నిప్పు అయితే తప్పుకో | YSRCP MLA Y Visweswara reddy takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

నిప్పు అయితే తప్పుకో

Jun 9 2015 2:44 PM | Updated on May 29 2018 2:28 PM

నిప్పు అయితే తప్పుకో - Sakshi

నిప్పు అయితే తప్పుకో

ఓటుకు నోటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.

అనంతపురం: ఓటుకు నోటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా కోరుతూ ఆయన మంగళవారం ఉరవకొండలో మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషి అయితే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి... ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించుకోవాలన్నారు. తాను చేసిన తప్పును రెండు రాష్ట్రాల మధ్య తగాదాగా మార్చుతున్నారని చంద్రబాబుపై విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement