టీ నోట్‌ను ఎందుకు చించరు: వాసిరెడ్డి పద్మ | why don't teer Telangana Note, says Vasireddy Padma | Sakshi
Sakshi News home page

టీ నోట్‌ను ఎందుకు చించరు: వాసిరెడ్డి పద్మ

Oct 4 2013 3:25 AM | Updated on May 25 2018 9:10 PM

టీ నోట్‌ను ఎందుకు చించరు: వాసిరెడ్డి పద్మ - Sakshi

టీ నోట్‌ను ఎందుకు చించరు: వాసిరెడ్డి పద్మ

నేరచరిత నేతలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను చించేసినపుడు తెలంగాణ నోట్‌ను ఎందుకు చించేయరని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్: నేరచరిత నేతలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను చించేసినపుడు తెలంగాణ నోట్‌ను ఎందుకు చించేయరని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ను కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశ పెట్టడం అంటే యావత్ సీమాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించడమేనని, ఆ ప్రాంతంలో జరుగబోయే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
 
 ఆమె గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 65 రోజులుగా సీమాంధ్ర ఉద్యమంతో అట్టుడుకుతోంటే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ నోట్‌పై చర్చ జరుగుతున్నా ఆపడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా డ్రామాలాడుతున్నారని ఆమె విమర్శించారు. తన లేఖను వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు రాష్ట్రానికే కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ ద్రోహం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement