‘బార్బిక్యూ’లో కర్రీకింగ్... | curry king pat chapman to visits Hyderabad | Sakshi
Sakshi News home page

‘బార్బిక్యూ’లో కర్రీకింగ్...

Oct 17 2014 2:33 AM | Updated on Sep 2 2017 2:57 PM

‘బార్బిక్యూ’లో కర్రీకింగ్...

‘బార్బిక్యూ’లో కర్రీకింగ్...

ఇండియన్ కర్రీస్ తయారీలో పేరొందిన కర్రీకింగ్ పాట్ చాప్‌మ్యాన్ నగరానికి వచ్చారు.

ఇండియన్ కర్రీస్ తయారీలో పేరొందిన కర్రీకింగ్ పాట్ చాప్‌మ్యాన్ నగరానికి వచ్చారు. బంజారాహిల్స్‌లోని బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్‌లో తనదైన శైలిలో గరిటె తిప్పి ఘుమఘుమలు పంచారు. భారతీయ వంటకాలంటే తనకెంతో ఇష్టమని, తమ అమ్మమ్మల కాలంలో ఇండియాలోని లక్నోలో నివసించిన సందర్భంగా ఇండియన్ డిషెస్ తినడం అలవాటైందని చాప్‌మ్యాన్ చెప్పారు.
 
 ఇండియన్ క్యుజిన్‌లోని వెరైటీలను ఇంగ్లండ్ వాసులకు రుచి చూపించడమే కాకుండా ఈ క్యుజిన్‌లో మాస్టర్‌లను తయారు చేసేందుకు శిక్షణ సైతం అందిస్తున్నానన్నారు. ఈనెల 20 వరల్డ్ చెఫ్స్‌డేను పురస్కరించుకుని బార్బెక్యూ రెస్టారెంట్స్‌లో రోజుకు ఒకటి చొప్పున చాప్‌మ్యాన్ శైలిలో వండిన 14 రకాల ప్రాచుర్యం పొందిన వంటకాలను ఫుడ్ లవర్స్‌కు రుచి చూపిస్తామని బార్బెక్యూ నేషన్ కలినరీ ఆపరేషన్స్ హెడ్ విజయ్ ఆనంద్ భక్షి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement