రెండేళ్ల గరిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) అంచనాలకు మించి ఎగబాకింది. జూన్ నెలతో పోలిస్తే దాదాపు రెట్టింపు శాతం నమోదైంది. 1.62 శాతం నుంచి 3.55 శాతానికి పెరగడం మార్కెట్ల వర్గాలను విస్మయ పర్చింది.
	న్యూఢిల్లీ: జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ)  అంచనాలకు మించి ఎగబాకింది. జూన్ నెలతో పోలిస్తే దాదాపు రెట్టింపు శాతం నమోదైంది.   1.62 శాతం నుంచి 3.55 శాతానికి పెరగడం మార్కెట్ల వర్గాలను విస్మయ పర్చింది.  ఆహార ధరలు 3.55 శాతంతో  దాదాపు 23 నెలల గరిష్టానికి తాకింది. . జూన్లో  టోకు ద్రవ్యోల్బణం 1.62 శాతంగా ఉంది. 2013 తరువాత ఇదే గరిష్టమని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో  సెంటిమెంట్ దెబ్బతినడంతో  భారీ అమ్మకాల ఒత్తిడి  ఏర్పడింది. సెప్టెంబర్ లో కొత్త పంట వస్తే తప్ప ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గదని   కేర్ రేటింగ్స్ చీఫ్ ఆర్థికవేత్త, మదన్ సబ్నవీస్  అభిప్రాయపడ్డారు. పంట  అనంతరం ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గించేందుకు అవకాశం ఉంది అన్నారు.
	జూన్లో 8.18 శాతం లాభంతో పోలిస్తే టోకు ఆహార ధరలు గత నెల 11.82 శాతం పెరిగింది  వ్యక్తిగత ఆహార వస్తువులలో బంగాళాదుంప ధరలు 59 శాతం, కూరగాయలు 28శాతం,  పప్పులు 36 శాతం,  చక్కెర 32 శాతం  పెరిగాయి. వినియోగదారుల ధరలు ఊహించిన దానికంటే వేగంగా  పెరిగాయి.  జూన్ లో 5.77 శాతం  ఉంటే  ప్రస్తుతం 6.07 శాతం ఎగబాకాయి.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
