మిషెల్లీ ఒబామాను చింపాంజితో పోల్చి | Sakshi
Sakshi News home page

మిషెల్లీ ఒబామాను చింపాంజితో పోల్చి

Published Wed, Nov 16 2016 8:56 PM

మిషెల్లీ ఒబామాను చింపాంజితో పోల్చి

అమెరికా ప్రస్తుత ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాను వెస్ట్ వర్జీనియాకు మేయర్ బెవర్లీ వాలింగ్స్ చింపాంజితో పోల్చారు. అమెరికాకు కొత్త ప్రథమ పౌరురాలు(మెలనియా ట్రంప్) వచ్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, ఇన్నాళ్లు ఆ స్ధానంలో ఓ చింపాంజి ఉండేదని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

వాలింగ్స్ పోస్టుతో చిర్రెత్తుకొచ్చిన నెటిజెన్లు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రథమ పౌరురాలిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది. దీంతో ఆమెను మేయర్ పదవి నుంచి తప్పించాలనే ఒత్తిళ్లు పెరిగాయి. ఈ విషయం తెలుసుకున్న వాలింగ్స్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు క్లే టౌన్ కౌన్సిల్ కు లేఖ రాశారు.

వాలింగ్స్ లేఖను పరిశీలించిన కౌన్సిల్ ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు పేర్కొంది. వైట్ హౌస్ మార్పుపై మాట్లాడానే తప్ప తన మనసులో మరే దురుద్దేశం లేదని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. తాను తెలిసినవారందరికీ జాతి ద్వేషిని కాదని తెలుసని అన్నారు. మిషెల్లీపై చేసిన కామెంట్ కు క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో మరో పోస్టు కూడా చేశారు.

Advertisement
Advertisement