
రాయల ‘టీ’ని అంగీకరించం: వెంకయ్యనాయుడు
రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించబోమని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. కాంగ్రెస్ తీరు తమాషాగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.
పది జిల్లాల తెలంగాణకే మా ఓటు : వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించబోమని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. కాంగ్రెస్ తీరు తమాషాగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అడిగితే రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తారా? సరికొత్త రాయల తెలంగాణ ప్రతిపాదన వెనకున్న సహేతుక కారణాలేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెంకయ్య మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణకు సరైన కారణాలు చెప్తే అప్పుడు తమ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు చర్చిస్తాయని పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ వాళ్లు సజావుగా జరగనిస్తారనేది అనుమానమేనన్నారు. రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయాల్సిందేనని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.