ఫోక్స్ వాగన్ చీట్ చేసిన ఈయూ దేశాలెన్నో తెలుసా?

ఫోక్స్ వాగన్ చీట్ చేసిన ఈయూ దేశాలెన్నో తెలుసా?

కర్బన ఉద్గారాల స్కాంలో మోసపూరిత చర్యలకు పాల్పడిన జర్మన్ కారు తయారీదారి ఫోక్స్వాగన్, యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలనే మోసం చేసిందట. 20కి పైగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో వినియోగదారులు చట్టాలను కొల్లగొట్టిందని యూరోపియన్ కమిషన్ తేల్చింది. ఈ విషయాన్ని జర్మన్ డైలీ డై వెల్ట్ రిపోర్టు చేసింది. ఈ కర్బన ఉద్గారాల స్కాంలో వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించడానికి ఫోక్స్వాగన్ స్వతాహాగా ముందుకు రావాల్సి ఉంటుందని యూరోపియన్ కమిషన్ ఇండస్ట్రి కమిషనర్ ఆదేశించారు. వినియోగదారులు చట్టబద్దంగా నష్టపరిహారం కిందకు వస్తారా అనేది జాతీయ కోర్టులు నిర్ధారిస్తున్నాయని వెల్లడించారు. వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఈయూ వ్యాప్తంగా ఉన్న కన్సూమర్ అసోసియేట్స్కు ఇప్పటికే కన్సూమర్ కమిషనర్ వెరా జౌరోవా లేఖలు రాశారు. సంబంధిత ప్రతినిధులతో ఆమె ఈ వారంలో భేటీ కానున్నట్టు కమిషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఫోక్స్వాగన్ నిరాకరించింది. 

 

కన్సూమర్ గ్రూపులతో పనిచేస్తూ యూరప్లోని క్లయింట్లకు  ఫోక్స్వాగన్ నష్టపరిహారం చెల్లించేలా జౌరోవా కృషిచేస్తున్నారు. డీజిల్ కార్ల ఓనర్లకు బిలియన్ యూరోల నష్టపరిహారం చెల్లిస్తానన్న ఫోక్స్వాగన్, అనంతరం యూరప్లో కర్బన ఉద్గారాల స్కాంకు ప్రభావితమైన 8.5 మిలియన్ వెహికిల్స్కు మాత్రం మాట మార్చింది. విభిన్నమైన చట్టపరమైన నియమాలను అడ్డం పెట్టుకుని ఈ పరిహార చెల్లింపుల నుంచి తప్పించుకుంది. దీనిపై పోరాడుతున్న జౌరోవా యూరోపియన్ మెంబర్ స్టేట్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను విశ్లేషించామని, చాలా దేశాల్లో ఈ కంపెనీ యూరోపియన్ వినియోగదారుల చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడైనట్టు తెలిపారు. ప్రస్తుతం వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించేలా ఫోక్స్వాగన్పై చర్యలకు సిద్దమైనట్టు తెలిపారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top