భర్తను కట్టేసి.. ఊపిరాడకుండా చేసి..! | Woman tries to suffocate, assaults husband in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భర్తను కట్టేసి.. ఊపిరాడకుండా చేసి..!

May 15 2015 7:02 PM | Updated on Sep 3 2017 2:06 AM

భర్తను కట్టేసి.. ఊపిరాడకుండా చేసి..!

భర్తను కట్టేసి.. ఊపిరాడకుండా చేసి..!

నిద్రపోతున్న భర్తను కాళ్లు, చేతులు కట్టేసి ముఖం చుట్టూ పాలిథిన్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేయడానికి ప్రయత్నించిందో మహిళ.

నిద్రపోతున్న భర్తను కాళ్లు, చేతులు కట్టేసి ముఖం చుట్టూ పాలిథిన్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేయడానికి ప్రయత్నించిందో మహిళ. అంతే కాదు, ఆ తర్వాత కట్టెతో కొట్టి, కొడవలితో దాడి కూడా చేసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుపూర్లో భర్త కన్నన్తో గొడవ జరగడంతో వంజియమ్మళ్ అనే మహిళ అతడిని హతమార్చాలన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

భార్య తనను అశక్తుడిని చేసి చంపేస్తుండటంతో అతడు అరవసాగాడు. అతడి అరుపులు విన్న పిల్లలు లేచి, వాళ్లూ భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు లేచి వెంటనే అక్కడకు చేరుకుని అతడిని కాపాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత వంజియమ్మాళ్ పోలీసుల వద్ద లొంగిపోయింది. తన భర్త పెట్టే చిత్రహింసలను భరించలేకే ఇలా చేసినట్లు ఆమె తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement