నగర శివారు ప్రాంతమైన మాన్‌కుర్ద్ ప్రాంతంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.
ముంబై: నగర శివారు ప్రాంతమైన మాన్‌కుర్ద్ ప్రాంతంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల్లోకెళ్తే... స్థానికంగా ఉపాధి పొందుతున్న బాధితురాలు తమ్ముడితో కలిసి శాంతినగర్ ప్రాంతంలో నివసిస్తోంది. అప్పటికే పరిచయమున్న యువకుడి నుంచి పెళ్లి చేసుకుంటాననే పిలుపు రావడంతో రమ్మన్న చోటుకు వెళ్లింది.
తీరా అక్కడికి వెళ్లిన ఆమెను ప్రియుడితోపాటు మరో నలుగురు కలిసి వాహనంలో ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకొచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.