హాలీవుడ్ లెజెండరీ తార కన్నుమూత | Zsa Zsa Gabor: Hollywood legend dies at 99 | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ లెజెండరీ తార కన్నుమూత

Dec 19 2016 6:26 PM | Updated on Sep 4 2017 11:07 PM

హాలీవుడ్ లెజెండరీ తార కన్నుమూత

హాలీవుడ్ లెజెండరీ తార కన్నుమూత

హాలీవుడ్ లెజెండరీ నటి సాసా గాబర్ (99) కన్నుమూశారు.

వాషింగ్టన్: హాలీవుడ్ లెజెండరీ నటి  సాసా గాబర్ (99) కన్నుమూశారు.  కాలిఫోర్నియాలో తీవ్రమైన గుండెపోటుతో ఆదివారం మరణించినట్టు  ఆమె భర్త ఫ్రెడెరిక్ వోన్ అన్హాల్ట్ ఏఎఫ్పీకి  అందించిన సమాచారంలో తెలిపారు. స్నేహితులు, కుటుంబం చుట్టూ  ఉండగానే ఆమె తుదిశ్వాస విడిచారని  కన్నీటి పర్యంతమయ్యారు.

గాబర్ మరణం పట్లు పలువురు ప్రముఖులు, నటులు సంతాపం ప్రకటించారు. అద్భుతమైన నటి అంటూ  ఆమెను గుర్తు చేసుకున్నారు.  అద్భుతమైన అందం అంతకుమించిన నటనతో పాటూ ఆమె చేసుకున్న  పెళ్లిళ్లు  అప్పట్లో ప్రపంచ సినీ పరిశ్రమలో  సంచలనంగా నిలిచింది.
కాగా హంగేరిలో జన్మించిన ఆమె రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికాకు వలస వెళ్లారు. తొమ్మిది సార్లు వివాహం చేసుకున్న ఆమె మొదటి పెళ్లి 20  ఏళ్ల వయసులో జరిగింది. 1952 లో ఆమె హాలీవుడ్ ప్రవేశం చేశారు. స్టేజ్ నటిగా కరియర్ మొదలు పెట్టిన గాబర్  1936 మిస్ హంగరీ గా ఎన్నికైంది.70 పైగాచిత్రాలలో నటించిన ఆమె  సెలబ్రిటీగా ఒకవెలుగు వెలిగారు.  ఫిబ్రవరి 6, 1917 లో బుడాపెస్ట్ లో   పుట్టిన  సారీ గాబర్  కుటుంబం   సా సా  అని ముద్దు పేరు పెట్టారు. అలా ఆమె సాసా గాబర్ గా ఫ్యామస్ అయ్యారు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement