడి వాతావరణం నుంచి ఉపశమనం పొందుతున్నారు. సాగుకు వినియోగించేందుకుగాను అటవీభూమికి ప్రజలు నిప్పుపెడుతున్నట్లు గుర్తించారు. సోమవారం(సెప్టెంబర్30) బ్రెజిల్ పొరుగునున్న బొలీవియాలో కార్చిచ్చులను నేషనల్ డిజాస్టర్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం -
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌయి ప్రమాద బాధితులను కలిసి ఓదార్చే క్రమంలో కార్చిచ్చును 15 ఏళ్ల క్రితం తన వంటింట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పోల్చారు. ఆనాడు తాను తన భార్య ఇలాంటి ప్రమాదంలోనే ఇంటిని కోల్పోయిన సంఘటనను గుర్తుచేస్తూ ఆ బాధని వివరించే ప్రయత్నం చేశారు. . ఆగస్టు 8న హవాయిలోని మౌయి ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చు పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 114 మంది మరణించగా ఎందరో నిరాశ్రయులయ్యారు. జో బైడెన్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన వారిని కలిసి ఓదార్చారు. బాధితులతో జో బైడెన్ మాట్లాడుతూ ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత విషాదకరమైనదిగా వర్ణించారు. నేను ఈ పరిస్థితులను పోల్చడం లేదు కానీ ఉన్న ఇంటిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. 15 ఏళ్ల క్రితం నేను నా భార్య జిల్ బైడెన్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాము. నా నివాసానికి సమీపంలోని ఒక చెరువులో పిడుగు పడటంతో ఎయిర్ కండీషన్ వైరు ద్వారా ఆ మంటలు మా ఇంటిలో కూడా వ్యాపించాయి. ఇల్లు మొత్తం తగలబడింది. ప్రమాదంలో నా కారును, నా పెంపుడు పిల్లిని కోల్పోయానని.. ఆరోజు అగ్నిమాపక దళాలు సమయానికి స్పందించడంతో నేను నా కుటుంబం ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొలిన్ రగ్ అనే మీడియా ప్రతినిధి అమెరికాఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తన ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎందరో ప్రాణాలను హరించిన దావానలాన్ని అమెరికా అధ్యక్షుడు ఒక కట్టు కథ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లో జరిగిందని చెప్పిన అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందిని అడిగితే అదంతా వట్టి కట్టు కథని అలాంటిదేమీ జరగలేదని తోసిపుచ్చారని తెలిపారు. ఈ ప్రమాదాన్ని నియంత్రించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ చాలా నిదానంగా వ్యవహరించిందని ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన లాహైన్ నగరంలో ఎక్కడ చూసినా శిధిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రమాదంలో 114 మంది మరణించగా కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోగా ఎందరో నిరాశ్రయులై అత్యవసర సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు. NEW: President Biden once again tries to make the Maui fire that killed ~500 people about himself by telling a story about how he almost lost his corvette in a house fire. You can always count on Biden to tell a story that didn’t happened. “I don't want to compare difficulties,… pic.twitter.com/FI4bR85erR — Collin Rugg (@CollinRugg) August 22, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోద -
కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు.. వైరలవుతోన్న ఫోటో.. నిజమేనా?
హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
వాషింగ్టన్లో కార్చిచ్చు బీభత్సం
వాషింగ్టన్: అమెరికా, కెనడాలను కార్చిచ్చులు ఇంకా వెంటాడుతున్నాయి. రోజుకో ప్రాంతంలో కార్చిచ్చులు రేగుతూ ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా వాషింగ్టన్‌లోని స్పోకాన్ ప్రాంతంలో మొదలైన కార్చిచ్చు త్వరితగతిన వ్యాపిస్తోంది. కొద్ది గంటల్లో 3 వేల ఎకరాలను భస్మం చేసింది. దీంతో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. చాలా ఇళ్లు బూడిదగా మారాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం వాషింగ్టన్‌ను మంటలు కమ్మేయడంతో రెడ్ ఫ్లాగ్ వారి్నంగ్ జారీ చేశారు. అత్యంత తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వారి్నంగ్ జారీ చేస్తుంటారు. కెనడాలో 200 కార్చిచ్చులు కెనడా దేశంలోనూ కార్చిచ్చులు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వాయవ్య కెనడా ప్రాంతంలో 200కుపైగా కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. ఈ ఘటనల్లో అగ్గి దావానలంగా వేగంగా పరిసరాలకు వ్యాపించంతో వేలాది మందిని విమానాల్లో సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. -
USA: శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తు.. 93కు చేరిన హవాయి మరణాలు
లహైనా: అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. Footage of the initial start of the fires in Lahaina, Maui.#hawaii #wildfire No official cause has been released yet but class action lawsuits have already been opened by multiple law firms, suing the local utility and power companies for their roll in the tragedy. The class… pic.twitter.com/UGrDbqdEH2 — The Hotshot Wake Up (@HotshotWake) August 12, 2023 శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తు.. హవాయిలో సంభవించిన భీకర కార్చిచ్చులో మృతుల సంఖ్య 93కు చేరుకుంది. మౌయి దీవిలో 93 మంది మృతి చెందినట్లు ఇప్పటి వరకు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మౌయిలో అన్వేషణ కొనసాగుతోందని చెప్పారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతం 5 చదరపు మైళ్లు కాగా కేవలం 3% మేర గాలింపు పూర్తయిందన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పశ్చిమ మౌయిలోని నివాసాల్లో 86% అంటే 2,200భవనాలు ధ్వంసమైనట్లు తేల్చారు. నష్టం 6 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. హవాయి కార్చిచ్చును ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. కార్చిచ్చు కారణంగా హవాయిలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఫ్యామిలీ దాదాపు 5 గంటల పాటు పసిఫిక్ మహా సమద్రంలో తలదాచుకున్నారు. A family from Lahaina on Maui, Hawaii survived the deadly wildfire by hiding in Pacific Ocean for 5 hours.https://t.co/40DjjD7rk0 pic.twitter.com/inpG9nLXu5 — Numberonepal🐝 (@numberonepal) August 14, 2023 చరిత్రలో భారీ కార్చిచ్చులు.. దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు 🚨🚨. Oregon: Level 1 and Level 2 evacuation orders have been issued by Lane County for the Bedrock Fire. Follow @CBKNEWS121 FOR MORE UPDATES #breakingnews #Hawaii #Hawaiifires #LahainaFires #MauiFires #wildfire pic.twitter.com/xreuMzvNJc — CBKNEWS (@CBKNEWS121) August 14, 2023 ఇది కూడా చదవండి: పాక్‌లో చైనీయులపై కాల్పులు.. జిన్‌పింగ్ ఆదేశాలు ఇవే.. -
కార్చిచ్చు కనిపించని ఉచ్చు..!
కార్చిచ్చులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఏడాదికేడాది కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి దగ్ధం చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. మొదలైతే.. అంతే ► పశ్చిమ అమెరికా, దక్షిణ ఆ్రస్టేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా బ్రిటన్ అత్యధికంగా కార్చిచ్చుల బారినపడుతోంది. 2019లో బ్రిటన్‌లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది. ► బ్రిటన్‌లో మాంచెస్టర్‌లో 2019లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా మూడు వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలు ష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే పారిపోవడం జరిగింది. ► అమెరికాలో కాలిఫోరి్నయాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవుల్ని మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి. ► 2021లో ప్రపంచ దేశాల్లో కార్చిచ్చుల వల్ల 176 వందల కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసింది కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34 వేల మందికి ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. ► 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతి పెద్దది. ఈ కార్చిచ్చు వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకుంది. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14% 2050 నాటికి30%, ఈ శతాబ్దం అంతానికి 50%కార్చిచ్చులు పెరుగుతాయని యూఎన్ హెచ్చరించింది. ఎందుకీ మంటలు ? ► కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి, కరువు పరిస్థితులు ఏర్పడి, చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసినా కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి. ► మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లి క్యాంప్‌ఫైర్ వేసుకొని దానిని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకి కారణమవుతున్నాయి. ► ఇందనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోరి్నయాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. ► ప్రస్తుతం అమెరికా హవాయి ద్వీపంలో కార్చిచ్చు మెరుపు వేగంతో వ్యాపించడానికి డొరైన్ టోర్నడో వల్ల ఏర్పడిన బలమైన గాలులే కారణం. కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపించడానికి గాలులే ప్రధా న పాత్ర పోషించాయి. అగ్గి మరింత రాజేస్తున్న వాతావరణ మార్పులు సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మానవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. 1760లో పారిశ్రామిక విప్లవం వచి్చన తర్వాత భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయాయి. దీని ప్రభావం ప్రకృతిపై తీవ్రంగా పడింది. అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోరి్నయాలో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి తీవ్రత మరింత పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఏ సమస్య అయినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా గ్లోబల్ వారి్మంగ్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో పని చేస్తే కార్చిచ్చులతో పాటు ఇతర సమస్యల్ని కూడా అధిగమించవచ్చు. చరిత్రలో భారీ కార్చిచ్చులు దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
నల్లగా మారిన ఆకాశం.. వణికిపోతున్న అధ్యక్షుడు బైడెన్..
కెనడాని కార్చిచ్చు వణికిస్తోంది. చాలా రోజులుగా కొనసాగుతున్న దావానలంతో తమ దేశ చరిత్రలో ఇప్పటివరకు లేనంతగా వాయు కాలుష్యం జరిగినట్లు ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కెనడా తూర్పూ, పశ్చిమ భాగాల్లో సంభవించిన కార్చిచ్చుతో రికార్డ్ స్థాయిలో 160 మిలియన్ టన్నుల కార్బన్ విడుదలైనట్లు పేర్కొంది. దీంతో అటు పక్కనే అమెరికా కూడా చిక్కుల్లో పడింది. యూఎస్ గగనతలాన్ని పొగలు కమ్మేశాయి. న్యూయార్క్, టొరెంటో నగరాల్లో ఆకాశం నల్లని దుప్పటి కప్పినట్లు తయారైంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో చాలా రోజులుగా అడవుల్లో మంటలు చెలరేగాయి. బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, సస్కట్చేవాన్, తూర్పున అంటారియో, క్యూబెక్, నోవా స్కోటియాతో సహా పలు ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. మే నెల నుంచే ఆదేశ అధికార యంత్రాంగం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం 490 ప్రదేశాల్లో మంటలు చెలరేగగా.. 255 ప్రదేశాల్లో నియంత్రించలేని స్థితిలో దావానలం వ్యాపించింది. మిన్నెసోటా, మిన్నియాపాలిస్లలో వాతావరణం నల్లగా మారిపోయింది. దీంతో మంగళవారం రాత్రి నుంచి మిన్నెసోటాలో 23వ గాలి నాణ్యత హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశంలో గత జనవరి నుంచి 76,129 కిలోమీటర్లలో అటవీ సంపద కాలి బూడిదైంది. 1989 నాటి విపత్తు కంటే ఇదే అతి పెద్దది. అప్పట్లో 75,596 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించగా.. ప్రస్తుత కార్చిచ్చు ఆ రికార్డ్‌ను దాటిపోయింది. కెనడాలో విస్తరిస్తున్న కార్చిచ్చుతో అమెరికాలో వాతావరణం ఇబ్బందుల్లో పడింది. న్యూయార్క్ 413 వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)తో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది. స్కేల్‌పై గరిష్ఠ ఏక్యూఐ 500 అయితే.. న్యూయార్క్ నగరంలో వాయు కాలుష్యం 400 దాటిందంటేనే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీంతో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: 'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు.. -
Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..
శాన్టియాగో: చీలి దేశంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వేసవిలో వేడిగాలులకు అగ్గి రాజుకొని అడువులు తగలబడిపోతున్నాయి మొత్తం 151 చోట్ల కార్చిచ్చు ఘటనలు వెలుగుచూశాయి. వాటిలో 65 చోట్ల మంటలను అదపుచేశారు. బుధవారం నుంచి వ్యాపిస్తున్న కార్చిచ్చు కారణంగా 35 వేల ఎకరాలు బూడిదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో 13 మంది మరణించినట్లు వివరించారు. మృతుల్లో ఓ హెలికాప్టర్ పైలట్‌తో పాటు మెకానిక్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరు ఓ ప్రాంతంలో మంటలను అదుపు చేసేందుకు వెళ్లి హెలికాఫ్టర్ క్రాష్ అయి చనిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. హెలికాఫ్టర్ ట్యాంకర్లతో సహాయక చర్యలు చేపట్టింది. కార్చిచ్చు నేపథ్యంలో చీలి అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తన వెకేషన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ అత్యవసర పరిస్థితిలో 24 గంటలు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కార్చిచ్చును విపత్తుగా ప్రకటించారు. దీంతో సైన్యం కూడా రంగంలోకి సహాయక చర్యలు చేపట్టింది. 2017లో కూడా చీలిలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అప్పుడు 11 మంది వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. 1500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,15,000 ఎకరాల అటవీప్రాంతం కాలిబూడిదైంది. చదవండి: సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు.. -
కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. ఎమర్జెన్సీ విధింపు
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. మరిపోసా కౌంటీలో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. యోస్మైట్ నేషనల్ పార్కు సమీపంలో ప్రారంభమైన కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అక్కడి 2,600 నివాసాలు, వ్యాపార సంస్థల్లోని 6 వేల మందిని వేరే చోటుకు తరలించారు. 400 మంది ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. Here is a view of the Oak Fire activity on Jerseydale rd near the Forest Service Station. The fire has burned 14,281 acres as of this morning. Today will be another tough day of operations for all resources.🙏to the individual who sent this in to us #oakfire #California #mariposa pic.twitter.com/pjXOUFARJq — TheHotshotWakeUp: Podcast (@HotshotWake) July 24, 2022 ఇదీ చదవండి: ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద -
కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఫొటోలు
-
భారీగా చెలరేగిన మంటలు: 42 మంది ఆహుతి
అల్జీరియా : ఒకేసారి అటవీ ప్రాంతంలో అంటుకున్న దావానలం ఘోర విషాదాన్ని నింపింది. ఏకంగా 42 మంది అగ్నికి ఆహుతైన ఈ ఘటన కలకలం రేపింది. ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిలో సహాయక చర్యల్లో ఉన్న 25మంది సైనికులతోపాటు మరో 17మంది పౌరులున్నారని అధికారులు తెలిపారు. మరో 14 మంది సైనికులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజధాని అల్జీర్స్‌కి తూర్పున ఉన్న కబీలీ ప్రాంతంలోని అటవీప్రాంతమైన కొండలపై మంటలు, భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘోరంపై ప్రెసిడెంట్ అబ్దేల్మాద్జిద్ తెబ్బౌన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. బాధిత బెజియా, టిజి ఓజౌ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు బలగాలను అప్రమత్తం చేశామని ఆయన ట్వీట్ చేశారు. సైన్యాన్ని కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు పెద్ద ఎత్తున చెలరేగిన మంటలపై కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఒకేసారి మంటలంటుకోవడం వెనుక క్రిమినల్స్ హస్తం తప్పక ఉండి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. గ్రీస్, టర్కీ, సైప్రస్, పశ్చిమ అమెరికా సహా ఇటీవలి భారీ మంటల బారిన పడిన దేశాల జాబితాలో అల్జీరియా చేరింది. సోమవారం రాత్రి నుంచి మంటలు చేలరేగడంతో అడవులు కాలిబూడిదవుతున్నాయి. దేశంలోని ఉత్తరాన ఉన్న 18 రాష్ట్రాల్లో 70కి పైగా ప్రదేశాల్లో మంటలు చెలరేగాయి, వీటిలో కబిలీలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలు పది ఉన్నాయి. దావానలంలో వ్యాపించిన అగ్నికీలలకు కబైలీ ప్రాంతంలోని ఆలివ్ చెట్లు పూర్తిగా నాశనమైపోయాయి. అనేక పశువులు, కోళ్లు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. మొత్తం కొండంతా మండుతున్న అగ్నిగోళంలా మారిపోయిందని, ఒక్కసారిగా ప్రపంచం అంతమైపోతుందా అన్నంత భయపడ్డామంటూ ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా నివేదించింది. కాగా గత నెలలో అడవులకు నిప్పుపెట్టిన కేసుల్లో 30 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు, మరణ శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష విధించే బిల్లును జారీ చేశారు. జూలైలో, ఆరెస్ పర్వతాలలో 15 చదరపు కిలోమీటర్ల (ఆరు చదరపు మైళ్ళు) అడవి ధ్వంసానికి కారణమైన మానితులపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 2020 లో, దాదాపు 440 చదరపు కిలోమీటర్లు (170 చదరపు మైళ్ళు) అడవి అగ్నిప్రమాదానికి గురైంది. అనేక మందిని అరెస్టు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #Algeria : Defence ministry has just said that 18 members of military have died as result of fires raging through forests & hillsides of Kabylie #الجزائر pic.twitter.com/uPVZ6jGMUf — sebastian usher (@sebusher) August 10, 2021 the fires in algeria are still strong; eleven dead were reported with over 80 wounded.. no help from the authorities was sent yet 💔#AlgeriaIsBurning pic.twitter.com/ki7mSRRD1s — ♠️ (@cicegimeda) August 10, 2021 Fires everywhere #PrayForAlgeria #Algeria https://t.co/r7JMeB4GpF — Jasmine 🌺 (@jasoSisin) August 10, 2021 -
కాలిఫోర్నియాలో ఆరని కార్చిచ్చు ఫొటోలు
-
ప్రకృతి లాగే దేశ రాజకీయాలు మారుతున్నాయి
కాలిఫోర్నియా : గురువారం ఉదయం కాలిఫోర్నియాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అడవిలో కార్చిచ్చు అంటుకొని అగ్ని కీలలు ఎగిసిపడి బారీగా మంటలు అంటుకున్నాయి. దీంతో నీలం రంగులో ఉండాల్సిన ఆకాశం మొత్తం నారింజ రంగులోకి మారింది. ఈ దృష్యాలను అమెరికన్లు తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీళ్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారు. బరాక్ ఒబామా ఫోటోలను షేర్ చేస్తూ రాజకీయ కోణంలో చేసిన ఒక ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒబామా ట్వీట్ చేశారు. (చదవండి :వ్యాక్సిన్ పంపిణీపై ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు) 'వెస్ట్ కోస్ట్ ప్రాంతమంతటా మంటలంటుకొని వాతావరణం పూర్తిగా నారింజ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ప్రకృతి ప్రకోపంతో మారిపోయినట్లే దేశ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు మన దేశాన్ని రక్షించడమనేది బ్యాలెట్ చేతుల్లో ఉంది. ప్రకృతిని కాపాడుకోవడానికి బాధ్యత అనే ఓటు ఎంత అవసరమో.. రాజకీయాల్లో కూడా ఓటుకు అంతే పవర్ ఉంటుంది. దానిని సక్రమ మార్గంలో వినియోగించండి.' అంటూ కామెంట్ చేశారు. కాలిఫోర్నియాలో మరోసారి కార్చిచ్చు కాలిఫోర్నియాలో మరోసారి అడవులను కార్చిచ్చు దహించివేస్తోంది. తాజాగా, చెలరేగిన దావానలంలో లక్షలాది ఎకరాల్లో అడవి దగ్ధమైంది. బారీగా చెలరేగిన మంటల కారణంగా సమీప ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఓరెగాన్‌లో వందలాది గృహాలు మంటలకు కాలిబూడిదయ్యాయని కాలిఫోర్నియా గవర్నర్ కేట్ బ్రౌన్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం ఉపశమనం లభించే సూచనలు కనిపించడంలేదని, గాలులు బలంగా వీస్తుండటంతో పట్టణాలు, నగరాలకు మంటలు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు పట్టణాలు గణనీయంగా దెబ్బతిన్నాయని చెప్పిన బ్రౌన్.. ఎన్ని గృహాలు మంటలకు ఆహుతయ్యాయనేది స్పష్టంగా చెప్పలేదు. కానీ, అత్యవసర నిర్వహణ అధికారులు 4,70,000 ఎకరాలకు పైగా అడవులు కాలిబూడిదవుతున్నట్టు తెలిపారు. -
ఆస్ట్రేలియా ప్రధాని రాక వాయిదా
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేస్తున్నామని, రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని ట్వీట్ చేశారు. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఇరు దేశాల ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు భారీగా ఆస్తులను దహనం చేస్తోంది. ఈ విపత్తు సమయంలో తాను దేశంలో ఉండి పౌరులకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని మారిసన్ పేర్కొన్నారు. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ శుక్రవారం మారిసన్‌తో మాట్లాడారు. భారతీయుల తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతిచెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. -
‘అవని’ అంతంపై ఆరోపణలు
మ్యాన్ ఈటర్‌గా మారిన ఆడపులి ‘అవని’ అలియాస్ టీ–1 ని కాల్చి చంపడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతిమ ప్రయత్నంగా మాత్రమే ఆ పులిని చంపాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టి, ఎలాంటి నిబంధనలను పాటించకుండా వేటగాడి తూటాలకు బలివ్వడంపై వన్యప్రాణుల హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి మేనకా గాంధీ ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బొరాటి అటవీ ప్రాంతంలో ఉండే ఆడపులి ‘అవని’, అధికారులు పెట్టిన పేరు టీ–1, గత రెండేళ్లలో సమీపంలోని పొలాలు, గ్రామాల్లో ఉండే 13 మంది రైతులు, ఆదివాసీలను నరమాంస భక్షణకు అలవాటైన ఆ పులి చంపేసిందని భావిస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ పులిని పట్టుకునేందుకు గత మూడు నెలలుగా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహారాష్ట్ర అటవీ శాఖ ఈ పులిని చంపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్ అస్ఘర్ అలీని రంగంలోకి దించింది. ఆయన శుక్రవారం రాత్రి అడవిలో ఉన్న ‘అవని’ని వేటాడి కాల్చి చంపారు. మత్తు ఇచ్చేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో వారి ప్రాణాలను కాపాడేందుకే అవనిని కాల్చి చంపాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు అటవీ మంత్రి సుధీర్ మునగంటి వార్ తెలిపారు. అవనికి ఉన్న పది నెలల రెండు పిల్లలకు తమను తాము పోషించుకోగల శక్తి ఉందన్నారు. వాటి పోషణ బాధ్యతను తమ శాఖ తీసుకుంటుందని తెలిపారు. అధికారులు ఏం చేయాలి? మ్యాన్ ఈటర్లను చంపాల్సిన సందర్భాల్లో అధికారులు ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారినా, జబ్బు పడినా, అవయవాలు పనిచేయని స్థితిలో ఉన్నా అదీ దానిని పట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణులను చంపేందుకు అనుమతివ్వవచ్చు. దీంతోపాటు ఆ పులిని వేటగాడు స్పష్టంగా గుర్తించాలి. కెమెరా ట్రాప్‌లు లేక చారల తీరును బట్టి అది మ్యాన్ ఈటరేనని ధ్రువీకరించుకోవాలి. మ్యాన్ ఈటర్‌ను చంపిన వారికి అవార్డులు/రివార్డులు ఇవ్వడం కూడా నిషిద్ధం. విశాలమైన ప్రాంతంలో దానిని వేటాడేప్పుడు వెంట వన్యప్రాణుల నిపుణులు, బయోలజిస్టులు, పశువైద్యుడు, మత్తుమందు నిపుణులతో కూడిన బృందం ఉండాలి. ప్రభుత్వ ప్రతినిధిగా ఒక వైద్యుడు కూడా ఉండాలి. ఇవేమీ లేకపోవడం ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వేటగాడు, ఆ పక్కన అవని కళేబరం ఉన్న ఫొటోలు మీడియాలో యథాతధంగా ప్రసారమయ్యాయి. ఇలా చేయడం 2016 నాటి ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పునకు విరుద్ధం. షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌తోపాటు అతడి కొడుకు అస్ఘర్ అలీఖాన్ ప్రభుత్వం అవనిని చంపటానికి పురమాయించింది. అస్ఘర్‌కు పులిని వేటాడేందుకు అనుమతి ఉందీ లేనిదీ తెలియదు. చంపడం అంతిమ యత్నమే కావాలి అవనిని చంపాలన్న ప్రతిపాదన కొన్ని నెలల క్రితమే వెలుగులోకి రాగా కొందరు వ్యతిరేకించారు. కొందరు అనుకూలంగా మాట్లాడారు. ఇది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టుకు చేరగా.. అవనిని మత్తు మందు ఇచ్చి బంధించడంలో విఫలమైన సందర్భాల్లో ఆఖరి యత్నంగా మాత్రమే కాల్చి చంపాలని ఆదేశించింది. అటవీ మంత్రే కారకుడు: మేనక ‘జంతువుల పట్ల ఎవరికీ సహానుభూతి లేదు. 1972 వన్యప్రాణుల చట్టం ప్రకారం అడవి జంతువులను కాల్చి చంపడం నేరం. మహారాష్ట్ర ప్రభుత్వం పులిని దారుణంగా చంపించింది. అటవీ మంత్రే దీనికి కారకుడు. ఈ విషయమై సీఎం ఫడ్నవిస్‌తో మాట్లాడతా. మ్యాన్ ఈటర్‌ను చంపేందుకు అస్ఘర్ అలీకి ఎటువంటి అధికారమూ లేదు’ అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఈ ఘటనను ఖండించింది. -
కాలిఫోర్నియా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాని కార్చిచ్చు కమ్మేస్తోంది. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద కార్చిచ్చు అని అధికారులు తెలిపారు. గత శుక్రవారం నుంచి సుమారు 2,83,800 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వంసం చేసింది. మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు రాంచ్ ఫైర్, రివర్ ఫైర్‌గా రెండు చోట్ల నుంచి వ్యాపిస్తూ మంటలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 75 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. కాలిఫోర్నియా మొత్తం 16 చోట్ల కార్చిచ్చు రగులుతోంది. ఆ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా నిరంతరం పనిచేస్తోంది. కాలిఫోర్నియా పర్యావరణ చట్టాల లోపం వల్లే కార్చిచ్చు ఆ రాష్ర్టాన్ని దావానలంలా మింగేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లను స్థానికులు ఖండించారు. California wildfires are being magnified & made so much worse by the bad environmental laws which aren’t allowing massive amounts of readily available water to be properly utilized. It is being diverted into the Pacific Ocean. Must also tree clear to stop fire from spreading! — Donald J. Trump (@realDonaldTrump) August 6, 2018 -
కారడవిలో కార్చిచ్చు.. కోట్ల ఎకరాలు ఆహుతి!
అమెరికాలోని కాలిఫోర్నియా, కొలరాడో రాష్ట్రాల్లో ఏర్పడిన రెండు కార్చిచ్చులు అక్కడి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ దావానలం వ్యాపించిన ప్రాంతాలకు సమీపంలో ఉంటున్న వేలాది మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అలాగే కొలరాడో కార్చిచ్చుకు బాధ్యుడంటూ ఓ వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నెల వ్యవధిలో బ్రిటన్‌లోని ఉత్తర ప్రాంతం అడవుల్లో ఏర్పడిన రెండు కార్చిచ్చులను అక్కడి ప్రభుత్వం అతికష్టం మీద అదుపులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో కార్చిచ్చు గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం... భూకంపం, కరువు, తుపానులు, వరదలు లాంటి ప్రకృతి విపత్తే కార్చిచ్చు. దీన్ని ఇంగ్లిష్‌లో వైల్డ్‌ఫైర్, వైల్డ్‌ల్యాండ్ ఫైర్, బ్రష్ ఫైర్, బుష్ ఫైర్, ఫారెస్ట్ ఫైర్.. తదితర పేర్లతో పిలుస్తారు. సహజసిద్ధంగానో, మానవ చర్యల వల్లనో అడవులు తగలబడటాన్ని కార్చిచ్చుగా చెప్పొచ్చు. వీటి కారణంగా పక్షులు, జంతువులతోపాటు మానవులూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. దాదాపు 420 మిలియన్ సంవత్సరాల కిందటి నుంచే కార్చిచ్చులు ఏర్పడుతున్నట్లు కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా పరిశోధకులు గుర్తించారు. మానవుని చేష్టలతో ఏర్పడేవే ఎక్కువ! కార్చిచ్చులు సహజంగా మెరుపులు ఏర్పడినప్పుడు, పిడుగులు పడినప్పుడు, చెట్లు రాపిడికి గురైనప్పుడు, అగ్నిపర్వతాల పేలుళ్ల సమయంలో ఏర్పడతాయి. కానీ, ప్రస్తుతం మానవ చర్యల వల్లే అధికంగా సంభవిస్తున్నాయి. కొందరు ఆకతాయి చేష్టలతో నిప్పు పెట్టడం, సిగరెట్లు ఆర్పకుండా పడేయడం, అడవులకు సమీపంలో ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలు, పట్టణీకరణ, పంట పొలాల తయారీ, యుద్ధాలు.. ఇలాంటి వాటిలో ముఖ్యమైనవి. కెనడా, చైనాలో సంభవించే కార్చిచ్చుల్లో అధిక భాగం మెరుపుల వల్ల ఏర్పడుతుండగా, మిగిలిన దేశాల్లోని వాటికి మాత్రం 90 శాతం మానవ చర్యలే కారణమని ఓ పరిశోధనలో తేలింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో అధికం.. అడవులు ఎక్కువగా ఉన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాల్లో కార్చిచ్చులు అధికం. ఈ దేశాల్లో ఏటా ఎక్కడో ఓ చోట భారీ దావానలం ఏర్పడుతుంటుంది. భారత్‌లోనూ అప్పుడప్పుడూ అడవులు తగలబడుతుంటున్నప్పటీకీ ఇవంత భారీ స్థాయిలో ఉండవు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం, నల్లమల అడవుల్లో , తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటివే ఏటా ఏర్పడుతుంటాయి. సైబీరియా తైగాలో 4.7 కోట్ల ఎకరాలు ఆహుతి! 2003లో రష్యాలోని సైబీరియాలో ఏర్పడిన కార్చిచ్చు 4.7 కోట్ల ఎకరాల్లోని అడవిని అగ్నికి ఆహుతి చేసింది. తైగా ఫైర్స్గా పిలచే ఈ దావానలం అత్యధిక విస్తీర్ణంలో అడవిని దహించిందిగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాతి స్థానాల్లో .. నార్త్‌వెస్ట్ టెర్రిటరీస్ ఫైర్–2014 (84లక్షల ఎకరాలు–కెనడా), మనిటోబా వైల్డ్‌ఫైర్–1989 (81లక్షల ఎకరాలు–కెనడా), బ్లాక్ ఫ్రైడే బుష్ ఫైర్–1939 (50లక్షల ఎకరాలు– ఆస్ట్రేలియా), ది గ్రేట్ ఫైర్–1919 (50లక్షల ఎకరాలు–కెనడా) ఉన్నాయి. ఇక అత్యధిక మంది ప్రాణాలను హరించిన కార్చిచ్చుల జాబితాలో 1918 అక్టోబర్ 15న అమెరికాలో ఏర్పడిన ఫారెస్ట్ ఫైర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది వెయ్యిమంది ప్రాణాలను అగ్నికి ఆహుతి చేసింది. 1997, సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో 240 మందిని, 1987 మేలో చైనాలో 191 మందిని, 2009 ఫిబ్రవరి 2న ఆస్ట్రేలియాలో 180 మందిని కార్చిచ్చులు బలితీసుకున్నాయి. వీటికి జంతువులు, పక్షుల సంఖ్య అధికం. కాగా, ఈ ఏడాది మార్చిలో తమిళనాడులోని ఊటీ సమీపంలో కార్చిచ్చు బారిన పడి 8 మంది విద్యార్థులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆర్పడం అంత సులభం కాదు! అప్పుడప్పుడూ ఊళ్లలో ఏర్పడే చిన్న చిన్న అగ్నిప్రమాదాలను ఆర్పాలంటేనే భారీగా నీళ్లు అవసరమవుతాయి. ఇక వందలు, వేల ఎకరాల్లో చుట్టుముట్టిన అగ్నికీలల్ని ఆర్పాలంటే పెద్ద సాహసమే చేయాలి. మొదట గాలి దిశను, మంటల తీవ్రతను అంచనా వేయాలి. అడవుల్లో ఎక్కడెక్కడ రోడ్లు, కాలువలు, నదులు, చెట్లు లేని ప్రాంతాలు ఉన్నాయో ఎంచుకొని అటువైపు నుంచి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. దీన్నే ఫైర్ రింగ్ అంటారు. ఒకవైపు మంటలు అదుపు చేస్తూనే మరోవైపు వ్యాపించకుండా మధ్యలోని చెట్లను కొట్టేయాలి. ఇవన్నీ చేయడానికి ఫైర్ ఫైటర్లు(అగ్నిమాపక సిబ్బంది) ఉంటారు. వీళ్లు ఫైర్‌ఫ్రూఫ్ దుస్తులు, ఆక్సిజన్ మాస్కులు ధరించి, మంట ఆర్పే సామగ్రితో రంగంలోకి దిగుతారు. నీళ్లు చల్లుతారు. కొత్తగా ఇప్పడు ఫైలెట్ రహిత విమానాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మంటలు ఆర్పే రసాయనాన్ని పిచికారి చేస్తారు. నీళ్లనూ చల్లుతారు. అయినప్పటికీ గాలి ఉద్ధృతంగా వీస్తే మాత్రం మంటలు ఆర్పడం అంత సులభం కాదు. దుష్పరిణామాలు కార్చిచ్చులను సకాలంలో అదుపు చేయకపోతే నష్టం భారీ స్థాయిలో ఉంటుంది. వేలు, లక్షల సంఖ్యలో వృక్షాలు బూడిద అవుతాయి. లక్షలాది జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతాయి. కార్చిచ్చులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, కొన్నిచోట్ల ఊళ్లకు ఊళ్లనే స్వాహా చేస్తాయి. అలాగే వాతావరణానికీ తీవ్ర నష్టం కలిగిస్తాయి. అడవులు తగ్గి సకాలంలో వర్షాలు పడవు. భారీగా విడుదలయ్యే పొగ కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఈ పొగను పీల్చిన మనుషులకు శ్వాస సంబంధ సమస్యలు చుట్టుముడతాయి. ఆమ్లవర్షాలు కురుస్తాయి. -
కాలిఫోర్నియాలో మళ్లీ కార్చిచ్చు
-
కార్చిచ్చులో నలుగురు ట్రెక్కర్ల సజీవదహనం
సాక్షి, చెన్నై / తేని: తమిళనాడులో ఘోరం జరిగింది. తేని జిల్లా బోడినాయకనూర్ అటవీప్రాంతంలో ఆదివారం అకస్మాత్తుగా కార్చిచ్చు చెలరేగడంతో ట్రెక్కింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న వారిలో నలుగురు సజీవ దహనమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి కార్చిచ్చులో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. తీవ్రమైన ఉష్ణోగ్రత ప్రభావంతో గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో మంటలు చెలరేగుతుండగా.. అటవీ అధికారులు అదుపుచేస్తూ వస్తున్నారు. ఈ విషయమై తేని జిల్లా కలెక్టర్ పల్లవి బల్దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోడ్‌కు చెందిన 13 మంది, కోయంబత్తూర్‌కు చెందిన 24 మంది ట్రెక్కర్ల బృందం బోడినాయకనూర్ ప్రాంతంలోని కొజుకుమలై ప్రాంతానికి శనివారం చేరుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చెన్నై ట్రెక్కింగ్ క్లబ్ నిర్వహించిందన్నారు. వీరిలో ముగ్గురు పిల్లలు, 8 మంది పురుషులతో పాటు 26 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. కొజుకుమలైలోని ఓ ఎస్టేట్‌లో రాత్రి బసచేసిన అనంతరం తిరుగుప్రయాణం అవుతుండగా అడవిలో కార్చిచ్చు చెలరేగిందని పేర్కొన్నారు. దీంతో బెదిరిపోయి దట్టమైన గడ్డి ఉన్న ఇరుకైన ప్రాంతానికి చేరుకోవడంతో మంటలంటుకుని నలుగురు ట్రెక్కర్లు దుర్మరణం చెందినట్లు స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని భావిస్తున్నామన్నారు. ఈ ట్రెక్కింగ్‌కు వెళ్లినవారిలో పలువురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరికి 80 శాతం కాలిన గాయాలయ్యాయన్నారు. మరోవైపు ప్రమాద విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి.. సాయం చేయాల్సిందిగా రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరారు. దీంతో సీతారామన్ ఆదేశాలతో సులుర్ బేస్ నుంచి బయలుదేరిన రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లు అటవీ ప్రాంతంలో ట్రెక్కర్ల కోసం గాలింపు చేపట్టాయి. వీరిని రక్షించేందుకు సోమవారం ఆర్మీతో పాటు కేరళ, తమిళనాడు అటవీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. -
కాలిఫోర్నియాలో కార్చిచ్చు
-
కాలిఫోర్నియాలో కార్చిచ్చు
శాన్ ప్రాన్సిస్కో : అమెరికాను కొంత కాలంగా ప్రకృతి వైపరీత్యాలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఉత్తర కరోలినాలోని అడవుల్లో వ్యాపించిన కార్చిచ్చు.. 10 మందిని బలి తీసుకుంది. అడవులకు సమీపంలో నివస్తున్న 20 వేల మందిని... అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా.. కార్చిచ్చు మంటలకు సుమారు 15 వేల ఇళ్లు అగ్నికి ఆహుతయినట్లు అధికారులు ప్రకటించారు. అమెరికాలోని అడవుల్లో కార్చిచ్చు సహజంగా వ్యాపించినా.. ఇంత స్థాయిలో ఆస్తి నష్టం జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ఉత్తర కరోలినాలో మొత్తం 94 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం కార్చిచ్చు వందల ఎకరాల్లో ఉందని.. ఈ మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కరోలినా ఫారెస్ట్ అండ్ ఫైర్ ప్రొటక్షన్ డిప్యూటీ డైరెక్టర్ జానెట్ అప్టన్ తెలిపారు. ఆస్తి నష్టం మరింత ఎక్కువగా ఉండేందుకు అవకాశముందని ఆమె అన్నారు. అడవులకు సమీపంలోని నగరాలైన నాపా, నవేదా, ఆరెంజ్, సోనోమా, యాబాల్లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. -
అగ్నికీలల్లో కాలిఫోర్నియా
-
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు