పోర్న్ సైట్లలో ఫొటో వస్తుంది.. జాగ్రత్త! | woman blackmailed to pay 2 crores, if not find your pictures on porn sites | Sakshi
Sakshi News home page

పోర్న్ సైట్లలో ఫొటో వస్తుంది.. జాగ్రత్త!

Dec 2 2016 9:19 AM | Updated on Sep 18 2018 8:00 PM

పోర్న్ సైట్లలో ఫొటో వస్తుంది.. జాగ్రత్త! - Sakshi

పోర్న్ సైట్లలో ఫొటో వస్తుంది.. జాగ్రత్త!

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. బిట్‌కాయిన్ల రూపంలో 2 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే ఆమె ఫొటోలను వరుసపెట్టి పోర్నోగ్రాఫిక్ సైట్లలో పెడుతూనే ఉంటామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరించారు.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. బిట్‌కాయిన్ల రూపంలో 2 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే ఆమె ఫొటోలను వరుసపెట్టి పోర్నోగ్రాఫిక్ సైట్లలో పెడుతూనే ఉంటామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీనిపై ఆమె ఫిర్యాదుచేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఈమెయిల్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జబల్పూర్ ఎస్పీ ఆశిష్ తెలిపారు. ఓపెద్ద కుటుంబానికి చెందిన ఆ మహిళ.. ఈ తరహా ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. 
 
ఆమె వ్యక్తిగత సమాచారం, నగ్న ఫొటోలు అన్నింటినీ ఆమె సోషల్ మీడియా కాంటాక్టులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేయడంతో పాటు పోర్న్ సైట్లలో కూడా పెడతామని.. ఇదంతా జరగకూడదంటే బిట్‌కాయిన్ల రూపంలో 2 కోట్లు చెల్లించాలని ఆ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. పైగా అందుకు పెద్ద సమయం కూడా ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. అయితే ఇలాంటి కేసులను విచారించడం అంత సులభంగా అయ్యే పని కాదని పోలీసలు అంగీకరించారు. నిందితులు టీఓఆర్ బ్రౌజర్లు వాడటం వల్ల వాళ్ల సెర్వర్లు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టమని, అలాగే బిట్‌కాయిన్ల రూపంలో చెల్లింపు వల్ల దాన్ని ట్రేస్ చేయడం మరింత క్లిష్టమని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement