'చంద్రబాబుకు సింగపూర్లో హోటల్..' | ysrcp spokes man parthasarathi takes on chandra babu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు సింగపూర్లో హోటల్..'

Oct 3 2015 2:55 PM | Updated on Jul 28 2018 6:35 PM

'చంద్రబాబుకు సింగపూర్లో హోటల్..' - Sakshi

'చంద్రబాబుకు సింగపూర్లో హోటల్..'

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిని పెంచిపోషిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ఆరోపించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిని పెంచిపోషిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ఆరోపించారు. చంద్రబాబుకు సింగపూర్పై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగపూర్లోని ఆయన ఆస్తులు, లావాదేవీలపై సీబీఐతో గానీ ఎస్ఎఫ్ఐఓతో గానీ విచారణకు సిద్ధపడాలని పార్థసారథి సవాల్ విసిరారు.

చంద్రబాబుకు సింగపూర్లో హోటల్ ఉందని దేశమంతా తెలుసునని, ఈ అంశాన్ని ప్రముఖ దినపత్రిక సండే గార్డియన్ కథనం ప్రచురించిందని చెప్పారు. బ్లాక్మనీకి సింగపూర్ హబ్గా మారిందని ఆ కథనం పేర్కొందని పార్థసారథి తెలిపారు. చంద్రబాబు తన నిజాయతీ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement