'ఉగ్రవాదదాడి పిరికిపందల చర్య' | ys jaganmohan reddy condemns gurdaspur-terror attack, | Sakshi
Sakshi News home page

'ఉగ్రవాదదాడి పిరికిపందల చర్య'

Jul 27 2015 5:25 PM | Updated on Apr 4 2018 9:25 PM

పంజాబ్లో గురుదాస్ పూర్ ఉగ్రవాద దాడి ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.

అనంతపురం: పంజాబ్లో గురుదాస్ పూర్ ఉగ్రవాద దాడి ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. ఉగ్రవాదదాడి పిరికిపందల చర్యని వైఎస్ జగన్ పేర్కొన్నారు. దీనానగర్లో ఉగ్రవాదుల దాడిలో పోలీసులు, సాధారణ పౌరులు  చనిపోవడం బాధాకరమని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో పాల్గొంటున్న వైఎస్ జగన్ ఉగ్రవాదదాడి ఘటనపై స్పందించారు.

పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా దీనానగర్ ప్రాంతంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి.. పోలీసులతో పాటు పలువురు సామాన్య పౌరులను కూడా కాల్చి చంపిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో హతమార్చాయి. ఈ దాడిలో  ఎస్పీ బల్జీత్ సింగ్ సహా నలుగురు పోలీసులు మరణించారు.

Advertisement

పోల్

Advertisement