మిరప సాగుకు తరుణమిది


బాల్కొండ :  జిల్లాలో మిరప సాగు తక్కువే అయినా.. ఇటీవలి కాలంలో పలువురు రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జలాల్‌పూర్ గ్రామంలోని పలువురు రైతులు ఏ కాలంలోనైనా మిరప పండిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నా.. నీటి సౌకర్యం ఉన్న రైతులు మిరప సాగు చేస్తున్నారు. పలువురు నారు మళ్లు పోసుకుంటున్నారు. నారు పేసే పద్ధతి

కిలో మిరప విత్తనాలకు థయిరం 3 గ్రా ములు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి.

భూమిని బెడ్ రూపంలో ఎత్తుగా చేసి నారు పోయాలి.

భూమిలో తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. లేకపోతే నారు ఎండిపోతుంది. బెడ్‌గా చేసి నారు పోయడం వల్ల నారులో వేర్లు దృఢంగా ఏర్పడతాయి. దీంతో నారు తీసి నాట్లు వేయగానే మిరప నాటుకుంటుంది.

 

మిరప నాట్లు వేసే భూమిలో వర్మి కంపోస్ట్ లేదా కాంప్లెక్స్ ఎరువులైన 20ః20, డీఏపీలను చల్లాలి. 30 రోజుల తర్వాత నారు పీకి నాట్లు వేయాలి. తెగుళ్లు.. నివారణ

మిరపను ప్రధానంగా రెండు తెగుళ్లు ఆశిస్తాయి. ఒకటి కింది ముడత, రె ండోది పై ముడత. వీటితోపాటు రసం పీల్చు పురుగులూ పంటకు నష్టం చేకూరుస్తాయి.

కింది ముడత ఆశించినప్పుడు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా డైనోపాల్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకు పైముడతకు క్లోరోపైరిఫాస్ లేదా ఇమిడిక క్లోపడ్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

రసం పీల్చు పురుగుల నివారణకు కాపర్ యాసిడ్ క్లోరిఫైడ్ 1.5 మిల్లీ లీటర్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top